ETV Bharat / city

'మరో 12 నెలల్లో కాంగ్రెస్‌ రైతురాజ్యం' - తెలంగాణ కాంగ్రెస్ తాజా వార్తలు

Reventh Reddy: సీఎం దత్తత గ్రామంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. లక్ష్మాపూర్‌ నుంచే ధరణి పోర్టల్‌ ప్రారంభించినప్పటికీ ఇంకా 582 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు లేవని ఆయన విమర్శించారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి
author img

By

Published : May 24, 2022, 7:18 AM IST

మరో 12 నెలల్లో కాంగ్రెస్‌ రైతురాజ్యం

Reventh Reddy: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామంలో అభివృద్ది ఏ మాత్రం జరుగలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇదే గ్రామం నుంచి ధరణి పోర్టల్​ను ప్రారంభించారని.. అయినా 582 మందికి పట్టాదారు పాస్ బుక్​లు లేవని.. ఫలితంగా వారికి రైతు బంధు, రైతు బీమా పథకాలు అందడం లేదన్నారు. అధికార యంత్రాంగానికి పదే పదే చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు.

మంత్రి మల్లారెడ్డి అభివృద్ధిని గాలికి వదిలి ఆస్తులు కూడగట్టే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. రెవెన్యూ చట్టాన్ని ధరణి పోర్టల్​ను అడ్డుపెట్టుకుని మూడు చింతలపల్లి కేశవాపూర్ గ్రామాల్లో 150ఎకరాల భూమిని తక్కువ ధరకే కొనుగోలు చేశారని ఆరోపించారు. మంత్రి, ఆయన బావమరిది భూకబ్జాలు, అక్రమాలు, అవినీతిపై కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్‌ నిజాయతీపరుడైతే తాను చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలని.. నిరూపితం కాకపోతే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని రేవంత్‌ సవాల్‌ విసిరారు.

లక్ష్మాపూర్‌లో కుమ్మరి ఎల్లవ్వ ఇల్లు రహదారి విస్తరణలో పోయినా ఇంత వరకు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఆమె ఇంటికి వెళ్లిన రేవంత్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రోడ్డు వేసుకున్న సందర్భంగా తమ ఇల్లు పోయిందని ఎల్లవ్వ చెప్పింది. ప్రభుత్వం వెంటనే పది రోజుల్లో ఎల్లవ్వకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని లేదా రూ.3లక్షలు ఆర్థిక సహాయం అందిచాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ నాయకులే రూ.5లక్షలతో ఇల్లు నిర్మించి ఇస్తారని ప్రకటించారు. రాబోయే 12నెలల్లో కాంగ్రెస్ రైతురాజ్యం అధికారంలోకి వస్తుందని... వచ్చిన వెంటనే లక్ష్మాపూర్ భూ సమస్యలను పరిష్కరిస్తామని వారికి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

"రెవెన్యూ చట్టాన్ని ధరణి పోర్టల్​ను అడ్డుపెట్టుకుని మంత్రి మల్లారెడ్డి వందల ఎకరాల భూమిని తక్కువ ధరకే కొనుగోలు చేశారు. మంత్రి, ఆయన బావమరిది భూకబ్జాలు, అక్రమాలు, అవినీతిపై కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తాం.లక్ష్మాపూర్‌లో కుమ్మరి ఎల్లవ్వ ఇల్లు రహదారి విస్తరణలో పోయినా ఇంత వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. రాబోయే 12నెలల్లో కాంగ్రెస్ రైతురాజ్యం అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే లక్ష్మాపూర్ భూ సమస్యలను పరిష్కరిస్తాం." -రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు

ఇదీ చదవండి: 'అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో!'

చెంబులో ఇరుక్కుపోయిన కోతి తల.. తల్లి వానరం ఏం చేసిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.