ETV Bharat / city

REVANTH REDDY: 'కృష్ణా జలాలను కాపాడటం కంటే సీఎం కేసీఆర్​కు పనులేమున్నాయి' - telangana latest news

కృష్ణా జలాలను కాపాడటం కంటే సీఎం కేసీఆర్​కు పెద్ద పనులు ఏమున్నాయని టీపీసీసీ రేవంత్​రెడ్డి నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతలకు జీవో 203 ఇచ్చినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదని తెలిపారు. 34 శాతం కృష్ణా నీళ్లు చాలని మంత్రిగా హరీశ్‌ సంతకం పెట్టారని పేర్కొన్నారు.

tpcc revanth reddy
revanth reddy
author img

By

Published : Jul 4, 2021, 4:46 PM IST

Updated : Jul 4, 2021, 7:31 PM IST

'కృష్ణా జలాలను కాపాడటం కంటే సీఎం కేసీఆర్​కు పనులేమున్నాయి'

తమకు ఏనాడు 50 శాతం నీళ్లు కావాలని సీఎం కేసీఆర్​ కోరలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. తమకు 34 శాతం నీళ్లు కావాలని చెప్పిందే కేసీఆర్​ అని.. 34 శాతం కృష్ణా నీళ్లు చాలని మంత్రిగా హరీశ్‌ సంతకం పెట్టారని రేవంత్‌ పేర్కొన్నారు. 7 ఏళ్లలో కేవలం 299 టీఎంసీలు వాడుకున్నామన్నారు. కృష్ణా నీటి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుసరిస్తున్న వైఖరిని రేవంత్​రెడ్డి తప్పుబట్టారు. ఈనెల 9వ తేదీన జరగనున్న కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా వేసుకోవాలని సీఎం ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. ఆ సమావేశానికి వెళ్లకుండా రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలను ఎందుకు పెంచుతున్నారని నిలదీశారు. ముఖ్యమంత్రిగా వెళ్లలేని పరిస్థితి ఉంటే... ప్రత్యామ్నాయంగా నీటిపారుదల శాఖపై పట్టున్న కడియం లేదా తుమ్మలను పంపించాలని సూచించారు. జులై 9న జరిగే కేఆర్ఎంబీ సమావేశానికి హాజరై వాదనలు వినిపించకపోతే ఏపీ సీఎం జగన్‌కు లొంగిపోయినట్లేనని రేవంత్​ అన్నారు. కృష్ణా జలాల విషయంలో... వివాదం సృష్టించి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధిపొందడానికే ప్రాజెక్టులను పెండింగ్​లో ఉంచారని ఆరోపించారు.

'ఓట్ల ఎత్తుగడ..'

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సామర్థ్యాన్ని రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో లేని వివాదాన్ని... కేసీఆర్​ సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, నీటి నుంచి ఓట్లు రాబట్టేందుకే ఈ ఎత్తుగడ అని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ అనుమతి తీసుకున్న తరువాతనే రాయలసీమ ప్రాజెక్టును జగన్‌ ప్రారంభించారని, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లినప్పుడు కూడా బేసిన్‌లు లేవు.. భేషజాలు లేవని ప్రకటించిన విషయాన్ని.. రేవంత్​రెడ్డి గుర్తుచేశారు.

కృష్ణా జలాలను వివాదాలు లేకుండా వినియోగించుకుంటామని ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతం లెక్కన నీటిని వాడుకుంటామని సంతకాలు కూడా చేశారని రేవంత్‌ రెడ్డి వివరించారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా యాభై శాతం వాడుకుంటామని కేసీఆర్‌ మాట్లాడుతున్నారన్నారు. ఏపీ సీఎం జగన్ జీవో తెచ్చినప్పుడు, పనులు మొదలుపెట్టినప్పుడు.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ సహా అందరి ఒత్తిడితోనే పాలమూరుకు చెందిన ఓ రైతు ఎన్జీటీలో వేసిన వ్యాజ్యంలో ప్రభుత్వం ఇంప్లీడ్‌ పిటిషన్​ వేసిందని విమర్శించారు.

'కేసీఆర్​ దీక్షకు మద్దతు తెలుపుతాం'

నికర జలాల కేటాయింపుతో చేపట్టాల్సిన కొడంగల్‌ నారాయణపేట్‌ ప్రాజెక్టును చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం దిల్లీ జంతర్​ మంతర్​ వద్ద కేసీఆర్, కేటీఆర్‌లు ఆమరణ దీక్ష చేయాలని అందుకు తాము కూడా మద్దతు తెలుపుతామని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

'మహబూబ్​నగర్​, రంగారెడ్డి, హైదరాబాద్​కు తాగునీరు అందిస్తోన్న కృష్ణానది జలాలను జగన్​ దోపిడీ చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర పోతుంటే.. పాలమూరుకు చెందిన సామాన్య రైతు జాతీయ హరిత ట్రైబ్యునల్​లో కేసువేసి స్టే తీసుకువచ్చిన తర్వాత.. అందరి ఒత్తిడి మేరకు విధిలేని పరిస్థితుల్లో అందులో ఇంప్లీడ్​ పిటిషన్​ వేశారు. మీరు అన్ని రకాలుగా సహకరిస్తున్న ప్రభుత్వమే కేంద్రంలో ఉంది. మీ వాదనను తెలంగాణ ప్రజల తరఫున వినిపించుంటే.. ఈ ప్రాజెక్టులు శాశ్వతంగా ఆగిపోయి ఉండేవి కదా.. ఇప్పుడు కూడా జులై 9న కేఆర్​ఎంబీ సమావేశం పెడతామంటే.. జులై 20 పెట్టాలని కేసీఆర్​ చెబుతున్నారు. కృష్ణానది జలాల కంటే.. ముఖ్యమైన పనులు.. ముఖ్యమంత్రిగా మీకు ఏమున్నాయి.

-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు.

ఇదీచూడండి: WATER DISPUTE : 'ఏపీ ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తాం'

Last Updated : Jul 4, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.