దళిత బంధు పథకం ప్రారంభం సందర్భంగా హుజూరాబాద్ సభలో సీఎం కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెప్పారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అబద్ధాల పునాదుల మీద బీటలు వారుతున్న గులాబీ కోటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌కు ఇదే చివరి రాజకీయ ప్రసంగంగా భావిస్తున్నామన్నారు. ఈ నెల 18న ఇబ్రహీంపట్నం దళిత, గిరిజనసభ తర్వాత హుజూరాబాద్‌పై పూర్తిగా దృష్టి సారించనున్నట్లు వివరించారు. కేసీఆర్ సభ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్ సభ పెడతామని రేవంత్ రెడ్డి తెలిపారు.
‘‘ఉద్యమంలో కేసీఆర్.. దళితులను ఒక పాచిక లాగా వాడుకున్నారు. నెక్లెస్ రోడ్డులో ప్రపంచమే అబ్బురపడే విధంగా అంబేడ్కర్ విగ్రహం పెడతానని చెప్పి ఇప్పటికీ తట్టెడు మట్టి తియ్యలేదు. దళితులకు మూడెకరాల భూమి అని చెప్పి మాట తప్పారు. ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం వల్లే సురేష్ నాయక్, లావణ్య లాంటి విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్నారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు యత్నించిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దళితులకు అన్యాయం చేసిన వాళ్లలో మొదటి ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. దళితబంధు సభలో అన్ని అబద్ధాలే చెప్పారు’’
-రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
‘‘అంబేడ్కర్ పేరు మీద పెట్టిన ప్రాణహిత చేవెళ్ల గురించి ఏ ఒక్కరోజైనా కేసీఆర్ మాట్లాడారా? మిషన్ కాకతీయ పేరుతో చెరువుల మట్టిని కాంట్రాక్టర్లకు అమ్ముకున్న చరిత్ర తెరాసది. చెరువుల్లో మట్టిని అమ్ముకొని కోట్ల రూపాయలు ఆ పార్టీ నాయకులు సంపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు- మిషన్ కాకతీయ- మిషన్ భగీరథ ప్రాజెక్టులు ప్రజల కోసం కాదు- ప్రజాధనం దోచుకోవడానికే! ఏడేళ్ల కాలంలో దళితులకు- గిరిజనులకు ఒక్క పైసా కూడా దక్కలేదు. ఒక్క శాసనసభ స్థానం గెలవడానికి కేసీఆర్ పూర్తిగా దిగజారారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవడానికి శోభమ్మను కూడా తెరమీదకు తెచ్చారు. దళితుల కోసం ఉన్న 4వేలకు పైగా ఉన్న సింగిల్ టీచర్ స్కూళ్లను కేసీఆర్ మూసివేయించారు. కేసీఆర్ పాలనలో దళిత- గిరిజనులు విద్య, ఉద్యోగాలకు దూరమయ్యారు. శాసనసభ సమావేశాలు వెంటనే నిర్వహించాలి. దళితబంధుపై ఒకరోజు చర్చ జరిపి తీర్మానం చెయ్యాలి. ఆరు నెలల్లోపు ప్రతి దళిత కుటుంబానికీ రూ.10 లక్షలు ఇస్తామంటే మేం ఎక్కడైనా సంతకాలు పెడతాం. హుజూరాబాద్‌లో త్వరలో తుపాను రాబోతోంది. ఆ తుపానులో కేసీఆర్ కొట్టుకుపోతారు. ఇబ్రహీంపట్నం పట్నం సభ తర్వాత హుజురాబాద్‌పై దండెత్తుతాం. రాజకీయంగా కేసీఆర్ దళితబంధు సభనే చివరి ఉపన్యాసం’’ -రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
దళితబంధుకు పూర్తి మద్దుతు ఇస్తామన్న రేవంత్‌రెడ్డి..... అసెంబ్లీ ఏర్పాటు చేసి పథకంపై చర్చించాలని సూచించారు. ఎస్సీలతో పాటు ఎస్టీలకు కూడా 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితబంధుకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈనెల18న దళిత, గిరిజన సభ తర్వాత హుజూరాబాద్‌పై దృష్టి పెడతామని వెల్లడించారు. కేసీఆర్ సభ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్ సభ నిర్వహిస్తామన్నారు.
ఇవీ చూడండి: