ETV Bharat / city

REVANTH REDDY: 'రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా కాంగ్రెస్​ సిద్ధమే' - telangana varthalu

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. పార్టీలో అందరిని కలుపుకుని ముందుకు పోయేందుకే సీనియర్లను కలుస్తూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల ఏడో తేదీన తాను పీసీసీ పదవీ బాధ్యతలు చేపట్టేలోపు అందరిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడంతోపాటు....కాంగ్రెస్​ను మరింత బలోపేతం చేసేందుకు పాలసీలు, కాలిక్యులేషన్‌, కమ్యూనికేషన్‌, ఎగ్జిక్యూషన్‌ అనే నాలుగు అంశాలను ప్రధానంగా తీసుకుని కచ్చితంగా అమలయ్యేట్లు చూస్తామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం...కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. షర్మిల పెడుతున్న నూతన పార్టీ.. కాంగ్రెస్‌పై ఎలాంటి ప్రభావం చూపబోదన్న టీపీసీసీ చీఫ్​ రేవంత్‌ రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

revanth
REVANTH REDDY: 'రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా కాంగ్రెస్​ సిద్ధమే'
author img

By

Published : Jul 3, 2021, 1:27 PM IST

REVANTH REDDY: 'రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా కాంగ్రెస్​ సిద్ధమే'
  • పీసీసీ అధ్యక్షుడి పదవి వస్తుందని ముందే ఏమైనా సంకేతాలు ఉన్నాయా?

నాకు ఎలాంటి సమాచారం లేదు. దిల్లీలో కొన్ని కార్యక్రమాలు, న్యాయవాదులతో సంప్రదింపులు, కమిటీ మీటింగ్​లు ఉంటేనే అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ కార్యక్రమాలు చూసుకుని ఇక్కడకు వచ్చిన తర్వాత రాష్ట్ర పార్టీ ఇంఛార్జి ఆర్డర్​ విడుదల చేశారు. పార్లమెంట్​ ఎన్నికల అనంతరం ఉత్తమ్​ కుమార్​ రెడ్డి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ అధిష్ఠానం సీనియర్​ నేతలతో పాటు అందరి వివరాలను సేకరించి, క్రోడీకరించి ఈ నిర్ణయం తీసుకుంది.

  • పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. కానీ ఈ పదవి మిమ్మల్నే వరించడానికి కారణాలేంటి?

కాంగ్రెస్​ పార్టీలో యువకులకు మొదటి నుంచి ప్రాధాన్యత ఉంది. 1984-85 సమయంలో ఎన్టీఆర్​ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినపుడు కాంగ్రెస్​ పార్టీని బలంగా నడిపించడానికి అత్యంత పిన్న వయస్కుడైన 34ఏళ్ల వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. ఆ రోజు పీవీ నర్సింహరావు, మర్రి చెన్నారెడ్డి, విజయ్​భాస్కర్​రెడ్డి, జలగం వెంగళ్రావు, అంజయ్య, భవనం వెంకట్రామ్​ ఇలాంటి ఎంతో మంది ఉద్ధండులు ఉన్నారు. ఇంత మంది ఉన్నా.... ఆ సందర్బంలో 34ఏళ్ల వైఎస్సార్​ను పీసీసీగా నియమించారు. తర్వాత కూడా చాలా మంది సీనియర్లు ఉన్నా వయస్సులో ఉన్న ఉత్తమ్​కుమార్​ రెడ్డిని నియమించారు. పార్టీలో వయస్సు ప్రాధాన్యత కంటే రాష్ట్రంలో ఉండే స్థానిక పరిస్థితులను బట్టి పీసీసీని నియమించింది. ఎన్నో కాంబినేషన్స్​లో విచారించి నాకు పార్టీ ఈ బాధ్యత అప్పగించింది. ఇది నాకు ఓ గురుతర బాధ్యత. నా అనుభవానికి మించిన బాధ్యత.

  • పీసీసీ చీఫ్​గా మీ ముందున్న లక్ష్యం ఏమిటీ? సరైన నాయకత్వం లేక చాలా మంది పార్టీని వదిలివెళ్లిపోయారు. ఉన్న కార్యకర్తలు కూడా నిశ్చేష్టులయ్యారు. ఈ పరిస్థితులను సరిదిద్దడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తారు?

ప్రధానంగా 30 సంవత్సరాల రాజకీయ పరిణామాలను గమనిస్తే... పలు సందర్భాల్లో కాంగ్రెస్​ ఓటమి పాలైంది. అప్పుడు పలువురు.. కాంగ్రెస్​ పని అయిపోయిందన్నారు. కానీ 2004లో దాదాపు 250సీట్లతో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చింది. 2014 వరకు కాంగ్రెస్​ అధికారంలో ఉంది. 1994 నుంచి 2004 వరకు తెదేపా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్​, 2014 నుంచి 2024 వరకు తెరాస అధికారంలో ఉన్నాయి. పది సంవత్సరాలు ఒక్కొక్క పార్టీకి అవకాశమిచ్చారు. తెరాసకు తెలంగాణలో కాలం చెల్లిపోయింది. కేసీఆర్​ ఎంత చెప్పుకున్నా.. తెలంగాణ ఉద్యమం చేసినా, తెలంగాణ కోసం కొట్లాడినా, రాష్ట్రం కోసం చావు నోట్లో తలకాయ పెట్టిన అని ఎన్నిసార్లు చెప్పుకున్నా... కేసీఆర్​ చేసిన శ్రమ కంటే, త్యాగం కంటే ప్రజలు చాలా ఎక్కువిచ్చారు. తెలంగాణ ప్రజలను ఆయన స్వేచ్ఛ లేకుండా నిర్బంధించారు. ఆయన నుంచి తెలంగాణ సమాజం విముక్తి కోరుకుంటోంది. ఇక ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాల్సిన బాధ్యత కాంగ్రెస్​ పార్టీకి ఉంది. కేసీఆర్​కు మేమే ప్రత్యామ్నాయం.

  • ఏఐసీసీ ప్రకటన చేసే ముందు నుంచే సీనియర్​ నేతలను వరుసగా కలుస్తున్నారు. మీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు?

ఏ సీనియర్లయితే సోనియాగాంధీ ప్రకటన రాక ముందే భిన్నాభిప్రాయాలు చెప్పారో... అదే సీనియర్లు ఇవాళ నాకు అండగా నిలబడి కార్యాచరణకు సహకరించారు. ఉదాహరణగా ఒకటి చెప్తా.. వి.హనుమంతరావు ఆసుపత్రిలో ఉన్నారంటే వెళ్లి పలకరించాను. ఆయన తన ఆరోగ్యం గురించి, ఆర్థిక విషయం గురించి మాట్లాడకుండా... తెలంగాణ సమాజంలో ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం వంటి సామాజిక అంశాలు చర్చించారు. సోనియా గాంధీ కూడా వీహెచ్​ను పరామర్శించారు. పీసీసీ నిర్ణయానికి ముందు వీహెచ్​ చాలా విషయాలు ప్రస్తావించారు. కానీ నిర్ణయించిన తర్వాత సోనియా గాంధీ నిర్ణయంతో అందరూ ఏకీభవించారు.

  • ఇప్పటికీ కొంత మంది సీనియర్​ నాయకులు మిమ్మల్ని కలిసేందుకు వెనకాడుతున్నారు. మీరు అపాయింట్​మెంట్​ అడిగినా ఇవ్వడం లేదు. వాళ్ల విషయంలో ఎలా ముందుకెళ్తారు?

అవి మీ అపోహలే. చాలా మంది సీనియర్లు పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు. 90 శాతం మంది సీనియర్లు అనుకూలంగానే ఉన్నారు. నేను ఈ నెల 7వ తేదీన పీసీసీ చీఫ్​గా ఛార్జ్​ తీసుకునే లోపల మీకున్న అపోహలపై వారే సమాధానాలు ఇస్తారు. ఇవాళ పీసీసీ కుర్చీలో ఎవరు కూర్చున్నా.. ఆ హోదాకు గౌరవం ఇవ్వాల్సిందే. రేవంత్​రెడ్డి అనే దాన్ని వదిలేయండి... సోనియా గాంధీ నాకు బాధ్యతలు అప్పగించారు. ఆ కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహిస్తాను. మిగతా వాళ్లు కూడా నాకు సహకరిస్తారు.

  • ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్​ పార్టీని ప్రజలు ఆదరించలేదు. దీనిపై మీరేమంటారు?

తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్​ నాయకులు వీరోచితంగా పోరాటం చేశారు. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్​ నేతలు ఎయిర్​ పోర్టులో దిగి ఇంటికిపోతే... కేసీఆర్​ హంగామా చేసి తానే సాధించినట్లు హడావుడి చేశారు.

  • పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్​ పాదయాత్ర చేస్తారు. దీనిపై ఏమంటారు?

బస్సు యాత్రైనా, పాదయాత్రైనా పార్టీలో అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం జరుగుతుంది.

  • రాష్ట్రంలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సెటిలర్లు చాలా కీలకం. వాళ్ల విషయంలో కాంగ్రెస్​ పక్షాన రేవంత్​ రెడ్డి ఏ వైపు వెళతారు?

సెటిలర్స్​ అనే విషయాన్ని నేను ఒప్పుకోను. సెటిలర్​ అనే పదమే లేదు. ఆ లెక్కన వస్తే నేను కూడా సెటిలర్​నే.

  • రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం నెలకొంది. చాలా రోజులుగా ఇద్దరు ముఖ్యమంత్రులు బాగానే ఉన్నారని వినిపించింది. కానీ ఉన్నపళంగా ఈ జలవివాదం తెరపైకి వచ్చింది. ఎందుకంటారు?

నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇదే తెరాస పార్టీ అజెండా. నీళ్లలోనే నిధులను చూస్తున్నారు కేసీఆర్​. నిధులు కావాల్సినప్పుడల్లా నీళ్ల టెండర్లు పిలవాలే.. నిధులు సంపాదించుకోవాలే. ఓట్లు కావాలన్నా, నిధులు కావాలన్నా నీళ్లే ఆయనకు దిక్కు. నీళ్లు ఆయనకు ఆదాయ వనరు. కేసీఆర్​కు కుటుంబ తగాదాల వల్ల కంటి మీద కునుకులేని పరిస్థితులొచ్చాయి. వీటన్నింటి నుంచి బయటికి రావాలంటే మరొక భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలి.

  • పోతిరెడ్డిపాడు అనేది అప్పటి వైఎస్సార్​ కాలం నుంచి వస్తోంది. ఇప్పుడు ఆ విషయంపై భావోద్వేగాలను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి? దీనిని కాంగ్రెస్​ ఏ విధంగా చూస్తోంది?

పోతిరెడ్డిపాడు అనేది వైఎస్సాఆర్​కు పరిమితం చేయాల్సిన పనిలేదు. అది ఎన్టీఆర్​ ప్రారంభించిన ప్రాజెక్టు. దీనిలో భాగంగా జగన్మోహన్​ రెడ్డి కాస్త ఎక్కువగా నీటిని తరలించడానికి ఉపాయం చేశారు. జగన్మోహన్​ రెడ్డి ప్రతిపాదనల ప్రకారం నీటిని తరలిస్తే శ్రీశైలంలోకి చుక్క నీరు కూడా రాదు.

  • ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై బాహాటంగానే అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇన్ని రోజులైనా ఎవరు దీని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. దీనిపై కాంగ్రెస్​ పార్టీ అభిప్రాయం ఏంటి?

కాంగ్రెస్​ పార్టీ అప్పట్లోనే ప్రస్తావించింది. నాగం జనార్దన్​ రెడ్డి ముఖ్యమంత్రికి, గవర్నర్​కు లేఖ రాశారు. సంగంబండ వద్ద లిఫ్ట్​ ఇరిగేషన్​ తీసుకొస్తే ఖమ్మం, మహబూబ్​నగర్​, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వైఎస్సార్​ను మంత్రులు తిడుతున్నా.. ఏపీ సీఎం జగన్​, విజయమ్మలు స్పందించలేదు. దీనిని బట్టి వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చు.

  • షర్మిల పెట్టే పార్టీ కాంగ్రెస్​పై ప్రభావం చూపనుందా?

వైఎస్సార్​ కుటుంబం పట్ల ప్రజలకు అభిమానం ఉంది. కానీ రాజకీయాలు వారికి కట్టబెడతారని కాదు. రాజశేఖర్​ రెడ్డి అభిమానులను ఒక వైపు నెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు.

  • మనకు ఎన్నికలు రావడానికి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీని ఏ విధంగా చూడవచ్చు. ఆ ఎన్నికలకు పార్టీపరంగా మీ సమాయత్తమేంటి?

కేసీఆర్​ లాంటి వ్యక్తి పదవిలో ఉన్నారు కాబట్టి ఎన్నికలు ఎప్పుడొస్తాయో చెప్పలేం. 2022 చివరలోనే కేసీఆర్​ ఎన్నికలకు వస్తారేమో అని వ్యక్తిగతంగా అనుకుంటున్నా. ఎన్నికలొప్పుడొచ్చినా అందరం కలిసి సమష్టిగా ఎదుర్కొంటాం. ఇక పార్టీని ప్రధానంగా నాలుగు విధాలుగా నడుపుతాం. అవి.. పాలసీ, కాలిక్యులేషన్‌, కమ్యూనికేషన్‌, ఎగ్జిక్యూషన్‌. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఏ విధానాలు అవలంభించాలన్నది పాలసీ. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పేరు మీదే ఎన్నికల్లోకి వెళ్తాం.

ఇదీ చదవండి: KRISHNA BOARD: జలజగడం తీవ్రం... రంగంలోకి కృష్ణా యాజమాన్య బోర్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.