ETV Bharat / city

TPCC Chief Revanth Reddy : 'గుండెలా నిండా ఊపిరి పీల్చుకుని గాంధీని స్మరిస్తే.. ఏదైనా సాధ్యమే' - Gandhi jayanthi in Gandhi Bhavan 2021

గుండెల నిండా ఊపిరి పీల్చుకుని మహాత్మా గాంధీని స్మరించుకుంటే.. ఎంత గొప్ప పోరాటమైనా ఫలిస్తుందని, ఎంత పెద్ద లక్ష్యమైనా సాధిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) అన్నారు. గాంధీ జయంతి(Gandhi Jayanthi 2021) సందర్భంగా గాంధీభవన్​లో జాతిపిత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

TPCC Chief Revanth Reddy
TPCC Chief Revanth Reddy
author img

By

Published : Oct 2, 2021, 12:10 PM IST

Updated : Oct 2, 2021, 2:19 PM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

మహాత్మాగాంధీ జయంతి(Gandhi Jayanthi 2021) సందర్భంగా గాంధీభవన్​లో మహాత్ముడి విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి దేశానికి గాంధీ చేసిన సేవలు స్మరించుకున్నారు. అనంతరం లాల్​బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జ్ మాణికం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు బోసురాజు, షబ్బీర్ అలీ, పొన్నాల పాల్గొన్నారు.

గాంధీ(Gandhi Jayanthi 2021) కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి రాష్ట్ర సర్కార్ కృషి చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. సంపూర్ణ సమైఖ్య జాతి నిర్మాణం, రాజకీయాల్లో నైతికతను గాంధీ ఆశించారని తెలిపారు. నిజాయతీతో కూడిన రాజకీయాలు రావాలంటే ప్రజలు చైతన్యవంతులవ్వాలని ఆకాంక్షించారు. బాపూ జీవితం, ఆయన ఆదర్శాలు నేటి తరం అనుసరించాలని అన్నారు. గాంధీ ఆచరించిన సూత్రాలు సమకాలీన ప్రపంచానికి చాలా అవసరమని చెప్పారు. ఇవి లక్షలాది మందికి బలాన్నిస్తాయని పేర్కొన్నారు.

"సత్యం, అహింసలే ఆయుధాలుగా గాంధీ పోరాడారు. స్వరాజ్య సంగ్రామ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికారు. భారతదేశాన్ని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దారు. ప్రపంచ దేశాల్లో భారత్​ను బలంగా తీర్చిదిద్ది, అన్ని దేశాలకు ఆదర్శంగా నిలపడానికి గాంధీ ఎంతో కృషి చేశారు. చివరి శ్వాస వరకు దేశఅభ్యున్నతి కోసం బాపూజీ పాటుపడ్డారు. ఎంత పెద్ద సమస్య అయినా శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చని జాతిపిత నిరూపించారు. బాపూ బాటలో నేటి యువత పయనించాలి. బాధ్యతాయుతంగా మెలిగి దేశ ప్రగతిలో భాగస్వాములవ్వాలి."

- రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

విదేశీ వస్తువుల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి పోరాటాలతో తెల్లదొరలను గజగజ వణికించిన ఏకైక వ్యక్తి.. గొప్ప శక్తి.. మహాత్మా గాంధీ(Gandhi Jayanthi 2021) అని రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) అన్నారు. మహాత్ముడి ఆశయాలతో.. ఆలోచనలతో పాలన చేయాల్సిన ప్రజాప్రతినిధులు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా పరిపాలిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని పెట్టుబడి దారుల చేతిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మేం ఇద్దరం.. మాకిద్దం అన్నట్లు ప్రధాని మోదీ-కేంద్రమంత్రి అమిత్​షా.. దేశాన్ని.. అదానీ, అంబానీలకు అమ్మేందుకు కంకణం కట్టుకున్నారని అన్నారు. ఓటు వేసి ఎన్నుకున్న ప్రజల భవిష్యత్​ను ఆ ఇద్దరి చేతిలో పెట్టేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు.

నాటీ గాంధీ, శాస్త్రీల సిద్ధాంతాలను నేటి పాలకులు తుంగలో తొక్కుతున్నారని రేవంత్(TPCC Chief Revanth Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి దేశాన్ని అన్ని రంగాల్లో అద్భుతంగా నిర్మిస్తే భాజపా పాలకులు భారత్​ను బేరానికి పెట్టారని ఆరోపించారు. తెలంగాణను గులాబీ చీడ పీడిస్తోందని.. విద్యార్థులు, యువకుల పోరాట ఫలితంగా సాధించిన తెలంగాణలో అన్ని రకాల మోసాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇటు కేంద్రం.. అటు రాష్ట్ర ప్రభుత్వాలు గాంధీ(Gandhi Jayanthi 2021) ఆశయాలకు అనుగుణంగా ఆయన చూపిన బాటలో నడుస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు.

Last Updated : Oct 2, 2021, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.