ETV Bharat / city

America Visa Interviews : అమెరికా పర్యాటకులకు గుడ్‌న్యూస్

author img

By

Published : Apr 28, 2022, 7:06 AM IST

America Visa Interviews : అమెరికా వెళ్లేవారికి గుడ్‌న్యూస్. సెప్టెంబర్ నుంచి పర్యాటక వీసా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ ప్రకటించింది. వచ్చే నెల నుంచి విద్యార్థి(ఎఫ్‌-1) వీసా ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులోకి రానున్నాయని.. జూన్‌ నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయని తెలిపింది.

America Visa Interviews
America Visa Interviews

America Visa Interviews : అమెరికా వెళ్లేవారికి శుభవార్త. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి వీసా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. పర్యాటక వీసా(బీ1-బీ2) కోసం తొలిసారి దరఖాస్తు చేసుకునేవారికి ఇప్పటివరకు పరిమితంగానే వీసాలు జారీ అవుతున్నాయి. కరోనా సమయం నుంచి వీసాల జారీని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు అన్ని కాన్సులేట్‌ కార్యాలయాలు పరిమితం చేసిన విషయం తెలిసిందే. గడువు ముగిసిన వీసాల పునరుద్ధరణను డ్రాప్‌ బాక్స్‌ విధానంలో అనుమతిస్తున్నారు. తొలిసారి పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ప్రస్తుతం 890 రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

America Visa Interviews From September : సెప్టెంబరు నుంచి ఇంటర్వ్యూల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ తాజాగా ప్రకటించింది. ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ స్లాట్లను దశలవారీగా పెంచేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చేనెల నుంచి విద్యార్థి(ఎఫ్‌-1) వీసా ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. జూన్‌ నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. గడిచిన ఏడాది మిషన్‌ ఇండియా ద్వారా 62 వేల మంది విద్యార్థులకు అమెరికా జారీ చేసింది. ఈ దఫా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో జారీ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.