ETV Bharat / city

115 డివిజన్లలో తెరాస-భాజపాల మధ్య హోరాహోరీ పోరు

గ్రేటర్‌ ఎన్నికల్లో పలు డివిజన్లలో పోరు హోరాహోరీగా సాగింది. కొన్నిచోట్ల ఏకపక్షంగా.. అత్యధిక చోట్ల ముఖాముఖి, ఇంకొన్నిచోట్ల త్రిముఖ, చతుర్మఖ పోటీ నెలకొంది.

tough fight between trs and bjp in ghmc elections
తెరాస-భాజపాల మధ్య హోరాహోరీ పోరు
author img

By

Published : Dec 6, 2020, 11:05 AM IST

నాలుగు పార్టీల నడుమ..

భోలక్‌పూర్‌ పోరు ఈసారి ఆసక్తికరంగా సాగింది. నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థుల నడమ చతుర్ముఖ పోరు నడిచింది. ఎంఐఎం అభ్యర్థికి 9,048 ఓట్లురాగా తెరాస 6,437, కాంగ్రెస్‌ 5,125, భాజపాకు 4,396 ఓట్లు వచ్చాయి. ● రహ్మత్‌నగర్‌లోనూ ఇదే పోరు నడిచింది. తెరాసకు 14,972, భాజపాకు 5,276, కాంగ్రెస్‌కు 4,209 ఓట్లు రాగా ఎంఐఎం 3,323 ఓట్లు సాధించింది.

ముగ్గురి మధ్య పోరు నడిచినవి

  • గాజులరామారంలో త్రిముఖ పోరు సాగింది. తెరాస అభ్యర్థి రావుల శేషగిరి 13,267, కాంగ్రెస్‌ అభ్యర్థి కూన శ్రీనివాస్‌గౌడ్‌(12,830 ఓట్లు)పై విజయం సాధించారు. భాజపా అభ్యర్థికి 4531 ఓట్లు వచ్చాయి.
  • ఎ.ఎస్‌.రావునగర్‌ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిరీషారెడ్డి 9043 ఓట్లు సాధించి గెలుపొందారు. భాజపా అభ్యర్థి చంద్రిక 4647, తెరాస అభ్యర్థి పి.పావని 4513 ఓట్లు సాధించారు.
  • నాచారంలో త్రిముఖ పోరులో తెరాస అభ్యర్థి భాజపాపై గెలుపొందారు.
  • ఉప్పల్‌లో తెరాస, భాజపా అభ్యర్థులను వెనక్కి నెట్టి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.రజిత భారీ ఆధిక్యంతో గెలుపొందారు.
  • హస్తినాపురం, లింగోజిగూడలో తెరాస, కాంగ్రెస్‌లపై భాజపా అభ్యర్థులు విజయం సాధించారు.
  • జాంబాగ్‌లో మూడు పార్టీల నడుమ పోరు నడవగా ఎంఐఎం అభ్యర్థిపై భాజపా అభ్యర్థి స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు.
  • ఎర్రగడ్డ త్రిముఖ పోరులో ఎంఐఎం విజేతగా నిల్చింది. తెరాసకు 7,737, భాజపాకు 5,502 ఓట్లు వచ్చాయి.

అందులో మజ్లిస్‌ హవా

21 డివిజన్లలో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇక్కడ 70 నుంచి 90 శాతం ఒక పార్టీకే నమోదయ్యాయి. పాతబస్తీలోనే ఎక్కువగా ఇవి ఉన్నాయి. ఎంఐఎంతో తెరాస పోటీపడినా చాలాచోట్ల డిపాజిట్లు దక్కలేదు. ఛావుని డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థికి 14,714 ఓట్లు వస్తే సమీప ప్రత్యర్థి తెరాసకు వచ్చినవి 856 ఓట్లు మాత్రమే.

ముఖాముఖి పోరులో..

గ్రేటర్‌లోని 150 డివిజన్లలో 115 చోట్ల తెరాస, భాజపాలు నువ్వానేనా అన్నట్లుగా తలపడ్డాయి. మూడో స్థానంలో నిలిచిన పార్టీకి అత్యధిక చోట్ల డిపాజిట్లు దక్కలేదు. 5 చోట్ల తెరాస-కాంగ్రెస్‌, కొన్నిచోట్ల ఎంఐఎం-భాజపా, ఎంఐఎం-తెరాస పోటీపడ్డాయి. 24 చోట్ల వెయ్యిలోపు ఆధిక్యం, మరో 75 స్థానాల్లో రెండు మూడు వేల లోపు ఆధిక్యాలతో అభ్యర్థులు గెలుపొందారు. ఎల్‌బీనగర్‌ పరిధిలో ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా డివిజన్లలో భాజపా భారీ ఆధిక్యాలతో గెలుపొందింది.

డివిజన్లు

ఏకపక్షం 21

ద్విముఖం 115

త్రిముఖపోరు 12

చతుర్ముఖ పోటీ 2

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.