1. భూమిపూజ
జంటనగరాల పరిధిలో రూ.426 కోట్లతో నిర్మించ తలపెట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఎలివేటెడ్ కారిడార్, మరో ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2. ఎయిర్‌పోర్టులో ఫాస్టాగ్
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతున్నందున శంషాబాద్ విమానాశ్రయంలో నూతన విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విమానాశ్రయానికి వచ్చిపోయే వాహనాల పార్కింగ్ చెల్లింపులకు స్పర్శ రహిత(కాంటాక్ట్ లెస్) విధానాన్ని ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సహకారంతో త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3. ముష్కరుల హతం
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. శనివారం తెల్లవారుజామున సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించాారు ముష్కరులు. వీరిని అడ్డుకునే క్రమంలో ఉగ్రమూకలు, జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4. 519 మరణాలు
భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజులోనే 519 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 27,114 మందికి వైరస్ సోకింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5. ధారావిలో భేష్
కేసుల ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ముంబయిలోని ధారావి మురికివాడలో వైరస్‌ను అరికట్టేందుకు మెరుగైన చర్యలు చేపట్టారని ప్రశంసలు కురిపించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). వైరస్ విజృంభిస్తున్నప్పటికీ కరోనాను నియంత్రించడం సాధ్యమేనని ధారావి యంత్రాంగం నిరూపించిందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
6. ఒక్కరోజే 71 వేల కేసులు
ప్రపంచంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. అమెరికా, బ్రెజిల్లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య కోటీ 26 లక్షలు దాటింది. 5,62,769 మంది వైరస్‌కు బలయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
7. ఇప్పట్లో లేనట్టే
అమెరికా-చైనా రెండో దశ వాణిజ్య ఒప్పందానికి తక్కువ ప్రాధాన్యం.. ఇస్తున్నట్లు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
8. రద్దైనా బహుమతులు
ప్రముఖ టెన్నిస్ టోర్నీ వింబుల్డన్ రద్దయినా ఆటగాళ్లకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడాకారులకు ఎలాగైనా సాయం చేయాలని అనుకున్నామని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
9. ఇప్పుడు అర్థమైంది
బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించి దక్షిణాది చిత్రాల్లోనూ కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అదితీరావ్ హైదరి. తాజాగా ఈ భామ నటించిన మలయాళ చిత్రం 'సుఫియుమ్ సుజాతయుమ్' ఇటీవలే ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ అనేక విశేషాలు పంచుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
10. వెబ్ సీరీస్‌లు @నో కాస్ట్
ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ లేదంటే టీవీ మాత్రమే ఉండేవి. కానీ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం పెరిగాక ప్రజలు ఓటీటీల వైపు పయనించడం మొదలుపెట్టారు. అయితే కరోనా సంక్షోభం కారణంగా జీవనమే కష్టంగా ఉంటే ఇక వినోదానికీ చోటివ్వాలంటే జేబుకు చిల్లులు పడాల్సిందే. ఒక్కో ఓటీటీ వేదిక విభిన్న సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే.. సొమ్ము చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఉచితంగా చూడగలిగే వెబ్‌సిరీస్‌ల కోసం ప్రజలు అన్వేషిస్తున్నారు. అలా "రూపాయి ఖర్చులేకుండా ఫ్రీగా మా యాప్‌లో వెబ్‌సిరీస్‌లూ చూసేయండి" అని ఆహ్వానిస్తోంది యూట్యూబ్... ఒకసారి వెళ్లొద్దామా మరి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.