ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOPTEN NEWS
టాప్​టెన్​ న్యూస్​@7PM
author img

By

Published : Jun 21, 2020, 6:55 PM IST

డ్రాగన్​ కుట్ర అదే..!

తూర్పు లద్దాక్ గల్వాన్ లోయలోని పెట్రోల్​ పాయింట్ 14​ సమీపంలో... చైనా బలగాలు మోహరించి ఉన్నాయని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) బీఎస్​ జైస్వాల్ పేర్కొన్నారు. జూన్​ 15న భారత దళాలపై జరిగిన దాడికి... ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే నిజానికి ఏమి జరిగిందో భారత రక్షణ మంత్రిత్వశాఖకు తెలుసుని ఆయన పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు గురించి ఇప్పటికీ సరైన మ్యాప్​ లేదని, అందువల్ల చైనా... అక్రమంగా భారత్​కు చెందిన ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చూస్తోందని ఆయన ఈటీవీ భారత్ ముఖాముఖిలో వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

వారం రోజుల్లో...

కొవిడ్-19 చికిత్సకు సంబంధించి దేశంలోనే మొదటి జెనరిక్ ఔషధం రెమ్‌డెసివిర్​ (కొవిఫోర్) తయారీకి తమ సంస్థకు ఆమోదం లభించినట్లు ప్రముఖ మందుల తయారీ సంస్థ హెటెరో ప్రకటించింది. మరో వారం రోజుల్లో డ్రగ్​ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆ రోజు ఏం జరిగింది?

భారత భూభాగంలో శిబిరం ఏర్పాటు... 300-350 జవాన్ల మోహరింపు... భారత సైన్యంపై దాడికి పక్కా కుట్ర... రాళ్లు, ఇనుప కడ్డీలతో సిద్ధం... గల్వాన్​ లోయలో జూన్​ 15 జరిగిన హింసాత్మక ఘర్షణకు ముందు పొరుగు దేశం సంసిద్ధత ఇది. భారత్ కథ మాత్రం భిన్నం. మనవైపు ఉన్నది అంతా కలిపి 100 మందే. అయినా... కర్నల్ సంతోష్ బాబు బృందం ఏమాత్రం బెదరలేదు. శత్రు సైన్యంపై విరుచుకుపడి... భారత సైన్యం పంజా దెబ్బ రుచి చూపించింది. చైనా శిబిరాన్నితునాతునకలు చేసింది. ఆనాడు సంతోష్ బృందం వీరోచిత పోరాటం సాగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఇక మీ ఇష్టం..

గల్వాన్​ లోయ ఘటనతో వాస్తవాధీన రేఖ వెంబడి 'రూల్స్​ ఆఫ్​ ఎంగేజ్​మెంట్​'లో కీలక మార్పులు చేసింది భారత్​. అసాధారణ పరిస్థితుల్లో ఆయుధాలను ఉపయోగించే విధంగా సైనికులకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ముగ్గురు హతం

శ్రీనగర్​ ఎన్​కౌంటర్​లో ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ముందు జాగ్రత్తగా నగరంలో అంతర్జాల సేవలు నిలిపివేసిన అధికారులు.. ప్రజా రవాణాపై కూడా ఆంక్షలు విధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

వామ్మో 6 లక్షలా..!

భారత్​లో కరోనా కేసులు జులై 1 నాటికి 6 లక్షలు దాటవచ్చని.. మిషిగన్ వర్సిటీ పరిశోధకురాలు భ్రమర్ ముఖర్జీ అంచనా వేశారు. దేశంలో కరోనా తీవ్రత తెలుసుకోవడానికి భారీ స్థాయిలో సెరో సర్వే చేయాలని సూచించారు. లాక్​డౌన్ ప్రయత్నం విఫలమైందని.. అందువల్ల దేశంలో క్రమంగా వైరస్ కేసులు పెరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పన, టెస్టింగ్ ల్యాబ్​ల పెంపుపై దృష్టి సారించాలని సిఫార్సు చేశారు భ్రమర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రాగల మూడు రోజులు..

ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రక్షణ కల్పించండి..

తనకు ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపినందుకు కొంతమంది నాపై దాడులకు పాల్పడుతున్నారని... కేంద్ర భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

హార్దిక్​కు భామలు ఫిదా.!

ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య 'పుష్​అప్స్'​ వీడియోకు బాలీవుడ్​ భామలు​ సయామీ ఖేర్‌, కరిష్మక్ తన్నా ఫిదా అయ్యారు. ఇది ఎలా సాధ్యమైందంటూ కామెంట్లు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే టీమ్​ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.. తన సోదరుడు కృనాల్‌ పాండ్య విసిరిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ స్వీకరించి, ఇన్​స్టాలో ఓ వీడియోను పోస్ట్​ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ట్రంప్ షో ఫ్లాప్​!

కరోనా వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతూ ఇంటికే పరిమితమైతే.. అమెరికా ప్రభుత్వానికి మాత్రం వైరస్​ కన్నా ముఖ్యమైనది మరొకటి ఉందట. అవే ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు. అందుకే మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలోనూ ప్రచార హోరు మొదలైంది. వేల మందితో ట్రంప్​ ఇండోర్​లో సభ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితుల తర్వాత వేల మందితో జరగాల్సిన బహిరంగ సభను రద్దు చేశారు. అలా ట్రంప్​ ఎన్నికల ప్రచారానికి ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.