1. గల్వాన్ నుంచి వెనక్కి తరలిన చైనా సైన్యం
గల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. తమకు చెందిన వాహనాలు, గుడారాలను 1 నుంచి 2 కిలోమీటర్ల మేర వెనక్కి తరలించింది చైనా. అయితే గల్వాన్ నదీ లోయలో ఇప్పటికీ చైనాకు చెందిన భారీ సాయుధ వాహనాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత సైన్యం ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2. ఎంతటి చలినైనా తట్టుకునేలా ప్రత్యేక టెంట్లు
చైనా దురాక్రమణను అడ్డుకునేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన అదనపు బలగాల కోసం అత్యవసరంగా అత్యంత శీతల వాతావరణాన్ని తట్టుకునే గుడారాలు ఏర్పాటు చేసేందుకు భారతసైన్యం సమాయత్తమవుతోంది. శీతాకాలం వచ్చేలోపే వీటిని భారత్ సహా ఐరోపా మార్కెట్ల నుంచి సేకరించాలని నిర్ణయించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3. చేనేత రంగంలో పెట్టుబడుల ఆహ్వానం
ఇన్వెస్ట్ ఇండియా సంస్థ టెక్స్టైల్, అపారెల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణలో విస్తృత అవకాశాలున్నాయని, పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఉత్తమ టెక్స్ టైల్ విధానాన్ని రూపొందించామని వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4. కరెంట్ బిల్లులపై భగ్గుమన్న కాంగ్రెస్
లాక్‌డౌన్ సమయంలో వచ్చిన అధిక విద్యుత్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శరన చేపట్టాయి. విద్యుత్ కార్యాలయాల ముందు ధర్నాలకు దిగిన నేతలు... అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఉపాధి కోల్పోయి పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే... సగటు రీడింగ్ పేరుతో ప్రభుత్వం పెనుభారం మోపిందని హస్తం నేతలు మండిపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5. రూ.1.61 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్ల నిర్ణయం
రాష్ట్రంలో ఈ ఆర్థిక ఏడాది రూ.1.61లక్షల కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయించిన బ్యాంకర్లు దాదాపు 76శాతం రూ.1.22లక్షల కోట్లు ప్రాధాన్యత రంగానికి కేటాయించారు. ఎంఎస్‌ఎంఇలకు రూ.35వేల కోట్లు, స్వల్పకాలిక రుణాలు కింద రూ.53వేలు కోట్లు లెక్కన రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం వెల్లడించింది. గృహ, విద్య రంగాలకు పదివేల కోట్లకుపైగా రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
6. షాక్ కొట్టిన విద్యుత్ బిల్లు... 121 రోజులకు రూ.25లక్షలు
ఓ వినియోగదారుడికి కరెంట్ బిల్లు షాక్ కొట్టింది. 121 రోజులకు రూ.25 లక్షల బిల్లు వచ్చింది. అది చూసి ఖంగుతిన్న వినియోగదారుడు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. మీటర్ డిస్ప్లే సరిగ్గా పనిచేయడం లేదని విద్యుత్ శాఖ అధికారులు సమాధానమిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
7. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుత పాలకులు కొనసాగించాలి
రాజధాని మార్పుపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకపక్షమేనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని రైతులు భూములు ఇచ్చింది ప్రభుత్వానికి తప్ప.. ఏ పార్టీకో, వ్యక్తులకో కాదన్నారు. అప్పటి ప్రభుత్వం చేసిన ఒప్పందాలను ప్రస్తుత పాలకులు గౌరవించాలని స్పష్టం చేశారు. రాజధాని రైతుల త్యాగాలను వృథా కానీయమని.. అమరావతి ఉద్యమానికి సంపూర్ణ మద్దతిస్తామని జనసేనాని తేల్చి చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
8. మండ్య ఎంపీ సుమలతకు కరోనా
ప్రముఖ సినీనటి, రాజకీయ నాయకురాలు సుమలతకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆమె తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
9. ఎస్‌బీఐ కస్టమర్స్‌కు కొత్త రూల్స్.. ఇక బాదుడే!
ఇకపై నగదు ఉపసంహరణలో పరిమితి మించి లావాదేవీలు చేస్తే కచ్చితంగా రుసుము చెల్లించాలంటోంది ఎస్‌బీఐ. ఈ మేరకు కొత్త నిబంధనలను విడుదల చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
10. 'టీమ్ఇండియాలో మార్పులకు వాళ్లే కారణం'
టీమ్ఇండియాలో వచ్చిన మార్పు.. జట్టులోని ఆటగాళ్లు, కోచ్‌లు, ఫిట్నెస్ ట్రైనర్ల ఐక్యత వల్లే సాధ్యమైందని గంగూలీ తెలిపాడు. ఫాస్ట్ బౌలింగ్ చేయగలమనే తమ సత్తాను బౌలర్లు గుర్తించారని వెల్లడించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.