ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7PM - topten news @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @7PM
టాప్​టెన్​ న్యూస్​ @7PM
author img

By

Published : Feb 15, 2021, 6:57 PM IST

1. ఎదురుచూస్తున్నా..

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో కలిసి చర్చాగోష్ఠిలో పాల్గొనేందుకు... చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫిబ్రవరి 22,23 తేదీల్లో వర్చువల్​ విధానంలో బయో ఆసియా సదస్సు జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. నిరూపిస్తే.. తప్పుకుంటా

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి... ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షా 31 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిరూపిస్తానని... లేనిపక్షంలో పోటీ నుంచి తప్పుకుంటానని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. గంటలోనే..

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమానికి ప్రజలంతా మద్దతివ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఫిబ్రవరి 17న ఒక గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఎంతో సంతోషించా..

సొంత వాళ్లు ఆపదలో ఉన్నారంటేనే.. సాయం చేసేందుకు మొహం చాటేసే రోజులివి! మరి ఏ బంధమూ లేని వ్యక్తికి సాయం చేయాలంటే? అది కూడా అవయవం దానం చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి? కానీ, ఓ మహిళ ఇలా.. ఆలోచనల వద్దే ఆగిపోలేదు. ఓ అనాథకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఆమె చేసిన త్యాగాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం మెచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. రూ.5 భోజనం..

బంగాల్​లో ఓటర్లను ఆకర్షించేందుకు మరో పథకాన్ని తీసుకొచ్చింది దీదీ సర్కార్​. పేదలకు తక్కువ ధరకే భోజనం అందించాలనే లక్ష్యంతో 'మా' క్యాంటీన్​లను ప్రారంభించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ క్యాంటీన్​లో ఐదు రూపాయలకే ప్లేట్​ భోజనం లభిస్తుందని ఆమె తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. రాజకీయ రగడ

పర్యావరణ కార్యకర్త దిశా రవినే టూల్​కిట్​ను రూపొందించి, గ్రెటా థన్​బర్గ్​కు పంపించారని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. టూల్​కిట్ వ్యాప్తి చేసేందుకు తయారు చేసిన వాట్సాప్ గ్రూప్​ను దిశ డిలీట్ చేశారని తెలిపారు. మరోవైపు, దిశ అరెస్టుపై రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. పాలక, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆమెను విడుదల చేయాలని సామాజిక కార్యకర్తల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. స్తంభించిన టెక్సాస్

మంచు తుపాను కారణంగా అమెరికాలోని టెక్సాస్​ రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా... వందల విమానాలు రద్దయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఐటీ వృద్ధి 2.3 శాతం

కరోనా సంక్షోభంలోనూ అత్యధిక ఉద్యోగాలు కల్పించిన రంగం ఐటీ పరిశ్రమేనని 'నాస్కాం' వెల్లడించింది. 2020-21లో కొత్తగా 1.38 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపింది. ఇదే సమయానికి ఐటీ పరిశ్రమ ఆదాయం 2.3 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. భారత్ ముందంజ

టీమ్​ఇండియాతో జరుగుతోన్న రెండో టెస్టులో మూడో రోజు ఆటముగిసేసరికి ఇంగ్లాండ్ 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో డేనియల్​ లారెన్స్​(19), జో రూట్​(2) ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్(2), అశ్విన్​ ఓ వికెట్​ను దక్కించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. సినిమా కబుర్లు

టాలీవుడ్​ సినిమాలకు సంబంధించిన పలు అప్​డేట్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి. అందులో గాలి సంపత్, హౌస్ అరెస్ట్, చెక్, అక్షర, ఇచ్చట వాహనములు నిలుపరాదు, ఉప్పెన చిత్రాలకు సంబంధించిన అప్​డేట్స్ ఉన్నాయి. అవేంటో మీరు చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.