1. ఏ రంగానికెంత..?
కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక రంగానికి చికిత్స చేసే లక్ష్యంతో ఈ ఏడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆత్మనిర్భర్ భారత్ మూల సూత్రంగా రూ.34.83 లక్షల కోట్లతో ఆర్థిక టీకా అందజేశారు. ఇందులో ఏ రంగానికి ఎంత మేర ఖర్చు చేయనున్నారో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కొత్తగా అగ్రిసెస్
కరోనా టీకా పంపిణీ సహా, మెరుగైన వైద్య సేవల కోసం ఆరోగ్య రంగ వ్యయాన్ని రెట్టింపు చేసినట్లు తెలిపారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపేందుకు కొత్తగా అగ్రి సెస్ విధిస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఎక్సైజ్, దిగుమతి సుంకాల్లో కోత విధిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రైల్వేకు భారీగా నిధులు
కరోనా మహమ్మారి విజృంభణతో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకున్న వేళ... 2021-22 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రవాణా వ్యవస్థలో ప్రధానమైన రైల్వే రంగానికి ఈ బడ్జెట్లో భారీ కేటాయింపులే దక్కాయి. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. విద్యార్థులకు అస్వస్థత
ఆదిలాబాద్ జిల్లాలో 15 మంది రిమ్స్ వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహంలో ఆహారం కలుషితమై అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వైద్య విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలయ్యాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కాలు కదిపిన తమిళి సై
పద్మశ్రీ పురస్కారం పొందిన కనకరాజును... రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఘనంగా సన్మానించారు. అనంతరం తమిళి సై, మంత్రి సత్యవతి రాఠోడ్... కనకరాజు బృందంతో కలిసి గుస్సాడీ నృత్యం చేసి అరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. పరీక్షించొద్దు..
హన్మకొండలో నిర్వహించిన ప్రజా సంక్షేమ యాత్రలో ప్రభుత్వ ఛీప్ విప్ వినయ్‌భాస్కర్ పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే నివాసంపై భాజపా శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే ప్రజలకు మధ్యకు వచ్చి చర్చ పెట్టాలి కానీ.. ఇలా దాడులు చేయడం సరికాదని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. అరెస్టు.. విడుదల
వరంగల్‌కు వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. భూదాన్‌పోచంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించిన అనంతరం విడుదల చేశారు. విషయం తెలుసుకున్న భాజపా కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకొని పెద్దఎత్తున నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. శానిటైజర్ వేశారు
పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో జరిగిన నిర్లక్ష్యానికి 12 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. పోలియో చుక్కలు అనుకొని.. చిన్నారులకు శానిటైజర్ వేశారు సిబ్బంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరగ్గా.. తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఆ రికార్డులపై కోహ్లీ గురి
ప్రతి సిరీస్‌లో దాదాపు ఏదో ఒక రికార్డును అందుకునే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగబోయే సిరీస్‌లో వాటిని అందుకునే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. హ్యాపీ బర్త్ డే బ్రహ్మీ
టాలీవుడ్లో లెక్కలేనన్ని సినిమాల్లో హాస్యనటుడి పాత్రలు పోషించి ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు నటుడు బ్రహ్మానందం. అలా ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్నారు. నేడు (ఫిబ్రవరి 1) బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.