ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @7PM - topten news @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @7PM
టాప్​టెన్​ న్యూస్​ @7PM
author img

By

Published : Jan 31, 2021, 6:57 PM IST

1. కలిసి పోరాడాలి..

ప్రపంచంలో ఎక్కడా లేని మనిషిని మనిషి చిన్నచూపు చూసే దౌర్భాగ్య పరిస్థితి మన దగ్గరే ఉందని మంత్రి ఈటల రాజేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో ఏర్పాటు చేసిన బీసీ టైమ్స్, మహాత్మ జ్యోతిబా ఫూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. నాదే బాధ్యత

అగ్రకులాల పేదల రిజర్వేషన్ల జీవో విడుదల చేయించే బాధ్యత తనదేనని ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అందరూ బాగుండాలి.. అందులో మ‌న‌ముండాల‌న్నదే సీఎం కేసీఆర్ సిద్ధాంతమని గుర్తుచేశారు. హన్మకొండలో జరిగిన రాష్ట్ర ఓసీల మహా గర్జన సభకు ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రాళ్ల దాడి..

వరంగల్​ రూరల్​ జిల్లా హన్మకొండలోని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ధర్మారెడ్డి ఇంటిపై భాజపా కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఇంట్లోని పూలకుండీలు, అద్దాలు ధ్వంసం చేశారు. రామమందిరం నిధుల సేకరణపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భాజపా శ్రేణుల ఆందోళన చేపట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. తండ్రి పోరాటం..

కుటుంబంలో ఏ చిన్నకష్టం వచ్చినా తండ్రి అల్లాడుపోతాడు. ఆ బాధ తీర్చేందుకు సర్వశక్తులొడ్డుతాడు. కానీ ఇంట్లోవారందరూ కళ్లెదుటే భరించలేని వేదన అనుభవిస్తుంటే... ఆ తండ్రి అనుభవించే శోకం అంతా ఇంతా కాదు. పుట్టుకతోనే అంధురాలైన కుమార్తె... ప్రమాదంలో కాళ్లు, చేతులు పోగొట్టుకున్న కుమారుడు. పక్షవాతంతో మంచాన పడ్డ భార్య. ఇలా... ఉప్పెనలా వచ్చి పడ్డ కష్టాల కడలికి ఎదురీదుతున్నాడు... ఓ వృద్ధుడు. విధిని ఎదిరించలేక... కమ్ముకున్న కష్టాల నుంచి తప్పించుకోలేక దీనస్థితిలో గడుపుడున్న ఓ వృద్ధ తండ్రి విషాద గాథపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ముందే తెలుసా..!

దిల్లీ బాంబు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ప్రత్యేక విభాగం పోలీసులు. ఈ విషయంలో పలువురు క్యాబ్​ డ్రైవర్లను విచారించారు. మరోవైపు తమ విజ్ఞప్తికి అనుహ్య స్పందన వస్తుందని దిల్లీ పోలీసులు తెలిపారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకునేందుకు రాజధాని ప్రజలు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. పద్దు 2020-21

కరోనా కష్టనష్టాల మధ్య సోమవారం వార్షిక పద్దు ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొవిడ్ వల్ల అన్ని రంగాలు తీవ్రంగా కుదేలైన నేపథ్యంలో బడ్జెట్​పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సారి బడ్జెట్​ నుంచి ఏఏ రంగాలు ఎలాంటి ఉద్దీపనలు కోరుతున్నాయి? ప్రభుత్వం నిర్ణయాలు ఎలా ఉండనున్నాయి? అనే అంశంపై నిపుణుల విశ్లేషణ మీ కోసం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మా సలహాలు తీసుకోవాలి..

దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కేంద్రం కాంగ్రెస్ పార్టీ సలహాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్. ఆర్థిక సంస్కరణల విషయంలో తమ పార్టీని తప్పక సంప్రదించాలని భాజపాకు సూచించారు. పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జిగా కూడా ఉన్న రావత్​.. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. భాజపా తన మొండి వైఖరిని విడనాడి.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. యథాతథం..

ఫిబ్రవరి 5న జరగనున్న ఆర్​బీఐ ద్రవ్య విధాన పరపతి సమావేశంలో కీలక వడ్డీరేట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టే బడ్జెట్​కు అనుగుణంగా ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు(ఎంపీసీ) ఉంటాయని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. రంజీ రద్దు..

దేశవాళీ క్రికెట్​లో 87 ఏళ్ల రంజీకి అనూహ్యంగా అంతరాయం ఏర్పడింది. తొలిసారిగా దానిని నిర్వహించడం లేదని భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. అయితే దాని ప్రభావం ఎదుర్కోనున్న యువ క్రికెటర్లపై సానుభూతి ప్రకటించారు పలువురు రంజీ మాజీలు. అదే సమయంలో బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఎలాంటోళ్లంటే..

మలయాళ చిత్రం 'ప్రేమమ్​'తో కుర్రకారు మనసును దోచేసింది. టాలీవుడ్​లో వరుణ్​తేజ్​ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులనూ 'ఫిదా' చేసిందీ భామ. అలా అతికొద్ది సమయంలోనే అందంతోపాటు అభినయంతోనూ స్టార్​డమ్​ను సొంతం చేసుకుంది సాయిపల్లవి. అయితే చిత్రపరిశ్రమలో తాను హీరోయిన్​గా రాణించడానికి ఆమెతో నటించిన హీరోలే కారణమంటోంది. ఆ విషయాలేంటో సాయిపల్లవి మాటల్లోనే తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.