1. తెలంగాణే ముఖ్యం..
రాష్ట్రపతి ప్రసంగానికి నిరసన తెలిపితే ఉపయోగం లేదని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేకే అన్నారు. పార్లమెంట్ సజావుగా జరిగేందుకు కేంద్రానికి మద్దతిస్తామని తెలిపారు. తెరాస విధానం దిల్లీలో దోస్తానా.. గల్లీలో కుస్తీ కాదని... తాము ఏది చేసినా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. హామీ ఏమైంది..?
పసుపు బోర్డుపై ఎంపీ అర్వింద్ ఇచ్చిన హామీ ఏమైందని... ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. చక్కెర పరిశ్రమను పూర్తిగా ప్రభుత్వ పరం చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మరిచారని ఆరోపించారు. సాగు చట్టాలపై తెరాస వైఖరిపై చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కోళ్ల వేలం..
పోలీసుల దాడిలో పట్టుబడ్డ పందెం కోళ్లను వేలం వేయాలని పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు ఆదేశించింది. ఈ నెల 14న సంక్రాంతి నాడు... తాడిచెర్ల శివారులోని దేశబందం ప్రాంతంలో కొయ్యూరు పోలీసులు దాడులు చేసి మూడు కోళ్లు, 22 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. గాంధీకి మోదీ నివాళి
నేడు మహాత్మగాంధీ వర్థంతి. ఈ సందర్భంగా దిల్లీలోని గాంధీ స్మృతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ.. మహాత్మునికి నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రాహుల్ కుకింగ్..
యూట్యూబ్ కుకింగ్ వీడియోలో రాహుల్ గాంధీ కనిపించడం.. ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్‌గా మారింది. గ్రామస్థులతో కలిసి భోజనం చేసిన ఈ దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. గతవారం రాహుల్ తమిళనాడు పర్యటన సందర్భంగా ఈ వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 2020 చెత్త ఇయర్
కరోనా కారణంగా 2020 అంతర్జాతీయ ప్రయాణాలు 74శాతం తగ్గిపోయాయని ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యటక సంస్థ వెల్లడించింది. వంద కోట్ల ప్రయాణాలు తక్కువగా జరిగాయని పేర్కొంది. ఫలితంగా 2020 ఏడాది పర్యటక రంగానికి అత్యంత చెత్త సంవత్సరంగా మిగిలిపోయిందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఎన్ఎస్‌జీ తనిఖీలు
దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు ఘటన విచారణ నిమిత్తం ఎన్ఎస్‌జీ బృందం ఘటనాస్థలి వద్ద తనిఖీలు చేపట్టింది. ఆ ప్రాంతంలో గుర్తించిన ఓ సగం కాలిన వస్త్రంలోని మూటను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. టెస్ట్ ర్యాంకింగ్స్
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ శనివారం కొత్త టెస్టు ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో భారత సారథి విరాట్ కోహ్లీ.. 4వ స్థానంలో కొనసాగుతుండగా.. బౌలర్లలో బుమ్రా, అశ్విన్ తమ ర్యాంకులను పదిలపర్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. జెర్సీలో వార్నర్ కూతురు
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాలో ఆసక్తికర ఫొటో పంచుకున్నాడు. అందులో విరాట్ జెర్సీ ధరించి చిరునవ్వులు చిందిస్తున్న అతడి కూతురు అందరినీ ఆకట్టుకుంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. సినిమా కబుర్లు..
టాలీవుడ్‌కు సంబంధించిన కొత్త సినిమా కబుర్లు మీ ముందుకొచ్చేశాయి. వాటిలో రవితేజ 'ఖిలాడి' విడుదల తేదీ, 'ఉప్పెన' సినిమాకు సంబంధించిన అప్డేట్ సహా పలు విశేషాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.