ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7PM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @7PM
టాప్​టెన్​ న్యూస్​ @7PM
author img

By

Published : Jan 26, 2021, 7:00 PM IST

1. దేశంలోనే అగ్రగామిగా..

కనీవినీ ఎరుగని వినూత్న పథకాలు , సంక్షేమ కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకం ఆవిష్కరించిన గవర్నర్‌... రాష్ట్ర పురోగతిపై ప్రసంగించారు. 2020 ఏడాదంతా కరోనా కల్లోలంలో కష్టంగా గడిచిందన్న గవర్నర్‌... కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభంతో 2021ని ఆశావహ దృక్పథంతో ప్రారంభించుకున్నట్లు చెప్పారు. ఆరున్నరేళ్లుగా ప్రభుత్వం పద్ధతి ప్రకారం చేస్తున్న కృషి వల్ల తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. తెలంగాణ 'కనకం'

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కనకరాజును... పలువురు మంత్రులు అభినందించారు. గుస్సాడి నృత్యానికి గుర్తింపు తేవడమే కాకుండా... రాష్ట్ర ప్రతిష్ఠను పెంచారని కొనియాడారు. ఇది ఆదివాసీలకు జాతీయస్థాయిలో దక్కిన గౌరవం అని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. నాకే పరీక్షలా..?

మూఢ భక్తితో ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో రెండు రోజుల క్రితం ఇద్దరు కుమార్తెలను కన్నవారే కడతేర్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు పురుషోత్తం, పద్మజపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ-1గా పురుషోత్తం, ఏ-2 గా పద్మజను చేర్చారు. నిందితులకు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో పద్మజ తన వింత ప్రవర్తనతో అందరినీ హడలెత్తించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. షా సమీక్ష..

దిల్లీలో రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో ఉద్రిక్తత, పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలపై చర్చే ప్రధానాంశంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగినట్టు సమాచారం. దిల్లీలో తాజా పరిస్థితులను షాకు అధికారులు వివరించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో టెలికాం సేవలను నిలిపివేశారు అధికారులు. మెట్రో సేవలకూ అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. అదో మాయని మచ్చ..

దిల్లీలోని ఎర్రకోటలోకి రైతులు ప్రవేశించడాన్ని కేంద్ర పర్యటక మంత్రి ప్రహ్లాద్​ పటేల్​ తప్పుపట్టారు. అన్నదాతల చర్య భారత ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన ఎర్రకోటను అగౌర పరిచేలా ఉందని ఆరోపించారు. మరోవైపు హింస వల్ల సమస్యలు పరిష్కారం కావని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఘనంగా రిట్రీట్​..

అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్​ రిట్రీట్ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత్​- పాక్​సైనికులు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఇరు దేశాల సైనికులు కవాతుతో ఆకట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఇటలీ ప్రధాని రాజీనామా

ఇటలీ ప్రధానమంత్రి గిసెప్పే కాంటే.. తన పదవికి రాజీనామా చేశారు. నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటరేల్లాకు తన రాజీనామాను సమర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఎనిమిదిశాతం వృద్ధి..

దేశ ఆర్థిక వృద్ధి రేటు 2020-21లో -8 శాతంగా నమోదవ్వచ్చని ఫిక్కీ తాాజా సర్వేలో అంచనా వేసింది. కరోనాతో నెలకొన్న పరిస్థితులు ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం మినహా మిగతా అన్ని విభాగాలు ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేయొచ్చని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఇంకో వంద ఆడగలదు

దక్షిణాఫ్రికా కెప్టెన్​ డికాక్.​. సుదీర్ఘ ఫార్మాట్లో మరో 100 మ్యాచ్​లు ఆడాలని కోరుకుంటున్నట్లు ఆ జట్టు హెడ్​ కోచ్​ మార్క్​ బౌచర్​ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పాకిస్థాన్​తో ఆడుతున్న తొలి టెస్టు.. డికాక్​కు 50వది అని పేర్కొన్నాడు.​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'ఏ1 ఎక్స్​ప్రెస్​' ట్రైలర్

యువ కథానాయకుడు సందీప్​కిషన్​, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో నటిస్తోన్న కొత్త చిత్రం 'ఏ1 ఎక్స్​ప్రెస్​'. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు. ట్రైలర్​లో సందీప్​కిషన్​ చెప్పే డైలాగ్​ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.