ETV Bharat / city

టాప్‌టెన్‌ ‌న్యూస్‌ @7Pm - top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news@7Pm
టాప్‌టెన్‌ ‌న్యూస్‌ @7Pm
author img

By

Published : Nov 30, 2020, 7:00 PM IST

1. సర్వం సిద్ధం

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 150 డివిజన్లలో... 1,122 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా... 74 లక్షల మందికిపైగా ఓటర్లు... ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. కరోనా వ్యాప్తి వేళ... బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఇవి ఉంటే చాలు

సామాన్యుడు ఆటంకం లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల అధారిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపు కార్డు లేని సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయాలను ప్రకటించింది. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్యాయంగా 18 గుర్తింపు కార్డులను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. నేత ఇంట్లో మద్యం

తెరాస అభ్యర్థి మద్యం పంపిణీ చేస్తున్నారంటూ... భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. చైతన్యపురి డివిజన్‌ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ ఇంట్లో మద్యం సీసాలు ఉన్నట్లు.. ఎన్నికల అధికారికి భాజపా కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. తనిఖీలు చేపట్టగా... శ్రీనివాస్‌ ఇంట్లో, కారులో మద్యం సీసాలు బయటపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఆగస్టు నాటికి..

వచ్చే ఏడాది తొలి నాలుగు నెలల్లోపు దేశ ప్రజలకు కరోనా టీకా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. ఆగస్టులోపు 30 కోట్ల మందికి వ్యాక్సిన్​ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. స్పీక్ అప్‌ ఫర్‌ ఫార్మర్స్‌

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ప్రారంభించింది. ఈ మేరకు 'హ్యాష్‌ ట్యాగ్ స్పీక్‌ అప్‌ ఫర్ ఫార్మర్స్‌' పేరిట ఓ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. చైనా డ్రోన్ల సాయం

భారత్​లోకి చొరబడాలని యత్నిస్తున్న ఉగ్రవాదులకు 'చైనా డ్రోన్లు' ఆసరాగా నిలుస్తున్నాయి. వీటిని ఉపయోగించి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను ముష్కరమూకలు సరఫరా చేస్తున్నాయి. వీటిని భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నప్పటికీ.. ఇటీవలి కాలంలో డ్రోన్ల ఘటనలు బాగా పెరిగిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. సజీవ దహనం

పాకిస్థాన్​లో దారుణం జరిగింది. బస్సు, వ్యాను​ ఢీ కొన్న ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 17 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. బంగారం ధర తగ్గింది

బంగారు, వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.142 తగ్గింది. కిలో వెండి ధర రూ.701 తగ్గింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ముమ్మర దర్యాప్తు

అర్జెంటీనా ఫుట్​బాల్​ దిగ్గజం డిగో మారడోనా అకస్మిక మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిగోకు చికిత్స అందించిన వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఆయన మరణించారని సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'షకీలా' హాట్‌ లుక్‌

రిచా చద్దా ప్రధాన పాత్రలో నటించి 'షకీలా' సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం ప్రకటన చేయడం సహా కొత్త పోస్టర్​ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.