ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్ @7pm - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @7pm
టాప్​టెన్ న్యూస్ @7pm
author img

By

Published : Aug 29, 2020, 7:00 PM IST

1. త్వరలో భేటీ

త్వరలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రెవెన్యూ బిల్లు సహా నీటిపారుదల శాఖ పునర్​వ్యవస్థీకరణ, పేరు మార్పునకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ సహా లాజిస్టిక్ విధానాలు, పీవీ శతజయంతి ఉత్సవాలకు సంబంధించి సైతం సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. భాషే ప్రధానం..

గిడుగు జయంతి, తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా అంతర్జాల సదస్సు నిర్వహించారు. 'దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య నిర్వహించిన ‘మన భాష –మన సమాజం – మన సంస్కృతి’ అంతర్జాల సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. సీఎం పరామర్శ

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. తమిళిసై చిన్నాన్న వసంత్ కుమార్ నిన్న మరణించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇవాళ రాజ్​భవన్​కు వెళ్లి గవర్నర్​ను పరామర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. అమిత్​షా డిశ్చార్జీ..

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పూర్తిగా కోలుకున్నారని దిల్లీ ఎయిమ్స్​ వైద్యులు ప్రకటించారు. త్వరలోనే డిశ్ఛార్జి చేస్తామని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలతో ఆగస్టు 18న ఎయిమ్స్​లో చేరారు షా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. కోమాలోనే దాదా

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇంకా వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ ఆస్పత్రి తెలిపింది. ఆరోగ్య సూచిలన్నీ నిలకడగానే ఉన్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. రెండో లేఖ..

భాజపాకు ఫేస్​బుక్ అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ మరోసారి ఆ సంస్థకు లేఖ రాసింది కాంగ్రెస్. ఫేస్​బుక్ ఇండియా పక్షపాత వైఖరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది. మరోవైపు ఈ అంశంపై సంయుక్త పార్లమెంట్ కమిటీతో విచారణ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది కాంగ్రెస్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. తాలిబన్ల హతం

అఫ్గానిస్థాన్​లో 44 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. ఉత్తర కుందూజ్ రాష్ట్రంలోని రెండు స్థావరాలను తాలిబన్లు ఆక్రమించుకోగా.. వారిపై దాడి చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. ఈ ఘటనలో మరో 37 మంది తాలిబన్లు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. కోహ్లీని చూసి నేర్చుకోవాలి..

మ్యాచ్​లు గెలిపించే విషయంలో కోహ్లీని చూసి బాబర్ స్ఫూర్తి పొందాలని అన్నాడు మాజీ క్రికెటర్ రమీజ్ రాజా. తన బ్యాటింగ్​ను ఇంకాస్త మెరుగుపర్చుకునేందుకు బాబర్​కు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. ఇంటర్ టాపర్..!

ఓ కాలేజీలోని 12వ తరగతి మెరిట్​ జాబితాలో తన పేరు టాప్​లో ఉండటంపై నటి సన్ని లియోనీ ఆశ్చర్యపడింది. వచ్చే సెమిస్టర్​లో అందరినీ కలుస్తానంటూ హాస్యభరిత ట్వీట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. 2017 నుంచి ప్రెగ్నెన్సీ..!

నెటిజన్లతో మాట్లాడిన హీరోయిన్ సమంత.. తన టాటూ, ప్రెగ్నెన్సీ, లాక్​డౌన్​లో చేసిన పని గురించి వెల్లడించింది. ఇటీవలే ఈమె 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్​ సిరీస్​లోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.