1. గడువు పెంపు
ఉపకార వేతనాలు, బోధనా రుసుముల కోసం దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పెంచింది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పూర్తి కానందున... మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.
2. ఓడిస్తేనే.. భృతి
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వ వైఖరిని ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరు పార్టీ అభ్యర్థులకు ఉత్తమ్.. గాంధీభవన్లో బీ ఫారాలు అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. అక్షరాభ్యాసానికి సిద్ధం
వసంత పంచమి వేడుకలకు వర్గల్ విద్యాధరి క్షేత్రం సర్వాగ సుందరంగా ముస్తాబైంది. సామూహిక అక్షరాభ్యాసాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి పుట్టిన రోజు మాఘ శుద్ధ పంచమి నాడు అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వస్తాయని భక్తుల విశ్వాసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అన్నీ మాటలే..
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. రైతులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ప్రయోజనాల్ని అందించడంలేదని యూపీ బిజ్నోర్లో విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఆ ముగ్గురు అరెస్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత సైబర్ మోసానికి గురైన కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు వారిస్ కోసం ఇంకా గాలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. అడవిలో అంబులెన్స్
అసలే అటవీ ప్రాంతం. అపై రోడ్లు సరిగా లేవు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఏరియా. అనుకోని వ్యాధి సోకితే ఇంక అంతే సంగతులు. అలాంటి పరిస్థితిలో ఓ అంబులెన్స్ వచ్చి అతిసారం, జ్వరంతో బాధపడుతున్న మహిళ ప్రాణాలను రక్షించింది. పట్టాణానికి ఆమడ దూరంలో విసిరేసినట్లు ఉండే ఆ తండాకు.. ఏడాది కాలంలో అంబులెన్స్ రావడం ఇది రెండోసారి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. పే ఫర్ జర్నలిజం
ఆస్ట్రేలియాలో డబ్బులిచ్చి వార్తలను పొందాలన్న నిబంధన తప్పనిసరి కానున్న నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో అతిపెద్ద మీడియా సంస్థతో 'ఫే ఫర్ జర్నలిజం' ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్, ఫేస్బుక్ కొత్త నిబంధనను అంగీకరించేందుకు దాదాపు సిద్ధమైనట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. సూచీల రికార్డు
స్టాక్ మార్కెట్లలో మరోసారి బుల్ విజృంభించింది. సెన్సెక్స్ 610 పాయింట్ల లాభంతో సరికొత్త రికార్డు స్థాయి అయిన 52,150పైకి చేరింది. నిఫ్టీ 150 పాయింట్లకుపైగా లాభంతో తొలిసారి 15,300 మార్క్పైన స్థిరపడింది. బ్యాంకింగ్ షేర్లు అధికంగా లాభపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. శతక్కొట్టాడు..
చెపాక్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ శతకంతో చెలరేగి ఓ రికార్డును కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచులో సెంచరీతో పాటు ఐదు వికెట్లు తీశాడు. ఒకే మ్యాచులో ఈ ఘనతను అందుకోవడం ఇది అతడికి మూడో సారి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. సూర్య40
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో పాండిరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.