ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 5PM - టాప్​టెన్ న్యూస్@5pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @5pm
టాప్​టెన్ న్యూస్@5pm
author img

By

Published : Jan 21, 2021, 4:57 PM IST

1. ఎందుకివ్వాలి..?

ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​ రావు అయోధ్య రామమందిర విరాళాల సేకరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో నిర్మించే ఆలయానికి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'భృతి' ఎక్కడ..?

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి పట్టింపు లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఉద్యోగం లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్​ ఇచ్చిన నిరుద్యోగభృతి హామీ అమలు చేయాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. అఖిలకు బెయిలొద్దు..

అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టు విచారణ చేపట్టింది. బెయిల్​ పిటిషన్​పై పోలీసులు కౌంటర్​ దాఖలు చేశారు. అఖిలప్రియకు బెయిల్​ మంజూరు చేయకూడదని కౌంటర్​లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. సీరంలో అగ్నిప్రమాదం

మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం జరిగింది. టెర్మినల్ గేట్​ 1 వద్ద ఎస్​ఈజెడ్​-3 భవనం 4, 5 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు 10 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. వీడని సందిగ్ధం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీపై పోలీసులు, కర్షకుల మధ్య చర్చలు మరోమారు అసంపూర్తిగానే ముగిశాయి. శుక్రవారం కేంద్రంతో చర్చల అనంతరం మళ్లీ పోలీసు అధికారులతో సమావేశమవనున్నట్లు రైతు నేతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. శభాష్ వినయ్..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ సర్కారులో స్పీచ్​ రైటింగ్​ విభాగం అధ్యక్షుడిగా నియామకమైన భారతీయ-అమెరికన్​ వినయ్ ​రెడ్డి పేరు మార్మోగిపోతోంది. ప్రమాణ స్వీకారం కోసం రాసిన స్పీచ్​​తో ఆయన అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. శక్తిమంతమైన పదాలతో.. పదునైన వాక్యాలతో చక్కటి ప్రసంగాన్ని బైడెన్​కు అందించారు వినయ్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. భారత్-అమెరికా మైత్రి

'శత్రువుకు శత్రువు మిత్రుడు' అన్న మాట భారత్​-అమెరికాకు సరిపోయేలా కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా ఇరు దేశాలు చైనా నుంచి ఎన్నో సవాళ్లు, ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా చైనాకు అడ్డుకట్ట వేసేందుకు భారత్​-అమెరికా కలసిగట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్​ అధ్యక్షతన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ సహకారం పెరుగుతుందని ఆశిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. మార్కెట్ యూ టర్న్..

స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో (గురువారం) చారిత్రక రికార్డు స్థాయిలను తాకి.. చివరకు నష్టాలతో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ఇందుకు ప్రధాన కారణం. సెన్సెక్స్ స్వల్పంగా 167 పాయింట్లు తగ్గి.. 49,650 దిగువన స్థిరపడింది. నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 14,600 మార్క్​ను కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఎంతో గర్వకారణం..

ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో వాషింగ్టన్​ సుందర్​ చేసిన అద్భుత ప్రదర్శన గురించి అతని సోదరి ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆనంద క్షణాలు తమ కుటుంబానికి ఎంతో గర్వకారణమని శైలజా సుందర్​ పేర్కొన్నారు.​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. రాధేశ్యామ్ ఎప్పుడంటే..?

యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రాధేశ్యామ్'. ఈ సినిమా విడుదల తేదీపై టాలీవుడ్​లో జోరుగా చర్చ నడుస్తోంది. తాజాగా దీనిపై స్పందించారు నటుడు, నిర్మాత కృష్ణంరాజు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.