1. దక్షణాదిపై చిన్నచూపు
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలోనూ బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. త్వరలోనే.. సీఎం అవుతారు
అతిత్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టనున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్రధానికి రెండోదశలో
రెండో దశ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధాని సహా ముఖ్య నేతలకు టీకా వేస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 50 ఏళ్ల వయస్సు పైబడిన వారికీ టీకా అందజేస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఊరట లభించేనా..?
కరోనా మహమ్మారితో ప్రజల ఆదాయాలు తగ్గాయి.. ఖర్చు పెట్టే శక్తి తగ్గిపోయింది. చేతిలో కాస్త మిగులు ఉండేలా చూసేందుకు ప్రభుత్వం తీసుకోదగ్గ చర్యల్లో కీలకమైంది 'పన్నుల భారం తగ్గించడమే'. ఆత్మనిర్భర్ భారత్‌తో పలు రంగాలకు చేయూతనిచ్చిన ప్రభుత్వం.. కొత్త బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట కల్పించేలా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఆదాయపు పన్ను రాయితీలు పెంచుతుందా? అనే విషయమై చర్చోపచర్చలు సాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. స్వాప్ చేస్తారిలా..
మొబైల్ నంబర్లను స్వాప్ చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. నైజీరియాలో ఉంటూ ఓ వ్యక్తి మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి సిమ్‌లు, నకిలీ పత్రాలు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఇఫ్కో నెంబర్. 1
ప్రపంచవ్యాప్తంగా 300 ప్రధాన సహకార సంఘాల్లో 'ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)' అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజాగా విడుదల చేసిన 9వ వార్షిక వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ (డబ్ల్యూసీఎం) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఆత్మహుతి దాడి..
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో జంట ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాగ్దాద్‌లోని వాణిజ్య కేంద్రంలో ఈ పేలుళ్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. చైనాకు వార్నింగ్..!
బ్రహ్మపుత్ర నదిపై చైనా జల విద్యుత్ ప్రాజెక్టు చేపడితే భారత హక్కుల దురాక్రమణ జరిగినట్లేనని కేంద్రం తెలిపింది. ఈ డ్యామ్‌ను నిర్మిస్తే భారత్ సహా బంగ్లాదేశ్‌లో నీటి కరవు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. సరిహద్దు నదుల సమస్యల పరిష్కారానికి ఇరు దేశాల మధ్య నిపుణుల స్థాయి యంత్రాంగం ఉందని గుర్తు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. తప్పనిసరేం కాదు..
ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని గురువారం నగరానికి వచ్చిన టీమ్ఇండియా క్రికెటర్స్‌కు క్వారంటైన్ నిబంధనలు వర్తించవని ప్రకటించింది ముంబయి మున్సిపల్ కార్పొరేషన్. ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని రోహిత్, రహానె, శార్దూల్ ఠాకూర్, పృథ్వీ షా ముంబయికి చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. సినిమా అప్డేట్స్..
ప్రిన్స్ మహేశ్‌బాబు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరోవైపు కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ప్రదీప్ సినిమాతో పాటు హీరో నాగశౌర్య కొత్త చిత్ర వివరాలు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.