ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్ @3pm - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @3pm
టాప్​టెన్ న్యూస్ @3pm
author img

By

Published : Sep 18, 2020, 3:04 PM IST

1. ముట్టడి-అరెస్టు

ప్రగతి భవన్​ము ముట్టడించేందుకు యత్నించిన కిసాన్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ కాంగ్రెస్ నేతలు ప్రగతిభవన్​ వద్దకు చేరుకున్నారు. వీరిని అడ్డుకున్న పోలీసులు... ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. మధ్యలోనే ఆపేశారు..!

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సందర్శనను కాంగ్రెస్ అర్ధాంతరంగా నిలిపివేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లను చూపిస్తామని ఇప్పటి వరకు కేవలం 3,428 ఇళ్లనే చూపించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇవాళ చూపించిన తుక్కుగూడ, రాంపల్లి ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి రావన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. రూ.1 డిస్కౌంట్

కరోనా చికిత్స కోసం వచ్చిన ఓ బాధితుడిని కాపాడకపోగా.. తొమ్మిది లక్షల బిల్లు వేసింది కర్ణాటకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి. దీనికి రూపాయి డిస్కౌంట్ ఇచ్చింది. ఆస్పత్రి నిర్వాకాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు బాధితుడి కుటుంబ సభ్యులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. యోధులను అవమానిస్తారా..?

కరోనాపై పోరులో ముందు వరుసలో నిలిచి ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య కార్యకర్తల సమాచారం లేదన్న కేంద్రంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మండిపడ్డారు. ఈ విధంగా కరోనా యోధులను అవమానించడం ఎందుకని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. మాటలు వద్దు..

పార్లమెంటు జరుగుతున్న సమయంలో ఎంపీలు ఇతర సభ్యుల వద్దకు వెళ్లి చెవిలో మాట్లాడవద్దని సూచించారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. చీటీల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. లారీ కొట్టుకుపోయిది..

కర్ణాటక బీదర్ జిల్లాలో వంతెన దాటుతున్న ఓ లారీ.. వరద ప్రవాహానికి నీటిలో పడిపోయింది. భల్కి తాలుకా జమఖండి గ్రామంలో ఈ ఘటన జరిగింది. కోళ్ల దానా తీసుకెళ్తున్న ఈ లారీ మహారాష్ట్ర నుంచి బీదర్​కు ప్రయాణిస్తోంది. అదృష్టవశాత్తు లారీ డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే లారీలోని సరకు మొత్తం నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనపై హుళసురు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. చీప్ ట్రిక్స్..

భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా అసలు ఉద్దేశం ప్రపంచ దేశాలకు ముందే తెలుసు. ఈ నేపథ్యంలో నేరుగా చేసే ప్రకటనలు, బెదిరింపులు అంతర్జాతీయంగా ఎక్కడ ఇరుకున పెడతాయో అని భావించిన చైనా... తన మౌత్​పీస్​ పత్రికలను వాడుకుంటోంది. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని.. సత్యదూరమైన, కుట్రపూరితమైన కథనాల్ని ఈ పుంఖానుపుంఖాలుగా రాయిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. ఉద్యోగాల కోత

కరోనా వైరస్ కారణంగా వేతన జీవుల్లో.. ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగులు(వైట్​ కాలర్ ప్రొఫెషనల్స్) అధికంగా ఉపాధి కోల్పోయినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ ఏడాది మే-ఆగస్టు మధ్య 66 లక్షల మంది ఉద్యోగాలకు దూరమైనట్లు తెలిపింది. వీరి తర్వాతి స్థానంలో పరిశ్రమల్లో పని చేసే 50 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లు సర్వే వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. 'థ్యాంక్యూ కొవిడ్​ వారియర్స్​'

కరోనాపై పోరాడుతున్న యోధులకు ధన్యవాదాలు చెప్పే విధంగా తమ ఆటగాళ్ల జెర్సీలపై ఓ సందేశాన్ని రాస్తున్నట్లు దిల్లీ క్యాపిటల్స్​ ప్రకటించింది. టోర్నీ మొత్తం జెర్సీలపై 'థ్యాంక్యూ కొవిడ్​ వారియర్స్​' అని ప్రదర్శించనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. అఖిల్-పూజ

అక్కినేని వారసుడు అఖిల్​ హీరోగా వస్తున్న చిత్రం 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​. లాక్​డౌన్​ అనంతరం సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు అఖిల్​పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్​లో తీసుకున్న ఓ ఫొటోను నెట్టింట షేర్ చేసింది పూజ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.