1. జవాను మృతి
సరిహద్దుల్లో పాక్ దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. పరిశుభ్రంగా ఉంచుకుందాం..
సిద్దిపేట పట్టణంలో 'ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు' కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. డ్రైడే పాటించి ఒక్క నీటి చుక్క నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కేంద్రం చూస్తోంది..
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నూతన పదాధికారుల తొలి సమావేశం జరిగింది. బూత్ స్థాయి నుంచి జాతీయ నాయకుల వరకు అందరూ క్రమశిక్షణతో మెలగాలని కార్యకర్తలకు సంజయ్ సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. బొమ్మలహబ్గా భారత్..
వోకల్ ఫర్ లోకల్‌లో భాగంగా దేశీయంగా బొమ్మలు తయారీ చేసేందుకు ముందుకు రావాలని స్టార్టప్ కంపెనీలు, యువతను కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ దేశాలకు బొమ్మల ప్రధాన కేంద్రంగా మారేందుకు భారత్‌కు సత్తా ఉందన్నారు. బొమ్మల పరిశ్రమ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.7 లక్షల కోట్ల మేర వ్యాపారం జరుగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మరుగుదొడ్డి కడిగిన మంత్రి
పుదుచ్చేరిలో కరోనా విజృంభిస్తోన్న వేళ.. పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి మల్లాడి కృష్ణారావు. కరోనా రోగులు ఉండే ఆసుపత్రిలో పర్యటించిన ఆయన.. చీపురు పట్టి మరుగుదొడ్లు శుభ్రం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. కొవిడ్ రోగికి కిడ్నీ మార్పిడి..
ఆసియాలోనే మొట్టమొదటి సారి ఓ కొవిడ్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు. దీనికి ముందు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ రోగులపై ఇలాంటి శస్త్ర చికిత్సలు రెండు మాత్రమే విజయవంతమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. పెట్రో మంట..
పెట్రోల్ ధర మళ్లీ పెరిగింది. దిల్లీలో ఆదివారం లీటరుకు తొమ్మిది పైసలు పెరిగి రూ.82.03కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. దిగిపోవాలి..
ఇజ్రాయెల్‌లో నిరసన జ్వాలలు హోరెత్తాయి. ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు.. తన పదవి నుంచి దిగిపోవాలని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు అక్కడి ప్రజలు. అయితే.. తనపై వస్తున్నఅవినీతి ఆరోపణలను కొట్టిపారేసిన ప్రధాని.. ఇవన్నీ ఉద్దేశపూర్వక ఆందోళనలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఐపీఎల్ స్టార్..
ఈ ఏడాది ఐపీఎల్ నుంచి కుటుంబ కారణాల వల్ల తప్పుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ సురేశ్ రైనా. తాజాగా అతడు వైదొలగడంపై స్పందించాడు సహ ఆటగాడు షేన్ వాట్సన్. రైనాను సీఎస్కే మిస్ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. అమ్మేస్తారనుకున్నా..
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. ఓ నటుడు తనకు సాయం చేస్తానని నమ్మించాడని పేర్కొంది. ఆ తర్వాత తనను మత్తు పదార్థాలకు బానిస చేసే ప్రయత్నం చేసినట్లు వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.