1. రాష్ట్రంలో కరోనా..
రాష్ట్రంలో కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 2,84,863కు చేరింది. కొవిడ్‌తో తాజాగా ఇద్దరు చనిపోగా.. ఇప్పటివరకు 1,531 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 509 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు వైరస్ నుంచి 2,76,753 మంది బాధితులు బయటపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. జనవరి నుంచే!
రాష్ట్రంలో పేద మహిళలకు పంపిణీ చేసే బతుకమ్మ చీరల తయారీని ఈసారి జనవరిలోనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పండుగకు నెల రోజుల ముందే పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించింది. ఆ మేరకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. బలవన్మరణం
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో విషాదం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ తల్లి పిల్లలతో సహా చెన్నాపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికితీస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. దేశంలో కరోనా..
దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 18,732 మందికి కరోనా సోకినట్టు తేలింది. మరో 279 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అపురూప బహుమతి
భూమిపై సొంత ఇల్లు కొనాలని కలలు కనని వారుండరంటే అతిశయోక్తి కాదు. అదే చంద్రుడి మీద స్థలం ఉంటేనో! తన భార్యకు బహుమతిగా ఓ వ్యక్తి ఏకంగా చంద్రుడి మీదే మూడెకరాలు కొని ఆశ్చ్యర్యపరచగా.. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారి పెళ్లిరోజున చంద్రమండలం తాలూకు రిజిస్ట్రేషన్ కాగితాలు బహుమానంగా ఇచ్చి.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడు రాజస్థాన్‌కు చెందిన ధర్మేంద్ర. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. కాల్పుల కలకలం
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. రాక్‌ఫోర్డ్ పట్టణంలోని ఓ ఆటస్థలంలో జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. అనుమతి అక్కర్లేదు..
పాకిస్థాన్ అధికార పార్టీ టెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌ను గద్దె దింపేందుకు తమకు ఆర్మీ అనుమతి అక్కర్లేదన్నారు పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ ఉపాధ్యక్షురాలు మర్యమ్ నవాజ్. పార్టీ సమావేశానికి హాజరైన మర్యమ్... ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పలు విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఐటీకి ఊతం ఇవే..
కిరాణా దుకాణానికి వెళ్తే సరకులకు నగదుతోనే చెల్లింపులు జరపడం పాత మాట. చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా యూపీఐ ఆధారిత, కార్డు చెల్లింపులకు ఎక్కువ దుకాణాల్లో అవకాశం ఉంటోంది. కానీ ఇప్పుడు ఓ మాదిరి సంస్థలు కూడా సొంత వెబ్‌సైట్ ఏర్పాటు చేసుకుని, ఆర్డర్లు తీసుకునేందుకూ ఉత్సుకత చూపుతున్నాయి. ఇవన్నీ ఐటీ కంపెనీలకు కలిసొస్తున్న అవకాశాలే. ఒక రకంగా ఐటీ కంపెనీలకు ఆదాయాలు పెరిగేందుకు కిరాణా దుకాణాలు కారణం కానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఆసీస్‌పై పంత్..
ఆసీస్‌పై టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు భారత వికెట్ కీపర్ పంత్. అలానే కంగారూ ఆటగాళ్లు పైన్, స్టార్క్ కూడా సరికొత్త ఘనతల్ని అందుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. విడిచి వెళ్లారు..
కొందరు సినీ ప్రముఖులు ఈ ఏడాది లోకాన్ని విడిచి, మనల్ని శోకసంద్రంలోకి నెట్టేశారు. కానీ అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారి గురించే ఈ కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.