ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@11am

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @11am
టాప్​టెన్​ న్యూస్​@11am
author img

By

Published : Sep 23, 2020, 10:55 AM IST

1. కొత్తగా 2,296

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 321 మంది కరోనా బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. నేడు, రేపు..

రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రెండు ద్విచక్రవాహనాలు ఢీ..

అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్దామని బండి తీసిన ఆ మాస్టర్​... రోడ్డు కూడా దాటకుండానే లోకం విడిచివెళ్లిపోయాడు. మెరుపు వేగంతో స్కూటీ రావటం... రెండు వాహనాలు ఢీకొనటం... ఇద్దరు వ్యక్తులు ఎగిరిపడటం... ప్రాణాలు కోల్పోవటం... అంతా చూస్తుండగానే జరిగిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 90 వేలకు పైగా..

దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కొత్తగా 83,347 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,085 మరణాలు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. అమెరికాలో భారతీయులు కీలకం

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే భారతీయ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్​ హామీ ఇచ్చారు. అమెరికా అభివృద్ధికి భారతీయ సమాజం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. దేశ సంస్కృతిలో భాగమయ్యారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. నోబెల్ వేడుకలు ఇలా..

కరోనా నేపథ్యంలో నోబెల్​ శాంతి బహుమతి-2020 ప్రదానం వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని నార్వేజియన్​ నోబెల్ ఇనిస్టిట్యూట్​ నిర్ణయించింది. వేదికను కూడా ఓస్లో సిటీ హాల్​ నుంచి ఓస్లో విశ్వవిద్యాలయానికి మార్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. రిలయన్స్​లో కేకేఆర్​..

రిలయన్స్​ రిటైల్​లో మరో అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రిటైల్​ వ్యాపారాల్లో ప్రముఖ సంస్థ కేకేఆర్​ రూ.5,550 కోట్లతో 1.28 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్​ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. లాభాల్లో మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 288 పాయింట్లు వృద్ధి చెంది 38022కి చేరింది. నిఫ్టీ 82 పాయింట్లు మెరుగుపడి 11,235 వద్ద ట్రేడ్ అవుతోంది. రిలయన్స్ , సన్ ఫార్మా షేర్లు దూసుకుపోతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ధోనీ అందుకే..

ఐపీఎల్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్​ల్లో కుర్రాళ్లును ముందు పంపించి, తాను చివర్లో బ్యాటింగ్​కు రావడానికి గల కారణాన్ని వెల్లడించాడు ధోనీ. రాజస్థాన్​తో మ్యాచ్​లో ఇంకా బాగా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. డ్రగ్స్​ కేసులో మలుపులు

దివంగత నటుడు సుశాంత్​ మృతి కేసుకు సంబంధించిన డ్రగ్స్​ కోణం కీలక మలుపులు తిరుగుతోంది. ఇందులో ఇప్పటికే కొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ పరిస్థితులపై కలవరం చెందుతున్న అగ్రశ్రేణి నటులు కొందరు ముందు జాగ్రత్తగా న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.