ETV Bharat / city

టాప్​ టెన్​ ​న్యూస్​@11am - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news@11am
టాప్​టెన్​ ​న్యూస్​@11am
author img

By

Published : Aug 12, 2020, 10:57 AM IST

1. మరో 1,897 కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 84,544కు చేరుకుంది. మరో 9 మంది మరణించగా... మృతుల సంఖ్య 654కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. కరోనా పంజా

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజే 60,963 కేసులు నమోదయ్యాయి. మరో 834 మందిని మహమ్మారి బలి తీసుకుంది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23 లక్షలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. మరో మందు

కొవిడ్​ నివారణకు ఇప్పటికే పలు వ్యాక్సిన్ల ట్రయల్స్​​ జరుగుతున్నాయి. తాజాగా 'నిక్లోసమైడ్‌' అనే కొత్త ఫార్ములేషన్​పై మ్యాన్​కైండ్​ ఫార్మా ప్రయోగాలు చేపట్టింది. ఈ మేరకు దక్షిణ కొరియా కంపెనీ అయిన దేవూంగ్‌ ఫార్మాసూటికల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. బస్సులో మంటలు

కర్ణాటక చిత్రదుర్గలో విషాదం జరిగింది. విజయాపుర్​ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి అక్కడికక్కడే ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లా కమ్రాజిపొరా వద్ద ఎన్​కౌంటర్​ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, గ్రనేడ్లు, ఇతర మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ముష్కర వేట కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. భారత్​-నేపాల్

భారత్​, నేపాల్​ మధ్య ఈ నెల 17న ఉన్నత స్థాయి అధికారుల భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం. రెండు దేశాల ప్రాదేశిక యంత్రాంగాల మధ్య జరగబోతున్న 8వ సమావేశం ఇది. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలపై ఈ భేటీలో చర్చించినున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. అక్క సాహసం

ఓ బాలిక అత్యంత సాహసంతో 25 అంతస్థుల భవనంపై నడుస్తూ వెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తమిళనాడు పాత మహాబలిపురం రోడ్​లో ఉన్న 'హీరనందని మెడొస్' 23వ అంతస్థులో నడుస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆ బాలిక. భవనానికి ఎదురుగా ఉన్న అపార్ట్​మెంట్ వాసులు ఈ దృశ్యాలను బంధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. మార్కెట్ ఢీలా

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల బలహీనతల మధ్య బెంచ్​మార్క్ సూచీలు వెలవెలబోతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. టేలర్ కష్టమే..

న్యూజిలాండ్​ జట్టులో కీలక క్రికెటర్​గా ఉన్న రాస్​ టేలర్.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఆడేది కష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడే కచ్చితంగా ఏం చెప్పలేనని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. దర్శకుడికి విషమం

బాలీవుడ్​ దర్శకుడు నిషికాంత్ కామత్​ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.