- దుబ్బాకలో ఆధిక్యంలో భాజపా
దుబ్బాకలో ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు 4వేలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బిహార్‌లో కమలనాథుల కల నెరవేరేనా?
బిహార్‌లో ఇప్పటివరకు మిత్రపక్షంగానే ఉన్న భాజపాకు తొలిసారి పట్టుబిగించే అవకాశం కనిపిస్తోంది. బిహార్ అసెంబ్లీ కౌంటింగ్‌లో ఊహించిన దాని కన్నా ఎక్కువ స్థానాల్లో భాజపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. జేడీయూ కన్నా అత్యధిక స్థానాల్లో మెజారిటీని కనబరుస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే నితీశ్ కుమార్ సీటుకే చేటు వచ్చే అవకాశమూ లేకపోలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఎన్నికల అక్రమాల'పై రిపబ్లికన్ల పోరు ముమ్మరం
పోస్టల్ ఓట్ల లెక్కింపుపై పెన్సిల్వేనియా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు రిపబ్లికన్ పార్టీ పాలనలో ఉన్న 10 రాష్ట్రాల అటార్నీ జనరళ్లు. ఆలస్యంగా వచ్చిన ఓట్లను లెక్కించమని తీర్పునివ్వటం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. దిగువ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రిపబ్లిక్ టీవీ ప్రతినిధి అరెస్ట్
టీఆర్పీ అవకతవకలకు సంబంధించి ముంబయి పోలీసులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. రిపబ్లిక్ టీవీకి చెందిన డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘనశ్యామ్ సింగ్‌ను ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాజధానిలో నాలాల విస్తరణ
భాగ్యనగరంతో పాటు శివారు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల పరిధిలో నాలాలు, చెరువులు, ఎఫ్‌టీఎల్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలను తొలగించడానికి సర్కార్ సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో చూస్తే ఈ తొలగింపు కత్తి మీద సామేనని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఇలాగే ఉంటే రోజుకు 2 లక్షల కొత్త కేసులు'
శీతాకాలంలో కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా లేదని ఆరోగ్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శీతాకాలం సెలవుల నేపథ్యంలో వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరనుందని.. రోజూ 2లక్షలకుపైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రపంచ మార్కెట్లకు జోష్
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతున్న వేళ.. వ్యాక్సిన్‌పై ఫైజర్ చేసిన ప్రకటన చీకటి గుహలో చిక్కుకున్న వారికి వెలుతురు కనిపించినంత ఆనందాన్నిచ్చింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా సానుకూలతలు పెరిగి స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. వ్యాక్సిన్‌పై ఫైజర్ ప్రకటన తర్వాత ప్రధాన స్టాక్ మార్కెట్ల స్పందన ఇలా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఫైజర్' ప్రకటనతో జూమ్ షేర్లు రివర్స్ గేర్
లాక్డౌన్ కాలంలో రికార్డు స్థాయిలో లాభాలను గడించిన జూమ్ షేర్లు సోమవారం భారీగా కుదేలయ్యాయి. దీంతో జూమ్ వ్యవస్థపాకుడు ఎరిక్ యువాన్ సంపద 5 బిలియన్ డాలర్లకుపైగా తగ్గింది. కరోనా టీకాపై ఔషధ సంస్థ ఫైజర్ చేసిన ప్రకటనే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బౌల్ట్ గాయంపై రోహిత్ ఏమన్నాడంటే?
ముంబయి ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్డ్.. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే ఫైనల్లో పాల్గొంటాడని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రస్తుతం అతడు ఫిట్‌గా ఉన్నాడని.. ఈ పోరులో బాగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాలకృష్ణ సరసన 'అఖిల్' బ్యూటీ
యువనటి సాయేషా సైగల్.. బాలయ్య కొత్త సినిమాలో హీరోయిన్గా చేయనుంది. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.