ETV Bharat / city

Top news Today : టాప్​టెన్​ న్యూస్ @7AM - టాప్​టెన్​ న్యూస్

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news Today
టాప్​టెన్​ న్యూస్
author img

By

Published : Feb 16, 2022, 7:04 AM IST

  • నేటి నుంచే మేడారం మహాజాతర..

మేడారంలో వనదేవతల ఆగమనానికి సర్వం సిద్ధమైంది. నేటి సాయంత్రం.. భక్తుల కోలాహలం నడుమ డప్పు వాయిద్యాలు హోరెత్తుతుండగా.. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకుంటుది. ఇదే సమయంలో పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరి.. భక్తుల పూజలందుకుంటారు.

  • ఇవేమి 'శిక్షణ ఫీజులు' బాబోయ్​..

ఉద్యోగ ప్రకటనలు వస్తాయన్న నమ్మకంతో ఆదిలాబాద్‌కు చెందిన ఒక అభ్యర్థి శిక్షణ కోసం హైదరాబాద్‌ వచ్చారు. ఊర్లో తండ్రి రెండెకరాల కౌలు రైతు. ఫీజు, ఖర్చుల వివరాలు తెలుసుకున్న ఆ అభ్యర్థి అవాక్కయ్యారు. భరించే స్థితి లేకపోవడంతో లైబ్రరీలో చదువుకుంటున్న వారిని అడిగి కొన్ని పుస్తకాలు కొనుగోలు చేసి ఊరెళ్లిపోయారు.

  • రాష్ట్రంలో తగ్గుతోన్న కొవిడ్​ ఉద్ధృతి..

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 569 కేసులు నమోదవగా.. మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,379 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

  • రోజుకు నాలుగు గంటలే సమతామూర్తి దర్శనం

సాధారణ ప్రవేశ రుసుముతో బుధవారం నుంచి రోజుకు నాలుగు గంటల పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం, ముచ్చింతల్‌ సమతామూర్తి కేంద్రంలో దర్శనాలకు అనుమతిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు అనుమతి ఉంటుంది. జీవాశ్రమం నిర్వహకులు ఓ ప్రకటనలో ఈ విషయం తెలిపారు.

  • నేడు నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్​ పర్యటన

మంత్రి కేటీఆర్​ నేడు నిజామాబాద్​ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి రాక దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

  • పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం.. నలుగురు దుర్మరణం

మంగళవారం జరిగిన రెండు వెర్వేరు ఘటనల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. దిల్లీ శివార్లలో రైలు ఢీకొన్న ఘటనలో మరో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

  • ఏబీజీ షిప్‌యార్డు ఛైర్మన్‌పై సీబీఐ లుక్‌ అవుట్‌ నోటీసులు

ఇటీవల బయటపడ్డ ఏబీజీ షిప్​యార్డు స్కామ్​కు సంబంధించిన ఆ సంస్థ ఛైర్మన్​ సహా మరో 8 మందిపై సీబీఐ లుక్​ అవుట్​ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు దేశంలోని విమానాశ్రయాలు, సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు అధికారులు.

  • డిస్కౌంట్​ కోసం ఎల్‌ఐసీ పాలసీదారులకు 28వరకు అవకాశం

ఎల్​ఐసీ త్వరలోనే పబ్లిక్​ ఇష్యూకి రానుంది. పాలసీదార్లు ఐపీఓలో పాల్గొనాలంటే, వారి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) వివరాలను నమోదు చేయించుకోవడం తప్పనిసరి అని తెలిపింది. పాన్‌ వివరాలను ఫిబ్రవరి 28 లోపు ఎల్‌ఐసీ వద్ద నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

  • ఎవరి జలాలాబాద్‌ నరైన్‌?

ఐపీఎల్​ మెగావేలంలో పలువురు ఆటగాళ్లు కోట్ల ధరకు అమ్ముడుపోగా మరికొంతమందిని తక్కువ ధరకే కొనుగోలు చేశాయి ఆయా ఫ్రాంఛైజీలు. అయితే ఈ ప్లేయర్స్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​ సొంతం చేసుకున్న ఆల్​రౌండర్​ రమేశ్​కుమార్​ నేపథ్యం స్ఫూర్తిదాయకం. ఓ సారి అతడి గురించి తెలుసుకుందాం..

  • రజనీ గురించి ఆ విషయం తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే!

సూపర్​స్టార్​ రజనీకాంత్​ నిజజీవితంలో ఎంత సింపుల్​గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, అది ఏ స్థాయి నిరాడంబరతో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. ఓ సారి ఆయన ఉన్న విధానం చూసి ఆశ్చర్యపోవడం నటుడు అరవింద స్వామివంతైంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.