ETV Bharat / city

TOP TEN NEWS TODAY : టాప్​టెన్​ న్యూస్​ @1PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

TOP TEN NEWS TODAY, telangana news
తెలంగాణ వార్తలు
author img

By

Published : Feb 11, 2022, 1:02 PM IST

  • మరోసారి తెరపైకి టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసు

టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన అన్నిరికార్డులు ఇవ్వాలని ఆబ్కారీశాఖకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) లేఖ రాసింది. డిజిటల్ రికార్డులు, కాల్‌డేటా, సాక్షుల వివరాలు, నిందితుల వాంగ్మూలం రికార్డులు ఇవ్వాలని లేఖలో ఈడీ అధికారులు కోరారు.

  • 'సీఎం బయటకు వస్తే జనం భయంతో వణికిపోవాలా?'

ముఖ్యమంత్రి బయటకు వస్తే జనం భయంతో వణికిపోవాలా? అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. జనగామ జిల్లాకు చెందిన భాజపా కార్యకర్తలను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  • Hijab row: హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ సుప్రీంలో పిటిషన్​

హిజాబ్​ వివాదంపై కర్ణాటక హైకోర్టు వెలువరించిన మౌఖిక తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలైంది. ముస్లిం మహిళ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా తీర్పు ఉందని.. హైకోర్టు తీర్పుతో పాటు విచారణపై స్టే విధించాలని పిటిషనర్​ వ్యాజ్యం వేసింది.

  • 'భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి'

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా.. వసతులు కల్పించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

  • పెన్నుతో చేసిన పనికి మొదటిరోజే ఉద్యోగం ఉఫ్​

బోర్ కొట్టిందని ఓ సెక్యూరిటీ గార్డ్‌ చేసిన ఘనకార్యం.. మొదటి రోజే తన ఉద్యోగాన్ని ఊడగొట్టింది. గ్యాలరీలో ఉంచిన కోట్ల రూపాయల విలువైన పెయింటింగ్‌ను రక్షించాల్సిన వ్యక్తి.. దానిపై పెన్నుతో గీతలు గీసి నిర్వాహకులు ఆగ్రహానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..

  • 'బాధగా ఉంది సార్‌.. చొక్కా విప్పి కొడతాననడం కరెక్టేనా?'

సీఐపై ఓ ప్రజాప్రతినిధి దుర్భాషలాడిన ఘటన తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఓ మహిళా ఏఎస్సై ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో విశాఖలోని ఓ స్టేషన్‌లో పనిచేసే ఏఎస్సై వాయిస్‌ రికార్డు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంత రాజకీయ నాయకుడైతే మాత్రం ప్రభుత్వ ఉద్యోగిపై నోరు పారేసుకుంటారా సార్‌ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

  • కన్నవారిని ఒప్పించలేక.. విడిచి బతకలేక..

తమ ప్రేమ ఎక్కడ విఫలమవుతుందోనని ఆందోళన చెందిన ఓ యువ జంట ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకు ఉరి వేసుకుని మరణించారు. ప్రేమికుల రోజుకు కొద్ది రోజుల ముందే ఘటన జరగటం ఝార్ఖండ్​లోని జంషెద్​పుర్​లో కలకలం రేపింది.

  • వెయ్యికిపైగా చోరీలు.. 28 ఏళ్ల జైలు జీవితం.. మళ్లీ అరెస్ట్​

అతడు ఒక గజదొంగ. 48 ఏళ్ల జీవితంలో 28 సంవత్సరాలు జైలులోనే గడిపాడు. నాలుగేళ్ల క్రితమే విడుదలయ్యాడు. అయినా బుద్ధి మారలేదు. మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ సారి పాఠశాలలో చోరీ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్​ల ఆధారంగా పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. విచారణలో విస్తుపోయిన నిజాలు చెప్పి పోలీసులను షాక్​కు గురి చేశాడు.

  • చెన్నై, ముంబయి జట్లకు స్పెషల్ టాలెంట్

ఐపీఎల్​ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లు అంటే ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్ గుర్తొస్తాయి.​ అయితే ఐపీఎల్​ వేలంలో ఈ జట్లకు ఏకంగా ఓ స్పెషల్ టాలెంట్ ఉంది. ఇంతకీ అదేంటంటే?

  • ''భీమ్లా నాయక్​'లో పవన్ విశ్వరూపం చూస్తారు'

'భీమ్లా నాయక్' గురించి అదిరిపోయే విషయాలు వెల్లడించారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమాలో పవన్ విశ్వరూపం చూస్తారని, ఫ్యాన్స్​ పండగ చేసుకునే వార్త చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.