- రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా గాంధీభవన్ బయల్దేరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పడకలన్నింటికీ ఆక్సిజన్
డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని వైద్యారోగ్య శాఖ హైకోర్టుకు నివేదించింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ, కొవిడ్ నియంత్రణ చర్యలపై ఉన్నత న్యాయస్థానానికి డీహెచ్ శ్రీనివాసరావు వివరాలు సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలుగు ఎంపీల ఆశలు
కేంద్ర మంత్రివర్గ విస్తరణ (Union Cabinet Expansion) నేపథ్యంలో తెలుగు ఎంపీలు.. మంత్రి పదవులు వస్తాయేమోనని ఆశలు పెంచుకున్నారు. మొత్తం 8 మంది ఎంపీలకుగాను ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రగతిభవన్ ముట్టడికి యత్నం
ప్రగతిభవన్‌ను(pragathi bhavan) ముట్టడించడానికి నర్సులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకునే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జనసేనాని పార్టీ సమావేశం
ఏపీలోని మంగళగిరిలో జనసేన (JANASENA) పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నో వ్యాక్సిన్.. నో రేషన్
టీకా పంపిణీని విస్తృతం చేసేందుకు కర్ణాటకలోని శరేవడా గ్రామ సర్పంచ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీకా తీసుకుంటే కానీ రేషన్ అందించేది లేదని నిబంధన విధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాజీ మంత్రి భార్య హత్య
కేంద్ర మాజీ మంత్రి భార్య దిల్లీలో దారుణ హత్యకు గురయ్యారు. ఆమె నివాసంలోనే ముగ్గురు వ్యక్తులు కలిసి దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మమతా బెనర్జీకి చుక్కెదురు
బంగాల్ సీఎం మమతా బెనర్జీకి కోల్‌కతా హైకోర్టు రూ. 5లక్షల జరిమానా విధించింది. న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారని ఈ మేరకు తీర్పునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాయ చేసిన మహేంద్రుడు!
క్రికెట్ ప్రపంచంలో కెప్టెన్‌గా భారత జట్టును కొత్త పుంతలు తొక్కించాడు మహేంద్ర సింగ్ ధోనీ. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా జట్టుకు విశేష సేవలు అందించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ట్రాజెడీ కింగ్' ప్రస్థానం
బాలీవుడ్‌గా పిలుచుకునే హిందీ సినిమాకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఆయన. నటన అంటే కేవలం డైలాగులు బాగా చెప్పటమే అనుకునే రోజుల్లో నటుడంటే ఆ పాత్రను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసేవాడు అని పరిచయం చేసిన వ్యక్తి ఆయన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.