- మంత్రివర్గ సమావేశం..
ఈ నెల 8 తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనే అంశాలపై చర్చించనుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ప్రారంభోత్సవం వాయిదా..
రాష్ట్రంలో రేపటి నుంచి ప్రారంభించాలనుకున్న 19 జిల్లాల్లో 19 డయాగ్నటిక్ సెంటర్లను జూన్ 9 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏకకాలంలో పాల్గొని ఒకే రోజు, ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సీఎం వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- తీపి కబురు..
ఖరీఫ్ సీజన్ కోసం రాష్ట్రంలో రైతులకు రైతుబంధు సొమ్ము చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జూన్ 10లోపు ధరణిలో నమోదైన రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుందని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- మూగ జీవాలకు పెళ్లి విందు..
పెళ్లి విందు అంటే మనుషులకేనా? మూగ జీవాలది కడుపేగా. వాటికీ రుచులు చూడాలని ఉంటుందిగా! ఇలాగే భావించిన ఓ కొత్త జంట.. ఏకంగా 20 రకాల వంటకాలతో మూగజీవాలకు విందును ఏర్పాటు చేశాయి. ఆ జీవాలు కడుపారా ఆరగించాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- చివరి పరీక్షలు అప్పటి నుంచే..
ప్రస్తుతం కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్లో జేఎన్‌టీయూ మార్పులు చేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీ చివరి ఏడాది పరీక్షలు జులై 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను సవరిస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ కొత్త కాలపట్టిక విడుదల చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- 'మలయాళ' దుమారం..
పని ప్రదేశంలో మలయాళ భాష మాట్లాడవద్దని ఓ దిల్లీ ప్రభుత్వ ఆస్పత్రి ఆదేశాలు జారీ చేసింది. హిందీ లేదా ఆంగ్లం మాత్రమే మాట్లాడాలని హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- 'టీకా కేంద్రం'లో బర్త్‌డే..
టీకా కేంద్రంలో కరోనా నిబంధనలు పాటించకుండానే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా నాయకురాలు. టీకా కేంద్రంలో వేడుకలు జరపటం అభ్యంతకరమని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. ప్రవీణ్ కుమార్ అన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- రెచ్చిపోయిన బందిపోట్లు- 88మంది మృతి..
నైజీరియా కెబ్బి ప్రాంతంలో బందిపోట్లు రెచ్చిపోయారు. 8 గ్రామాలపై ఒక్కసారిగా దాడి చేసి 88మందిని బలితీసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- బౌలర్‌పై చర్యలకు ఈసీబీ హామీ!
ఎనిమిదేళ్ల క్రితం ట్విట్టర్లో స్త్రీ వివక్ష, జాత్యంహకార వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ బౌలర్ ఒలీ రాబిన్సన్పై చర్యలు తీసుకోవడానికి ఆ దేశ క్రికెట్ బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. నిషేధం లేదా జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- 'ఫ్యామిలీ మ్యాన్ 2'పై ఆగ్రహం!
'ది ఫ్యామిలీ మ్యాన్ 2'(The Family Man 2) వెబ్‌సిరీస్‌పై తమిళుల నిరసనలు కొనసాగుతున్నాయి. తమ మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలు అందులో ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఫ్యామిలీ మ్యాన్ ఎగైనెస్ట్ తమిళ్', 'బాయ్‌కాట్ అమెజాన్'(#BoycottAmazon) అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.