- తగ్గిన ఉద్ధృతి..
దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,14,460మందికి కొవిడ్(covid-19 India) సోకింది. వైరస్ బారినపడి మరో 2677 మంది మరణించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- రూ.53 కోట్ల హెరాయిన్ పట్టివేత..
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. రూ.53 కోట్ల విలువైన 8 కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్..
హైదరాబాద్‌లో మెగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సుమారు 40 వేలకు టీకాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- పాయలో బల్లి అవశేషాలు..
సాయంత్రం పూట భోజనం చేద్దామని ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఓ వ్యక్తికి అందులో బల్లి అవశేషాలు కన్పించాయి. అప్పటికే అతని కుమార్తె రెండు స్పూన్లు తినడంతో ఆందోళన చెందిన అతను.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- మేయర్ భర్త అనుచరుల దాడి..
మేయర్ అనుచరులు, కార్పొరేటర్ మధ్య చిన్న వివాదం చిలికి చిలికి పెద్దదైంది. కార్పొరేటర్ ఇంటిపై దాడికి దారితీసింది. ఘటనలో కార్పొరేటర్ తమ్ముడికి తీవ్ర గాయాలు కాగా.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- అంతర్వేది మహిళకు అరుదైన అవకాశం..
ఈ నెల 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో జరిగే సదస్సులో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన గ్రీన్‌వార్మ్స్ సభ్యురాలు తాడి దీపికకు అవకాశం దక్కింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- హజ్ యాత్రపై నిర్ణయం తీసుకోలే..
ఈ ఏడాది జరగనున్న హజ్ యాత్రపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. యాత్ర ఉంటుందా! ఉండదా! అనే అంశంలో భారత్ నిర్ణయం.. సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ఆగని పెట్రో బాదుడు..
దేశంలో పెట్రోల్ ధరల మంట కొనసాగుతూనే ఉంది. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటర్‌కు) ఆదివారం వరుసగా 27, 29 పైసలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగునంగా దేశీయంగానూ రేట్లు సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ఫెదరర్ ఔట్!
దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. మరో సారి మోకాలి గాయం తిరగబెట్టడం వల్ల టోర్నీ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత టోర్నీలో నాలుగో రౌండ్‌కు అర్హత సాధించాడు ఫెదరర్. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ఆ వ్యాఖ్యలతో ఏకీభవించను..
కరోనా సంక్షోభంలో(corona lockdown) ఎంతోమందికి సహాయపడుతున్న నటుడు సోనూసూద్(Sonu Sood)ను పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆపదలో ఉన్న అనేకమందిని ఆదుకున్న సోనూ.. ప్రధానమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి(Huma Qureshi) అన్నారు. దీనిపై స్పందించిన సోనూసూద్.. ఆమె వ్యాఖ్యలను తాను ఏకీభవించనని చెప్పారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.