ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9AM - today telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
తెలంగాణ టాప్ న్యూస్
author img

By

Published : Jul 4, 2021, 8:55 AM IST

  • నేడు సిరిసిల్లకు కేసీఆర్..

ముఖ్యమంత్రి కేసీఆర్​ రాక కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. గతంలో ఉరిసిల్లగా పేరొందిన సిరిసిల్ల ఇప్పుడు అభివృద్ధిలో అగ్రపథాన దూసుకెళుతోంది. మిగతా జిల్లాలను తోసిరాజని అపార మౌలిక వసతులతో ఆధునికతను సంతరించుకుంది. కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఇవాళ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నీటి వాటా 50-50

కృష్ణా జలాల్లో 66, 34 నిష్పత్తిలో కేటాయింపులను తిరస్కరిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం.. 811 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలు ఈ ఏడాది నుంచి చెరిసగం వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడుతో పాటు రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టులేనని.. నికరంగా కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే కృష్ణా నీటిని వాడుకోవాలని ఆంధ్రప్రదేశ్​కు స్పష్టం చేసింది. రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడతామని సీఎం తేల్చిచెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భూగర్భ పార్కింగ్ నిషేధం..!

రాష్ట్రంలో భూగర్భ పార్కింగ్(Underground parking)​ను ప్రభుత్వం నిషేధించింది. ఎకరా.. ఆపైన విస్తీర్ణంలో నిర్మించే భవనసముదాయాల్లో మొదటి ఐదు అంతస్థులు పార్కింగ్​ కోసం వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాల సమయంలో సెల్లార్లలో నీరు చేరి ప్రమాదాలు చేసుకుంటున్నందున ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అతివేగం.. తీసింది ప్రాణం

అతివేగంగా వెళ్తున్న వ్యక్తి అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు యువకులు కిందపడ్డారు. అదే సమయంలో పక్కనే వచ్చిన రెడీమిక్స్ వాహనం.. వారి పై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటన(ACCIDENT)లో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కొవిడ్‌ చికిత్సకు 200 ఔషధాలు!

కరోనా మహమ్మారికి సమర్థ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు మరిన్ని ఔషధాల కోసం పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో.. కొవిడ్‌ చికిత్సకు పనికొచ్చే వీలున్న 200 ఔషధాలను గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దీదీకి గండం తప్పదా?

ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరథ్‌ సింగ్ మాదిరిగానే.. బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పదవీ గండాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. బంగాల్​లో ఖాళీగా ఉన్న భవానీపుర్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం మందుకు రాకపోతే.. తీరథ్‌ సింగ్ పరిస్థితే మమతకూ ఎదురు కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాయిలా మారుతున్న చిన్నారి!

చిన్నారులకు చిన్న సమస్య తలెత్తినా కన్నవారి మనసు తల్లడిల్లిపోతుంది. వారు మళ్లీ కోలుకునే వరకు కలవరపడుతూనే ఉంటారు. అలాంటిది తమ పాపాయి.. చికిత్స లేని అరుదైన వ్యాధిన బారిన పడిందనే తెలిస్తే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం కదా? బ్రిటన్​లో ఓ దంపతులు ఇప్పుడు అలాంటి ఆవేదనలోనే మునిగిపోయారు. వారి అయిదు నెలల చిన్నారి శరీరం రాయిలా మారుతూ ఉండటమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మళ్లీ పెరిగిన ఇంధన​ ధరలు

లీటర్​ పెట్రోల్​పై 36 పైసలు, డీజిల్​పై 20పైసలు(Petrol price) పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ నగరాల్లో బంగారం ధరలు(Gold price) ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • త్రుటిలో చేజారే..

భారత గ్రాండ్​మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల స్పీడ్ చెస్​ ఛాంపియన్​షిప్​లో రన్నరప్​గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో 13-15 పాయింట్ల తేడాతో చైనా అమ్మాయి హో ఇఫాన్​ గెలుపొందింది. ​ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సూసైడ్​ చేసుకుందామనుకున్నా!

రెండు జాతీయ అవార్డులు, పద్మశ్రీ బిరుదు, విలక్షణ నటుడుగా స్టార్​ హోదా, అభిమానుల్లో ఫుల్​ క్రేజ్​ ఇదంతా మనోజ్ బాజ్​​పాయ్​ సొంతం. అయితే ఇవన్నీ సంపాదించే క్రమంలో ఆయన ఓ మినీ యుద్ధమే చేశారట. అయితే ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలోని ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని మనోజ్​ బాజ్​పాయ్​ అంటున్నారు. నటుడిగా మారే క్రమంలో ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆయన వెల్లడించారు​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.