ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1PM - latest news in Telugu

ఇప్పటివరకు ప్రధానవార్తలు

TOP NEWS 1PM
టాప్​టెన్​ న్యూస్​ @1PM
author img

By

Published : Dec 31, 2021, 1:00 PM IST

  • వేడుకలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

HC Comments On New Year celebrations: నూతన సంవత్సర వేడుకలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. న్యూఇయర్​ సెలబ్రెషన్స్​పై పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారన్న హైకోర్టు.. వాటిని పాటించాలని సూచించింది.

  • 'ఇబ్బందులు తెలుసుకునే సమయం ​లేదా?'

Bandi Sanjay about employees transfers : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని... జీవో 317ను సవరించాలని గవర్నర్‌ను కోరామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకునే సమయం సీఎం కేసీఆర్‌కు లేదని సంజయ్ ఆరోపించారు.

  • సఫలమైన అబ్కారీ శాఖ

Drugs Control in Telangana: రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిలో అబ్కారీ శాఖ పోలీసులతో కలిసి అమలు చేసిన ప్రణాళిక సత్ఫలితాలిచ్చింది. గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా, విక్రయాలు, వాడకందారులపై మొత్తం 497 కేసులు నమోదు చేసి 830 మందిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అరెస్టు చేసింది. పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం 134 వాహనాలను సీజ్‌ చేసింది.

  • అక్రమ మద్యం కేసులు 7297

Illegal Liquor Cases in Telangana 2021: అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలపై రాష్ట్ర అబ్కారీ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. 34 జిల్లాల్లో ప్రత్యేక బృందాలతో దాడులు చేసి.. 2021లో జనవరి నుంచి డిసెంబర్​ వరకు ఎక్సైజ్ అధికారులు 7297 కేసులు నమోదు చేశారు. వీటిలో 6546 మందిపై బైండోవర్ కేసు నమోదు చేసి వారిలో 4794 మందిని అరెస్టు చేశారు.

  • విమానంలో కొవిడ్​ పరీక్ష..

woman tested positive for covid on flight: ఆరు గంటల విమాన ప్రయాణం. జర్నీ మొదలైన కొద్దిసేపటికి శరీరంలో ఏదో బాధ. కొద్దిసేపటికే తీవ్రమైన గొంతునొప్పి. కొవిడ్​ పరీక్ష చేయించుకుంటే.. పాజిటివ్​ రిపోర్టు.. 150మంది ప్రయాణిస్తున్న విమానంలో ఓ మహిళకు ఈ పరిస్థితిని ఎదుర్కొంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే...

  • శబరిమల ఆలయానికి పోటెత్తిన భక్తులు

శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అయ్యప్పస్మామి దర్శనానికి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. అయ్యప్పమాలలో ఇరుముడితో ఆలయానికి చేరుకున్న భక్తులు.. స్వామిని దర్శించుకుంటున్నారు. మకరవిళక్కు ఉత్సవాల సందర్భంగా శబరిమల ఆలయాన్ని నిర్వహకులు ఇటీవలే తెరిచారు.

  • 'పిల్లలను పోషించే బాధ్యత తండ్రిదే'

తల్లిదండ్రుల గొడవలతో పిల్లలు ఇబ్బంది పడకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు విడిపోయినా, మైనారిటీ తీరేవరకు పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత తండ్రిపై ఉందని తెలిపింది. భర్తతో కలిసి ఉండాలని భార్యను కోర్టులు ఆదేశించలేవని మరో కేసులో గుజరాత్‌ హైకోర్టు స్పష్టం చేసింది.

  • బ్యాటరీ సంస్థ రిలయన్స్​ సొంతం

Reliance latest news: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్​ ఇండస్ట్రీస్​.. మరో వ్యూహాత్మక, భారీ ఒప్పందం కుదుర్చుకుంది. బ్రిటన్​కు చెందిన ఫారాడియన్​ అనే బ్యాటరీ తయారీ సంస్థను కొనుగోలు చేసింది.

  • యాషెస్​లో కరోనా కలవరం..

Travis Head Corona: యాషెస్ సిరీస్​లో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రెవిడ్ హెడ్​కు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

  • పెళ్లిపై నటి తాప్సీ రియాక్షన్..

Taapsee Pannu Marriage: సినీ నటి తాప్సీ రెండు హిట్​ చిత్రాలతో ఈ ఏడాదిని ముగించబోతోంది. అయితే చాలాకాలంగా ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించింది తాప్సీ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.