ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1PM - latest top news

ఇప్పటివరకు ప్రధానవార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @1PM
టాప్​టెన్​ న్యూస్​ @1PM
author img

By

Published : Jun 8, 2021, 12:55 PM IST

Updated : Jun 8, 2021, 2:48 PM IST

  • కాసేపట్లో మంత్రివర్గం భేటీ

కరోనా పరిస్థితులే ప్రధాన అజెండాగా కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. లాక్​డౌన్ విషయమై తదుపరి నిర్ణయం తీసుకోనుంది. మూడో వేవ్ సన్నద్దతపైనా దృష్టి సారించనుంది. వానాకాలం పంటలు, సాగునీటి ప్రాజెక్టుల సంబంధిత అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్ చర్చించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హుజూరాబాద్‌లో ఈటల పర్యటన

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ పర్యటిస్తున్నారు. శుంభునిపల్లి నుంచి కమలాపూర్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కమలాపూర్‌, శంభునిపల్లి, కానిపర్తిలో రోడ్‌ షోగా వెళ్తుండగా.. అనుచరులు భారీగా చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మోదీతో మహారాష్ట్ర సీఎం భేటీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. ఉదయం 11.30 సమయంలో.. ప్రధాని అధికారిక నివాసం ఉన్న 7 లోక్​ కల్యాణ్ మార్గ్​కు ఠాక్రే చేరుకున్నారు. మరాఠా రిజర్వేషన్లు, తుపాను సాయం, టీకాలు తదితర అంశాలపై మోదీతో చర్చలు జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తగ్గిన కేసులు- ఆంక్షలు సడలింపు

ఉత్తర్​ప్రదేశ్​లో కర్ఫ్యూ నిబంధనలను బుధవారం సడలించారు. దాదాపు 75 జిల్లాల్లో 600 కంటే తక్కువ కేసులు నమోదైన కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సడలింపులు అమల్లో ఉంటాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గాంధీ మునిమనవరాలికి జైలుశిక్ష

మహాత్మా గాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రాంగోబిన్​కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఆమెను మోసం, ఫోర్జరీ కేసులో దోషిగా తేల్చింది స్థానిక న్యాయస్థానం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మృగశిరతో రద్దీగా మార్కెట్లు

మృగశిర కార్తె కావడంతో చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. మార్కెట్లలో భౌతిక దూరం సైతం కొనుగోలుదారులు పాటించడం లేదు. హైదరాబాద్​ రాంనగర్​ చేపల మార్కెట్​ కిటకిటలాడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • లిఫ్ట్​ ఇచ్చి.. యువతిపై అత్యాచారం

రాజస్థాన్​ జైపుర్​లో దారుణ ఘటన జరిగింది. లిఫ్ట్​ ఇచ్చి.. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి ఓ యువతిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బయోటెక్​కు ఆక్యుజెన్ చెల్లింపులు

కొవాగ్జిన్ అభివృద్ధి చేసిన భారత్​ బయోటెక్​కు 15మిలియన్ డాలర్ల(రూ.109.23 కోట్లు)ను చెల్లించింది ఆక్యుజెన్ ఇంక్ సంస్థ. కెనడాలో ఈ టీకా పంపిణీకి ఇరువురి మధ్య కుదిరిన ఒప్పందానికి ప్రతిగా ఈ చెల్లింపులు చేసింది. కెనడాలో టీకా అందుబాటులోకి రాగానే.. మరో 10మిలియన్ డాలర్లను చెల్లించనుంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • శ్రీలంక బోర్డు వివాదం

జూన్​18-జులై 4వరకు జరగబోయే ఇంగ్లాండ్​ పర్యటన కోసం కాంట్రాక్ట్​పై సంతకం చేయకుండా అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు శ్రీలంక ఆటగాళ్లు. ఈ పర్యటన ముగిశాక బోర్డుతో కలిసి జాతీయ కాంట్రాక్ట్​ వివాదంపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మోస్ట్​ డిజైరబుల్​ ఉమెన్ రియా

టైమ్​ సర్వేలో గతేడాది మోస్ట్​ డిజైరబుల్​ ఉమెన్​(Most Desirable Women)గా బాలీవుడ్​ హీరోయిన్​ రియా చక్రవర్తి(Rhea Chakraborty) నిలిచింది. 2020లో ఆమె ప్రియుడు, నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్(Sushant Singh Rajput)​ ఆత్మహత్య తర్వాత రియాను ప్రధాన నిందితురాలిగా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆమె గురించి చర్చ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 8, 2021, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.