1. కేసులు తగ్గాయి
రాష్ట్రంలో మరో 5,186 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 38 మంది మృతి చెందారు. ప్రస్తుతం 68,462 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహమ్మారి నుంచి మరో 7,994 కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. టీకా కష్టాలు
టీకా కోసం వచ్చే ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గంటల కొద్ది వేచి చూసిన వ్యాక్సిన్ తీసుకోవడం కత్తిమీద సాములా మారింది. రాష్ట్రవ్యాప్తంగా రెండో డోసు టీకా కార్యక్రమం ప్రారంభం కాగా... తెల్లవారుజామునుంచే ప్రజలు బారులు తీరారు. చాలా చోట్ల కేంద్రాలన్నీ జనాలతో కిక్కిరిసి పోగా భౌతిక దూరం నిబంధనలు పాటించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్‌తో పాటు అన్నీ చోట్ల దాదాపు అదే పరిస్థితి కనిపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఏపీలో 20 వేల పైనే.!
రాష్ట్రంలో కొత్తగా 20,065 కరోనా కేసులు, 96 మరణాలు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,01,571 కరోనా పరీక్షలు చేశారు. వైరస్ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 12 మంది మృతి చెందారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 2,525, తూర్పు గోదావరి జిల్లాలో 2,370, చిత్తూరులో 2,269 కరోనా కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆకలి తీరుస్తున్నారు
అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదంటారు. కరోనా వేళ సొంతవారుసైతం పట్టించుకోని ఈ సమయంలో ఎంతో మందికి అండగా నిలుస్తోంది.. ఆశ్రీ ఫౌండేషన్. కొవిడ్ బాధితులకు ఉచితంగా ఆహారం అందిస్తూ ముందుకు వచ్చిందీ ఆ యువజంట. నగరంలో నిత్యం వందలమందికి పౌష్టికాహారం సరఫరా చేస్తూ...... తామున్నామంటూ ధైర్యం నింపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఆక్సిజన్‌పై టాస్క్‌ఫోర్స్
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అవసరాలు, సరఫరాపై జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. దేశంలో ఆక్సిజన్ అవసరాలను అంచనా వేసి టాస్క్‌ఫోర్స్ సిఫార్సు చేయనుంది. వివిధ విభాగాలకు చెందిన 12 మంది నిపుణులను సభ్యులుగా నియమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. భారీగా హెరాయిన్ స్వాధీనం
హెరాయిన్ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేశారు దిల్లీ పోలీసులు. రూ. 860 కోట్ల విలువైన హెరాయిన్‌ను అక్రమంగా సరఫరా చేస్తున్న ఇద్దరు అఫ్గాన్ శరణార్థులను శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితులను ఐదురోజులు పోలీస్ కస్టడీకి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. టీకాలపై అంతంతమాత్రమే!
దేశంలో వ్యాక్సినేషన్ కోసం బడ్జెట్లో రూ.35వేల కోట్లను కేటాయించింది కేంద్రం. ఇందులో ఇప్పటివరకు రూ.4,744 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. మొత్తం నిధుల్లో ఈ వ్యయం 14 శాతం లోపే ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. డీమార్ట్ దూకుడు
దేశంలోనే అతిపెద్ద రిటైల్ దిగ్గజం డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో ఆకర్షణీయ లాభాలను ప్రకటించింది. మార్చ్‌తో ముగిసిన త్రైమాసికంలో 52.56 శాతం పెరుగుదలతో.. రూ.413.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. పంత్ విరాళం
కరోనా సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్. ఓ ఫౌండేషన్‌కు బయటకు వెల్లడించని నగదు సాయంగా ప్రకటించాడు. ప్రస్తుత స్థితి నుంచి భారత్ బయటపడేందుకు ఉమ్మడి కృషి అవసరమని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. భారీ జైలు
ప్రముఖ కథానాయకుడు కార్తి 'సర్దార్' సినిమా కోసం భారీ జైలు సెట్ నిర్మించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కవమందితో పనిచేయడం కుదరదు కాబట్టి చిత్రీకరణ నిలుపుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.