1. షీ టీమ్‌కు ఆరేళ్లు..
ఆధునికత, సాంకేతికత వైపు ప్రపంచం అడుగులు వేస్తున్నా మహిళలు, యువతుల్లో మాత్రం కొన్ని అపోహలు, భయాలు తొలగడం లేదు. వారి భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర పోలీసు శాఖ ఎన్నో చర్యలు చేపట్టింది. అందులో వినూత్న ప్రయోగమే షీ టీమ్స్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రానున్న 3 రోజులు జల్లులు...
రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేళ... వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రదేశాల్లో... రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సాగర్‌లో వెక్కిరిస్తోన్న సమస్యలు...
ఉపఎన్నిక జరగబోతోన్న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మౌలిక వసతుల సమస్యలు వెక్కిరిస్తున్నాయి. సాగు నీటికి మినహా... మిగతా వాటికి జనం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా వైద్యం, రహదారులు, విద్య, ఉపాధి వంటి సౌకర్యాలు... స్థానికులకు అందడం లేదు. అన్ని పార్టీలు ఎవరికివారు తాము బాగా చేశామని చెబుతున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం ఏమీ కన్పించట్లేదు. సమస్యల పరిష్కారాల పట్ల స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. భారీ అగ్నిప్రమాదం...
ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 150 గుడిసెలు కాలిపోగా.. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఇంటికి వెళ్లేదే లేదు...
రైతుల ఆందోళన షహీన్‌బాగ్ తరహాలా కాదన్నారు బీకేయూ నేత రాకేశ్ టికాయిత్. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఇంటికి వెళ్లేది లేదని ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుండ్లీ సరిహద్దును 24 గంటలపాటు దిగ్బంధించిన సందర్భంగా ఈ విధంగా హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఆ రాష్ట్రాల్లోనే 70 శాతం...
ఓవైపు కరోనా టీకాల ప్రక్రియ జోరుగా సాగుతుండగానే మరోవైపు కేసులు పెరగడం ఆందోళనకరంగా మారింది. దేశంలో తొలిసారి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటడం గమనార్హం. అయితే 70శాతం కేసులు 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఎగిరేందుకు మరింత సమయం...
ఇటీవల మార్స్ ఉపరితలం మీదకు అడుగుపెట్టిన ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను ఎగిరేలా చేసే ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రకటించింది. అనుకున్న దాని ప్రకారం ఆదివారం చేపట్టాల్సిన ఈ ప్రయోగం.. సిస్టంలో ఏర్పడిన సాంకేతిక లోపాల కారణాలతో నిలిచిపోయినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ప్రపంచంలోనే ఖరీదైన వస్తువులు...
రాబర్ట్ నాక్ అనే వ్యక్తి ఓ యాచ్‌ను కొనుగోలు చేశాడు.. సౌదీ యువరాజు ఓ పెయింటింగ్‌ను కొన్నారు. వీటిల్లో వింతేముంది? అని అనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే యాచ్ ధర రూ. 35వేల కోట్లు అయితే.. పెయింటింగ్ విలువ రూ. 3వేల కోట్లు. షాక్ అయ్యారా? ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులు మరి. వీటితో పాటు ఇంకొన్ని ఖరీదైన వస్తువుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ధోనిపై ద్రవిడ్ కోప్పడిన వేళ...
ఎంతో ప్రశాంతంగా కనిపించే ప్రముఖ క్రికెటర్ ద్రవిడ్.. మిస్టర్ కూల్ ధోనీపై అరిచాడంటే నమ్మగలరా? అవును మీరు విన్నది నిజమే. అందుకు సంబంధించిన విషయాన్ని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ఇటీవల వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఎన్టీఆర్ తర్వాతి సినిమా...
సోమవారం(ఏప్రిల్ 12) సాయంత్రం ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే దర్శకుడు ఎవరై ఉంటారా అని ఫ్యాన్స్ తెగ మాట్లాడుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.