1. అభివృద్ధి అంటే మాదే...
ప్రస్తుతమున్న పార్టీలు, కొత్త పార్టీలు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని... మైకుల ముందు చిలక పలుకలు మాట్లాడితే ప్రజలు నమ్మబోరని ఆర్థికమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మండు వేసవి కాలంలోనూ తాగు, సాగు నీటికి ఇబ్బంది లేకుండా చూసిన ఘనత... తెరాస ప్రభుత్వానిదని హరీశ్‌రావు అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మాస్క్ తప్పనిసరి...
రాష్ట్రంలో రెండో దశ కరోనా వేగంగా వ్యాప్తి వేగంగా చెందుతోంది. రోజువారీ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. కానీ కొంతమంది మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరికీ మాస్క్ తప్పనిసరి చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వాక్సిన్ తీసుకుంటేనే అనుమతి...
తెలంగాణలో కరోనా రెండో దశలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకున్నవారిని మాత్రమే కార్యాలయాలకు అనుమతించాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. సాగర్ ప్రచారంలో ప్రత్యేక వ్యూహం...
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు... వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఏ ఒక్క వర్గం ఓట్లు కూడా తమకు దూరం కావొద్దన్న ఉద్దేశంతో... ఆయా సామాజిక వర్గాలకు చెందిన శ్రేణుల్ని రంగంలోకి దింపాయి. ఇక మండలాలకు బాధ్యులుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులు తమ కేడర్‌ను వెంటబెట్టుకుని... అందులోని వ్యక్తుల కులాల ఆధారంగా, వారిని కలుసుకునే బాధ్యతలు అప్పజెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మార్కెట్లోకి మరో ఐదు టీకాలు...
అక్టోబర్ నాటికి మరో ఐదు కరోనా వ్యాక్సిన్లు భారత్‌లో అందుబాటులోకి వస్తాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. మరో పది రోజుల్లో స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు లభించనున్నట్టు పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. మరో పోలీస్ అరెస్ట్...
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో మరో పోలీసు అరెస్టయ్యారు. ఈ కేసులో సస్పెండైన సచిన్ వాజేకు సహకారం అందించినట్లుగా భావిస్తున్న రియాజ్ కాజీ అనే అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్ను అరెస్టు చేశారు ఎన్ఐఏ అధికారులు. అనంతరం ఆయన్ని ఈ నెల 16వరకు ఎన్ఐఏ కస్టడీని విధించింది కోర్టు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. అమెరికాలో తుపాను బీభత్సం..
అమెరికా ఫ్లోరిడాలో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ప్రభావానికి లౌసీయానాలో ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. ఫ్లోరిడాలోని పనామా నగరంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. సుడిగాలి ధాటికి విద్యుత్ తీగలు, చెట్లు నేలమట్టం అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఇన్‌స్టాలో హిడెన్ ఫీచర్స్...
ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మొస్సేరి వినియోగదారులకు ఉపయోగపడే వివిధ ఫీచర్స్ గురించి నెటిజన్లకు వివరిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ వారం మరిన్ని ఫీచర్‌ల వివరాలను ఆయన పంచుకున్నారు. రోజూ ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నా మనకు తెలియని ఆ ఫీచర్స్ ఏంటో చూసేద్దామా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ధోనీ... ట్రెండ్ సెట్ చేశాడు...
వికెట్ కీపర్ కెప్టెన్సీ విషయంలో ధోనీ ట్రెండ్ సెట్ చేశాడని ఇంగ్లాండ్ క్రికెటర్ బట్లర్ అన్నాడు. ఈ సీజన్లో నాలుగు జట్లకు వికెట్ కీపర్లే సారథులుగా ఉన్నారని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. జలపాతంలో సుధీర్-రష్మీ రొమాన్స్...
'ఉగాది జాతిరత్నాలు' ప్రోగ్రాం ప్రోమో ఆకట్టుకుంటోంది. ప్రముఖ ఛానల్ ఈటీవీలో ఉగాది రోజున ఉదయం 9 గంటలకు దీనిని ప్రసారం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.