ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @11AM - ఈటీవీ భారత్ న్యూస్

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్ @11AM
author img

By

Published : Jun 30, 2020, 10:58 AM IST

1. మరో 18522 కేసులు

కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షల 66 వేలు దాటింది. మరణాలు 17 వేలకు చేరువయ్యాయి. ఒక్కరోజులోనే 418 మంది మృత్యువాతపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2. 'కొండపోచమ్మ'కు గండి

కొండపోచమ్మ జలాశయం కాల్వకు గండి పడింది. ఇటీవలే కొండపోచమ్మ జలాశయం నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీరు విడుదల చేశారు. మంగళవారం ఉదయం మర్కుక్‌ మండల శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్‌ కుడి కాలువకు గండి పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3. కరోనా రోగులు ఏమయ్యారు?

కరోనా పరీక్షలు చేయించుకుంటున్న కొందరు తప్పడు చిరునామాలు ఇస్తున్నారు. దీంతో వైరస్ సోకిన వారిని గుర్తించడం కష్టంగా మారుతోంది. హైదరాబాద్​లోనే దాదాపుగా పాజిటివ్ వచ్చిన 500 మంది ఆచూకీ లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4. తీరుమారిన శిక్షణ...

కరోనా నేపథ్యంలో హైదరాబాద్​ నగరంలో పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు ఖాళీ అయిపోయాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ కేంద్రాల నిర్వాహకులు కూడా నిరుద్యోగులకు ఆన్​లైన్​లో శిక్షణ ఇస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5. 'తాజ్'​కు బెదిరింపు

ముంబయిలోని తాజ్​హోటల్​, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్​లోని కరాచీ నుంచి సోమవారం బెదిరింపు కాల్​ రావడమే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6. 'అవి పనికిమాలిన వ్యాఖ్యలు'

కరాచీ స్టాక్‌ ఎక్స్ఛేంజీపై ఉగ్రవాదుల దాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్థాన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది భారత్​. అవి పనికిమాలిన వ్యాఖ్యలని పేర్కొంది​. ప్రపంచంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగినా భారత్​ ఖండిస్తుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

7. పోషకాహార లోపమే శాపం

కరోనా మహమ్మారి వల్ల ప్రజలు దుర్భర జీవితాలను గడపాల్సి వచ్చింది. ఈ వైరస్ నిరుపేదల జీవితాలను మరింత అగాధంలోకి నెట్టివేసింది. ఉపాధిని కోల్పోయి, కనీస తిండి కూడా దొరకని పరిస్థితి దాపరించింది. దీనిపై ప్రపంచ పౌష్టికాహార నివేదిక-2020 వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

8. టిక్​టాక్​ సంస్థకు ఎంత నష్టం?

సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను దారిలోకి తెచ్చుకోవడానికి మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక చర్యకు ఉపక్రమించింది. టిక్‌టాక్‌ సహా 59 ప్రధాన చైనా మొబైల్‌ యాప్‌లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాన్​ కారణంగా టిక్​టాక్ సంస్థకు​ రోజుకు ఎంత నష్టం? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

9. పీసీబీ అంటే అసలైన అర్థం

ఇంగ్లాండ్​​ పర్యటనకు పాకిస్థాన్​ క్రికెట్​ జట్టు ఆదివారం బయలుదేరి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు సంబంధించిన ట్విట్టర్​ ఖాతాలో పాకిస్థాన్​ పేరును తప్పుగా రాసి బోర్డు అడ్డంగా బుక్కైంది. దీనిపై నెటిజన్లు ట్రోల్స్​తో విరుచుకుపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

10. 'న్యాయం చెప్పడానికి ఇన్ని సంవత్సరాలా?'

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'నాంది'. విజయ్ కనకమేడల దర్శకుడు. ఈరోజు నరేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.