ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 3 PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news till now 3 P
టాప్​టెన్​ న్యూస్​ @ 3 PM
author img

By

Published : May 10, 2021, 2:59 PM IST

1. అసలేం ఏం జరిగింది?

బిహార్​లోని బక్సర్ జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మహాదేవ్ ఘాట్ సమీపంలో ఒక్క కిలోమీటరు పరిధిలోనే 48 శవాలు కనిపించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'మీ జోక్యం అనవసరం'

కేంద్రం తన టీకా విధానాన్ని పూర్తిగా సమర్థించుకుంది. దీనిపై సుప్రీంకోర్టు లేవనెత్తిన అంశాలపై 200 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయస్థానాలు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని పేర్కొంది. మరోవైపు, సుమోటో కేసుపై సుప్రీం చేపట్టిన విచారణ మే 13కు వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రెండు రోజుల్లో 854 కోట్లు

తమిళనాడులో లాక్​డౌన్​ అమలు నేపథ్యంలో మద్యం ప్రియులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లోనే ఏకంగా రూ.854కోట్ల మద్యం కొనుగోలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. విషాదం

కుటుంబ కలహాలతో రాజస్థాన్​లోని ఓ మహిళ తన అయిదుగురు పిల్లలతో పాటు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతిచెందగా.. మరో ఇద్దరు చివరి నిమిషంలో తల్లి చెయ్యిని వదిలించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. కుటుంబ సమస్యల కారణంగా ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఘరానాదొంగ అరెస్టు

పేరుమోసిన ఘరానా దొంగ చెంచు లక్ష్మిని హైదరాబాద్ మాదన్నపేట పోలీసులు పట్టుకున్నారు. ఆమె నుంచి నగదు, బంగారు, వెండి ఆభరణాలు, చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. సాకులతో నిలిపివేయొద్దు

ధాన్యం కొనుగోళ్లు, ఇతర ఇబ్బందులపై సంబంధిత అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్రాప్ బుకింగ్‌లో నమోదు కాలేదన్న సాకుతో.. ధాన్యం కొనుగోళ్లని నిలిపి వేయోద్దని అధికారులను ఆదేశించారు. ఆయా సమస్యలపై త్వరలో శాఖాపరమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. వారిని గుర్తించాలి

రాష్ట్రంలో జర్నలిస్టులను ఫ్రంట్​లైన్ వారియర్లుగా గుర్తించాలని సీఎం కేసీఆర్​కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి లేఖ రాశారు. రెండో దశ కరోనాతో పిట్టల్లా రాలుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. మొట్టమొదటి ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ

ఫ్రెంచ్​ ఆటోమొబైల్ దిగ్గజం రెనో.. మొట్టమొదటి సారిగా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన వెనకభాగాన్ని విడుదల చేసింది ఈ సంస్థ. దీంతో ఎస్​యూవీపై మరింత ఆశలు పెంచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. విభిన్న పాత్రలో​ రకుల్​ప్రీత్​

విభిన్న కథల్లో హీరోయిన్​గా నటిస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న రకుల్​ప్రీత్​ సింగ్​.. ఇప్పుడు మరో బోల్డ్​ కథలో నటించేందుకు సిద్ధమైంది. దర్శకుడు తేజస్‌ డియోస్‌కర్‌ తెరకెక్కిస్తోన్న సినిమాలో రకుల్​.. కండోమ్​ టెస్టర్​ పాత్ర పోషించనుందని డైరెక్టర్​ స్వయంగా వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'ఆ విషయంలో అతనే బెస్ట్​"

బౌలర్లను అర్థం చేసుకోవడంలో ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీని మించిన వారు లేరని అభిప్రాయపడ్డాడు ఆ జట్టు బౌలర్​ హర్షల్ పటేల్. బెంగళూరు జట్టులో సానుకూల వాతావరణం ఉంటుందని తెలిపాడు. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తాడని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.