మరో 4,305 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 4,305 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ బారినపడి మరో 29 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2,896కు చేరింది. మరో 6,361 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 54,832 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏ రకంగానూ అడ్డుకోవద్దు
అంబులెన్సుల నిలిపివేతపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై స్టే విధించింది. అంబులెన్సులను నియంత్రించేలా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంబులెన్సులను ఏ రకంగానూ సర్కారు అడ్డుకోవద్దని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'త్వరగా అందించేందుకు కృషి'
కొవిడ్ నియంత్రణపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్.. ఔషధాలు, టీకాల ఉత్పత్తిదారులతో సమావేశమైంది. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టాస్క్‌ఫోర్స్ సభ్యులతో పాటు ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్ తయారీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఆయనపై 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు ఎంపీ రఘురామ భంగం కలిగించారని సీఐడీ అభియోగం మోపింది. భార్య రమాదేవి పేరిట నోటీసులు ఇచ్చింది. ఎంపీ రఘురామను పోలీసులు విజయవాడ తరలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
స్పుత్నిక్-వి టీకా తొలి డోసు.!
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకా పంపిణీ ప్రారంభమైంది. వారం రోజుల క్రితమే రష్యా నుంచి వ్యాక్సిన్లు హైదరాబాద్‌కు చేరుకోగా.. సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ అనుమతితో నేడు మొదటి డోసు ఇచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.మ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
స్వల్పంగా తగ్గాయి.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం మరో 3,43,144 మంది వైరస్ బారినపడ్డారు. కొవిడ్ కారణంగా మరో 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఒకరోజు ముందుగానే .!
ఒకరోజు ముందే(మే 31) నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పీఎం కిసాన్ నిధులు విడుదల
పీఎం కిసాన్ 8వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.19 వేల కోట్లను డిపాజిట్ చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కరోనా కట్టడికి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
'ఆ విషయంలో మాటలు రావట్లేదు'
కొవిడ్ పోరులో లక్ష్యానికి మించి విరాళాలు రావడంపై స్పందించేందుకు మాటలు రావట్లేదని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తమ లక్ష్యాన్ని ఒక సారి కాదు రెండు సార్లు అధిగమించారని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
వైరస్ కంటే అదే ప్రమాదం
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ కట్టడిపై అవగాహన కల్పిస్తూ వీడియో విడుదల చేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.