1. సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ సహా... వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ఔషధాలు, వ్యాక్సినేషన్‌పై సమావేశంలో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. వడగండ్ల వర్షాలు.!
రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సృష్టిలోనే లేదు
ఈ సృష్టి మొత్తంలో తల్లి ప్రేమ కంటే గొప్పనైనది, స్వచ్ఛమైనది ఇంకోటి లేదని సీఎం కేసీఆర్ కొనియాడారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఒక మనిషి ఎదుగుదలలో తల్లి పాత్ర గురించి సీఎం వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆమెను గుర్తించండి!
నిజమే ఓ సినీ రచయిత అన్నట్లు.. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ ఉండరేమో! ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా బిడ్డను లోకంలోకి తీసుకొస్తుంది అమ్మ. వారిని చూడగానే ప్రసవ వేదనను మరిచి.. సంతోషంలో మునిగి తేలుతుంది. అలాంటి అమ్మకు ఈ మాతృ దినోత్సవాన మనసారా శుభాకాంక్షలు తెలుపుదామా.. ఈ ఆదివారం సాయంకాలాన్ని ఆమెకు ప్రత్యేకంగా మారుద్దామా.. అయితే రండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఆ రాష్ట్రాలకే టీకాలు
మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ సహా 10 రాష్ట్రాల్లోనే భారీగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది. శనివారం నమోదైన కేసుల్లో 71.75 శాతం.. ఈ రాష్ట్రాల్లోనే వెలుగు చూసినట్లు పేర్కొంది. మరోవైపు... రాబోయే మూడురోజుల్లో రాష్ట్రాలకు మరో 46 లక్షల టీకా డోసులు అందజేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. అవే కారణం కాదు.!
భారత్‌లో కరోనా ఉద్ధృతికి వైరస్ కొత్త రకాలు ఒక్కటే కారణం కాదని.. ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడేందుకు, భారీ స్థాయి సమావేశాలకు అనుమతి ఇవ్వడమూ సమస్య తీవ్రతను పెంచాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'బ్రీత్ బ్యాంక్'.. ఎక్కడంటే!
కరోనా సోకిన వారిలో ఎక్కువగా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇందుకు చెక్ పెట్టే దిశగా బ్రీత్బ్యాంక్ను ఏర్పాటు చేశారు రాజస్థాన్‌కు చెందిన నిర్మల్ గెహ్లోత్. దీనిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లోత్ ప్రారంభించారు. దేశంలో మొదటి బ్రీత్ బ్యాంక్ ఇదే కావడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. తెలుగు యువకుడి 'స్విగ్గీ'
అంకుర సంస్థల ప్రపంచంలో భారతీయ యువత దూసుకుపోతున్న వార్తలెన్నో చదువుతున్నాం. వాటిలో కొన్ని యూనికార్న్(100 బిలియన్ డాలర్ల)స్థాయిని అందుకుంటున్నాయి. అయితే ఆయా సంస్థల వ్యవస్థాపకుల్లో తెలుగువాళ్ల పేర్లు కనిపించేది అరుదు. ఆ లోటుని తీరుస్తున్నాడు ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీహర్ష మాజేటి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. వాటికే చెల్లించండి
కొవిడ్ వల్ల ఐపీఎల్ వాయిదా పడిన నేపథ్యంలో స్టార్ ఇండియా ఛానల్ స్పందించింది. తమ స్పాన్సర్లు, ప్రకటనకర్తలు.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లకే డబ్బులు చెల్లించాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఆమె కాళికాదేవి... అతను 'క్యాలీఫ్లవర్'
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో శ్యామ్ సింగరాయ్, క్యాలీఫ్లవర్, కొత్తగా రెక్కలొచ్చెనా చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.