ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 3 PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news till 3 pm
టాప్​టెన్​ న్యూస్​ @ 3 PM
author img

By

Published : May 11, 2021, 3:00 PM IST

రేపట్నుంచి లాక్‌డౌన్‌

రేపటి నుంచి రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అమలు చేయాలి'

మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి తామ పార్టీ కట్టుబడి ఉంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని మెచ్చుకున్న కేసీఆర్‌ తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆస్పత్రిపై క్రిమినల్​ కేసు

ఏపీలో కొవిడ్‌ చికిత్సల కోసం నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా స్థానిక విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఎస్‌.పి.కనకరాజు అన్నారు. ఈ మేరకు అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ పై గుంటూరు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారంలో అయిదుగురు

భగవంతునికి భక్తులకు మధ్య వారధిగా ఉండే అర్చకులపై కొవిడ్​ మహమ్మారి ప్రభావం చూపుతోంది. జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో వారం రోజుల్లో అయిదుగురు పూజారులు కొవిడ్​ మహమ్మారికి బలవ్వడం తీవ్ర విషాదం నింపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' వారి సేవలు ప్రశంసనీయం'

జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా.. శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో అనేక సవాళ్లకు ఎదురొడ్డి వారు ఎన్నో సేవలందిస్తున్నారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మళ్లీ చీలిక ఖాయమా?

అన్నాడీఎంకే అగ్రనేతలైన పళనిస్వామి, పన్నీర్​సెల్వం మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయి. అసెంబ్లీలో విపక్ష పార్టీ డిప్యూటీ లీడర్ పదవిని పళనిస్వామి తిరస్కరించడం వల్ల అభిప్రాయభేదాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఇది చిలికి చిలికి గాలివానలా తయారయ్యే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. పార్టీ చీలికకూ కారణం కావొచ్చని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పాఠశాలలో కాల్పులు

రష్యాలోని కజన్​ ప్రాంతంలో ఓ పాఠశాలలో మంగళవారం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ టీచర్​ కూడా ఉన్నట్టు సమాచారం. కాల్పులకు పాల్పడిన ఇద్దరిలో ఒకరు పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్లాస్మా దాతల వివరాలు చెప్పే 'సంజీవని'

కరోనాపై పోరులో తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది స్నాప్​డీల్​. కొవిడ్ రోగుల చికిత్సకు అవసరమయ్యే ప్లాస్మా దాతలను సులభంగా సంప్రదించేందుకు వీలుగా 'సంజీవని' అనే ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

​ పాజిటివ్ ​ మొత్తానికి దూరం!

కివీస్​తో ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​తో పాటు ఇంగ్లాండ్​తో సుదీర్ఘ సిరీస్​ కోసం ఇంగ్లాండ్​ వెళ్లనున్న టీమ్​ఇండియాకు.. బీసీసీఐ కఠిన ఆంక్షలు విధించింది! ఎవరికి కొవిడ్ నిర్ధరణ అయినా.. వారు సిరీస్​ మొత్తానికీ దూరమవ్వాలని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' 9 ఏళ్లైనా క్రేజ్​ తగ్గలా!'

ఓ అభిమాని తన ఆరాధ్య కథానాయకుడి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వస్తే, అతడిని ఏ రేంజ్​లో చూపించాడనేదే 'గబ్బర్ సింగ్'. ఈ మాస్​మసాలా బ్లాక్​బస్టర్ 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.