ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - టాప్​ టెన్ న్యూస్ @ 6

TOP NEWS HEADLINES OF THE HOUR
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
author img

By

Published : Aug 7, 2021, 6:00 AM IST

Updated : Aug 7, 2021, 9:49 PM IST

21:39 August 07

టాప్​ న్యూస్​ @10PM

టాప్​ న్యూస్​ @10PM 

  • జీవితాల్లో వెలుగులు నింపే పథకం 

కరీంనగర్ కలెక్టరేట్​లో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. దళితబంధు ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమావేశమయ్యారు. లక్షమందితో నిర్వహించే సభాప్రాంగణంతో పాటు పార్కింగ్ ఏర్పాట్లు ఇతర అన్ని అంశాలపై చర్చించారు.

  • ట్విట్టర్​ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాతాను నిలిపేసింది ట్విట్టర్​. అయితే ప్రత్యామ్నాయ వేదికల ద్వారా రాహుల్ ప్రజలకు అందుబాటులో ఉంటారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

  • పెట్టుబడులు పెట్టే ముందు.. 

అదనపు ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టడం సాధారణమే. అయితే.. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు.. దీనిపై ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి? ఆర్థిక లక్ష్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని అంశాలపైనా దృష్టిపెట్టాలి.. అవేంటంటే?

  • ఇంత ఖరీదా? 

అమెరికాలో గాలితో నిండిన ఓ చిన్న ప్లాస్టిక్ బ్యాగ్​​ రూ. ఐదు లక్షలపైనే అమ్ముడుపోయింది. గాలి కూడా ఇంత ప్రియం అయిపోయిందా.. అనుకుంటున్నారా? అయితే ఈ కథ చదివేయండి.

  • నీరజ్​కు మోదీ ఫోన్​

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్డాకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఫోన్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చోప్డా కఠోర శ్రమను, దృఢ సంకల్పాన్ని కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు ప్రధాని.

20:50 August 07

టాప్​ న్యూస్​ @9PM

టాప్​ న్యూస్​ @9PM 

  • మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం 

హైదరాబాద్‌ ఎల్​బీనగర్‌లోని సాహెబ్​నగర్‌లో మురుగునీటిని శుభ్రపరిచేందుకు మ్యాన్​హోల్​లోకి దిగి గల్లంతయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. సర్కార్ తరఫున ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ విజయలక్ష్మి.. బాధిత కుటుంబాలకు చెక్ అందించారు.

  • వేగంగా వ్యాక్సినేషన్​

దేశవ్యాప్తంగా జులై నెలలో 13.45 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. సగటున 43.41 లక్షల మందికి రోజూ వ్యాక్సిన్లు అందించినట్లు వెల్లడించింది.

  • గొడ్డలి సంప్రదాయం

సాధారణంగా మనం గొడ్డలిని కట్టెలు కొట్టడానికి, చెట్లు నరకడానికి, జంతువుల నుంచి రక్షణ కోసం వాడుతుంటాం. కానీ ఉక్రెయిన్‌లోని ఓ ప్రాంతంలో గొడ్డలిని ఆయుధంగా కంటే అలంకరణ వస్తువుగా ఉపయోగిస్తున్నారు. విభిన్నఆకృతుల్లో వైవిధ్యంగా రూపొందించిన గొడ్డళ్లను పలు రకాల వేడుకల్లో ధరిస్తూ.. పురాతన సంప్రదాయాన్ని భావి తరాలకు అందిస్తున్నారు.

  • భారత పతక విజేతలు వీరే.. 

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​ అద్భుత ప్రదర్శనతో ముగింపు పలికింది. జావెలిన్​ త్రో ఫైనల్లో నీరజ్​ చోప్రా గెలిచి స్వర్ణాన్ని ముద్దాడాడు. దీంతో భారత పతకాల సంఖ్య ఏడుకు( ఓ స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు) చేరింది.ఈ సందర్భంగా టోక్యో విశ్వక్రీడల్లో భారత్​ నుంచి ఎవరెవరు ఏఏ పతకాలు సాధించారో తెలుసుకుందాం..

  • కావాలనే ఆరోపణలు 

తనపై వచ్చిన గృహహింస ఆరోపణలపై పాప్‌ సింగర్‌ యో యో హనీసింగ్‌ స్పందించారు. తన భార్య షాలిని కావాలనే ఆరోపణలు చేస్తోందన్నారు. తన భార్యను ఎంత బాగా చూసుకునే వాడినో, ఆమెతో తన అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలుసన్నారు.

19:42 August 07

టాప్​ న్యూస్​ @8PM

టాప్​ న్యూస్​ @8PM 

  • ఎవరీ నీరజ్​ చోప్రా?

నీరజ్‌ చోప్రా.. చిన్నతనంలో జాగింగ్‌కు వెళ్లమంటే.. అమ్మో నేను చేయలేనని దుప్పటి కప్పుకొని పడుకునేవాడు.. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టక పన్నేండేళ్ల వయసులో 90కిలోల బరువుతో ఊబకాయుడిగా మారాడు. అలాంటి వ్యక్తి.. జావెలిన్‌ త్రో ఛాంపియన్‌గా ఎదుగుతాడని, ఒలింపిక్స్‌లో అద్భుతం సృష్టిస్తాడని ఎవరైనా ఊహించగలరా! కానీ, అదే జరిగింది. అనుకోకుండా ఆడిన ఆటను ఎంతో ఇష్టంగా మార్చుకున్నాడు. ఆ ఆటలో ప్రాణం పెట్టాడు. దానికి ఫలితమే ఈ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం.

  • గవర్నర్​, సీఎం అభినందనలు 

భారత్​కు స్వర్ణ పతక కలను నిజం చేసిన నీరజ్​ చోప్రాకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్​... స్వర్ణ పతక విజేత నీరజ్‌కు అభినందనలు తెలిపారు.

  • చమురు ఇక్కట్లు 

306వ నెంబర్ జాతీయ రహదారి మూసివేతతో.. మిజోరం చమురు ఇక్కట్లను ఎదుర్కొంటోంది. దీంతో పెట్రోల్​, డీజిల్​ వినియోగంపై మిజోరం ప్రభుత్వం పరిమితులు విధించింది. మరోవైపు.. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసేందుకు అసోం, మిజోరం రాష్ట్రాలు అంగీకరించినప్పటికీ ఉద్రిక్త ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.

  • అక్కడ నో డైవర్స్​

విభేదాలొచ్చి విడిపోవాలని కోరుకునే దంపతులకు అధికారికంగా విడాకులు తీసుకోవడానికి అన్ని దేశాల్లోనూ చట్టాలున్నాయి. కానీ ఆ దేశంలో పరిస్థితి అందుకు భిన్నం. అక్కడ విడాకులు తీసుకోవడం అసాధ్యం. ఎందుకంటే..

  • పిట్టగోడపై చెర్రీ- తారక్​ సరదా ముచ్చట్లు

'ఆర్​ఆర్​ఆర్'(RRR movie) ఆఖరి షెడ్యూల్​ షూటింగ్​ ఉక్రెయిన్​లో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఓ సరదా వీడియోను షేర్​ చేసింది చిత్రబృందం. ఈ వీడియో వైరల్​గా మారింది.

18:46 August 07

టాప్​ న్యూస్​ @7PM

టాప్​ న్యూస్​ @7PM 

  • గోల్డెన్​ బాయ్​కు ప్రశంసలు 

టోక్యో ఒలింపిక్స్​లో తొలి స్వర్ణం సాధించిన భారత అథ్లెట్​ నీరజ్​ చోప్రాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒలింపిక్స్​ అథ్లెటిక్స్​లోనూ 120 ఏళ్లలో భారత్​కు ఇదే తొలి పతకం. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు నీరజ్​పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

  • 'వెంటనే వ్యాక్సినేషన్ పూర్తి చేయండి'

మూడో వేవ్​పై వార్తలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్​ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ టీకా తీసుకోని వారికి ప్రత్యేక డ్రైవ్​ ద్వారా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎస్​ సోమేశ్​కుమార్​ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పనపై సీఎస్ వైద్యారోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.  

  • ప్రాణవాయువుపై ప్రత్యేక దృష్టి

కరోనా మూడో ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలోని ప్రధాన ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. దాతల సాయంతో ప్రతి ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు తుది దశకు చేరుకోగా.. మరికొన్ని చోట్ల వేగంగా పనులు జరుగుతున్నాయి.

  • ఉగ్ర ఏరివేత

గడిచిన 24 గంటల్లో అఫ్గానిస్థాన్​ భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్​లో.. 385 మంది తాలిబన్లు హతమయ్యారు. మరో 210 మంది తాలిబన్లు గాయపడ్డారు. వివిధ రాష్ట్రాల్లో జరిపిన వైమానిక దాడుల్లో ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.

  • వెరీ నైస్​ అర్హ

అల్లు అర్జున్​ ముద్దుల తనయ అల్లు అర్హ.. గుణశేఖర్​ దర్శకత్వంలోని శాకుంతలం చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఆ సినిమా సెట్​కు వెళ్లిన అల్లు అర్జున్​ దంపతులు కూతురు నటన చూసి మురిసిపోతున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

17:41 August 07

టాప్​ న్యూస్​ @6PM

టాప్​ న్యూస్​ @6PM 

  • నెరవేరిన భారత్‌ స్వర్ణ స్వప్నం

ఒలింపిక్స్​ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా నిరీక్షించిన భారత్​ కల ఫలించింది. జావెలిన్​ త్రో ఫైనల్లో గెలిచిన యువ సంచలనం నీరజ్​ చోప్రా మువ్వన్నెల పతాకానికి పసిడి కాంతులద్దాడు. 23 ఏళ్ల ఈ కుర్రాడు ఎన్నో ఆశలు.. అంచనాలతో టోక్యోకు వెళ్లి స్వర్ణం గెలిచి భారత్​ గర్వించేలా చేశాడు.  

  • మనుషులను ఎలా దింపారు?

ఎల్బీనగర్​ సాహెబ్​నగర్​లోని మ్యాన్​హోల్​లో దిగి ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి పరామర్శించారు. బాధితులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఘటనకు బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  • వెంబడించి మరీ

యూత్ అకాలీదళ్ నేతపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కారు ఎక్కుతుండగా వెంబడించి మరీ దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.

  • పూజారి నిర్వాకం 

దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన ఓ మహిళా భక్తురాలికి చేదు అనుభవం ఎదురైంది. మూసి ఉన్న ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించిందన్న కారణంతో ఆమెను తీవ్రంగా కొట్టాడో అర్చకుడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

  • అప్పుడలా.. ఇప్పుడిలా.. 

రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన ఓ యువ బాక్సర్​ ఇప్పుడు పార్కింగ్​ టికెట్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆర్థిక సమస్యలతో బాక్సింగ్​ విడిచిపెట్టినా.. తనను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశిస్తున్నానని రీతూ పేర్కొంది.

16:44 August 07

టాప్​ న్యూస్​ @5PM

టాప్​ న్యూస్​ @5PM

  • సచివాలయానికి సీఎం కేసీఆర్​

నూతన సచివాలయం పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుంటున్నారు. నిర్మాణంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేస్తున్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన పచ్చికబయలుతో సచివాలయ భవన నిర్మాణం జరుగుతోంది.  

  • టీకా కోసం వెయిటింగ్​

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై దాదాపు ఏడునెలలు కావొస్తున్నా... ఇప్పటి వరకు టీకాలు ఇచ్చింది కేవలం 1,15,46,546 మందికి మాత్రమే. అంటే కేవలం 50% మందికి మాత్రమే రాష్ట్రంలో పూర్తి లేక పాక్షిక వ్యాక్సినేషన్ పూర్తయింది. అందులోనూ రెండు డోసులు పూర్తయిన వారు 40 లక్షల లోపే ఉండటం గమనార్హం. గడువు పూర్తయిన రెండో డోస్ దొరక్క టీకా కేంద్రాల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి. మరోవైపు మూడో వేవ్ ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో వ్యాక్సినేషన్​ని వేగవంతం చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • నీటి తరలింపు ఆపాలి

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీరు తరలించకుండా ఆపాలని కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. సాగర్​ నీటి అవసరాల కోసం తరలింపు ఆపాలన్న ప్రభుత్వం... ఏపీ తన పరిమితికి మించి నీరు తీసుకుంటోందని బోర్డుకు తెలిపింది.  

  • సీఎంపై హత్యాయత్నం!

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌పై ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నం చేశారు. కారుతో ఢీకొట్టేందుకు యత్నించగా.. సీఎం అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం తప్పింది.

  • బజరంగ్​ పునియాకు కాంస్యం

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు మరో పతకం లభించింది. రెజ్లింగ్​ పురుషుల ఫ్రీస్టైల్​ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో గెలిచాడు టాప్​ రెజ్లర్​ బజరంగ్​ పునియా. ఈ కాంస్యంతో.. ప్రస్తుత ఒలింపిక్స్​లో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరింది.  

15:45 August 07

టాప్​ న్యూస్​ @4PM

టాప్​ న్యూస్​ @4PM 

  • సీఎం కేసీఆర్​ సమీక్ష

నీటిపారుదల అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఇంజినీర్లు, అధికారులతో కేంద్ర జల్‌శక్తి గెజిట్ నోటిఫికేషన్​తో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్​ సమీక్షిస్తున్నారు.

  • యూపీ సీఎంకు బెదిరింపులు 

ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు ఖలిస్థానీ అనుకూల సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. త్రివర్ణ పతాకం ఎగురవేసేందుకు యోగిని అనుమతించేది లేదంటూ ఆడియో సందేశం వచ్చింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

  • వారికి కొవిడ్​ నుంచి రక్షణ

యాంటీబాడీలపై లండన్​ శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఏడు నెలల తర్వాత కూడా యాంటీబాడీలు స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. జీఎం, ఐజీజీ యాంటీబాడీలు మినహా.. మిగతా యాంటీబాడీలు స్థిరంగా కొన్ని నెలల పాటు కొనసాగినట్లు నిపుణులు తేల్చారు.

  • మెరుగైన ర్యాంకులు 

అంతర్జాతీయ హాకీ సమాఖ్య ర్యాంకింగ్స్​ను ప్రకటించింది. తాజా జాబితాలో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు అత్యుత్తమ స్థానాల్లో నిలిచాయి. ఏ స్థానాల్లో ఉన్నాయంటే..?

  • 'మాటలు నమ్మి మోసపోయా..' 

రాజ్‌కుంద్రాపై బాలీవుడ్​ నటి షెర్లిన్​ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంద్రా.. తనతో తప్పుడు పనులు చేయిస్తాడనుకోలేదన్నారు. ఆయన చెప్పిన మాటలు నమ్మి చివరికి మోసపోయానని షెర్లిన్ కన్నీటిపర్యంతం అయ్యారు. కుంద్రా కేసులో షెర్లిన్‌ను తాజాగా ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు విచారించారు.

14:40 August 07

టాప్​ న్యూస్​ @3PM

టాప్​ న్యూస్​ @3PM

  • సచివాలయ పనుల పరిశీలన

నూతన సచివాలయం పనులను సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్​ పరిశీలించనున్నారు.  సచివాలయ పనుల పురోగతి గురించి ఆరా తీయనున్నారు. 

  • నేతన్నకు సర్కారు భరోసా

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని.... హైదరాబాద్ పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించిన వేడుకలకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. చేనేత కార్మికుల‌కు ఉపాధి, ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.

  • జలమయం

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజస్థాన్​లోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దిల్లీ, బిహార్, యూపీల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి.

  • అరుదైన వ్యాధి

పోర్చుగల్​కు చెందిన ఓ మహిళ వింత సమస్యతో బాధపడుతోంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళ కుడి భుజం కింది భాగం నుంచి చనుబాలు బయటకు రావడం ప్రారంభమైంది. అసలు ఏమైందంటే?

  • క్షీరసాగరం అందరిది

"క్షీరసాగర మథనం" చిత్రం సెక్సెస్​పై ఆనందం వ్యక్తం చేశారు దర్శకుడు అనిల్ పంగులూరి. తన రెండేళ్ల కష్టానికి ఫలితం లభించిందని అన్నారు. అనిల్ పంగులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు.

13:51 August 07

టాప్​ న్యూస్​ @ 2pm

  • అత్యవసర వినియోగానికి అనుమతి

దేశంలో సింగిల్‌ డోసు టీకా అత్యవసర వినియోగానికి అనుమతించింది కేంద్రం. ఈ మేరకు జాన్సన్​ అండ్​ జాన్సన్​ టీకాకు అనుమతులు జారీ చేసినట్లు ట్వీట్​ చేశారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్​​ మాండవియా. దీంతో దేశంలో మొత్తం 5 టీకాలు అత్యవసర వినియోగంలోకి వచ్చినట్లయిందని తెలిపారు. 

  • వెలుగులోకి విస్తుపోయే నిజాలు

హైదరాబాద్‌  నెల్లూరు స్థిరాస్తి వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వ్యాపారి విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ అడ్డగుట్టలోని వసతిగృహంలో ఉంటున్న విజయభాస్కర్‌రెడ్డి.. గత నెల 20 నుంచి అందుబాటులో లేడు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో అనుమానం వచ్చిన ఆయన అల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • ట్రెండ్ మారిందట..

ఫ్యాషన్‌ అంటే.. పాశ్చాత్య దుస్తులు, మార్కెట్లోకి అప్పుడే దిగిన ట్రెండింగ్‌ రూపాలు. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు కాలం మారుతోంది. యువత ఆలోచనలు, అభిప్రాయాలు మారుతున్నాయి. ప్రకృతిపై ప్రేమ, కొవిడ్‌ తర్వాత ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ మళ్లీ పాతకాలంలోకి అడుగులేస్తోంది. ఈ మార్పులను అందిపుచ్చుకుంటున్న చేనేత కళాకారులు.. తమ కళకు ఆధునిక సొబగులద్దుతున్నారు. ఆ వస్త్రాలనూ ట్రెండింగ్‌గా మలిచి నగర మగువల మనసు గెలుస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త దారుల్ని అనుసరించే నగర ఫ్యాషన్‌ డిజైనర్లు సైతం వీటికే ఓటేస్తున్నారు.. నేత కళాకారులతోనే తమ డిజైన్లను చేయించి.. మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు నగరంలో ట్రెండింగ్‌లో ఉంది వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదం.

  • బుర్జ్​ ఖలీఫాపై 'నవరస'

ప్రపంచంలోనే ఎత్తైన టవర్​ బుర్జ్​ ఖలీఫాపై 'నవరస' వెబ్​సిరీస్​ వీడియో​ను ప్రదర్శించారు. తమిళ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

  • 'రెండేళ్ల కష్టానికి ఫలితం దక్కింది'

12:44 August 07

టాప్​ న్యూస్​ @ 1pm

  • స్పెషల్​ విషెష్​​

చేనేత కార్మికులు, పద్మశాలీలకు జాతీయ చేనేత దినోత్సవం(national handloom day) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగానికి తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. 

  • నిందితులు దొరికేశారు

నెల్లూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్టు చేసి.. రిమాండ్​కు తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు...  కారు నంబర్ ఆధారంగా నిందితులు మల్లేశ్, సుధాకర్, కృష్ణంరాజుతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

  • ఆ టైంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్

మధ్యప్రదేశ్​లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా లబ్ధిపొందిన వారితో వర్చువల్​గా మాట్లాడారు మోదీ. ఈ పథకం ద్వారా దాదాపు దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్​ అందించినట్లు తెలిపారు.

  • ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు

ఓ వ్యక్తి దొంగతనం చేద్దామని అనుకున్నాడు. పక్కాగా ప్లాన్​ చేసుకున్నాడు. ఏటీఎంను తెరిచే ప్రయత్నం చేశాడు. అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందని భ్రమపడ్డాడు. అక్కడే అతనికి ఊహించని అవాంతరం ఎదురైంది.

  • కుర్చీ దిగకూడదనే..

'మా' అధ్యక్ష ఎన్నికలు(MAA elections) జరపకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయని నటి హేమ ఆరోపణలు చేశారు. నరేశ్​ కుర్చీ దిగకూడదని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

11:36 August 07

టాప్​ న్యూస్​ @ 12 pm

  • తాను లేక బతకలేక..

సూర్యాపేట జిల్లాలో విషాదం జరిగింది. రెండు రోజుల వ్యవధిలో యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలో గురువారం.. పురుగులమందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలి మరణం తట్టుకోలేక ప్రియుడు పవన్.. నిన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

  • పొందూరులో కేంద్ర మంత్రి 

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. జాతీయ చేనేతకారుల దినోత్సవం సందర్భంగా.. పొందూరులోని ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘాన్ని సందర్శించారు. కేంద్ర మంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • త్వరలోనే యూఎస్​ వీసాలు!

అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల విసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని సెనేటర్ల బృందం అధ్యక్షుడు బైడెన్​ పరిపాలన విభాగాన్ని కోరింది. కొవిడ్​ నుంచి కోలుకుంటున్న సమయంలోనూ వీసాల ప్రక్రియ మందకొడిగా సాగటంపై అసహనం వ్యక్తం చేస్తూ విదేశాంగ శాఖకు లేక రాసింది.

  • ఇన్వెస్టర్లకు గుర్తింపు..

స్టాక్​ మార్కెట్లో మదపర్లకూ గుర్తింపు లభించేలా కొత్త విధానం తీసుకొచ్చింది సెబీ. దీంతో నిధుల సమీకరణకు కొత్త మార్గం తెరుచుకోనుంది.

  • 'ఆర్‌ఆర్‌ఆర్‌' సెట్‌లో హాలీవుడ్‌ భామ

'ఆర్​ఆర్​ఆర్'(RRR movie)​ సెట్​లో హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ తిరిగి అడుగుపెట్టారు. చాలారోజుల తర్వాత చిత్రబృందాన్ని కలవడంపై హర్షం వ్యక్తం చేశారు.

10:41 August 07

టాప్​ న్యూస్​ @ 11 am

  • తృటిలో చేజారే..

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తృటిలో పతకం చేజారింది. గోల్ఫ్​ వ్యక్తిగత స్ట్రోక్​ ప్లేలో 4వ స్థానంలో నిలిచింది గోల్ఫర్​ అదితి అశోక్​. కానీ తన అద్భుత ప్రదర్శనతో దేశ ప్రజల చూపును అకట్టుకుంది.

  • బాంబు బెదిరింపు..

 బాలీవుడ్​ నడుటు అమితాబ్​ బచ్చన్​ నివాసానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. మరో మూడు ప్రధాన రైల్వే స్టేషన్లకు బెదిరింపులు రాగా.. బిగ్​ బీ నివాసం సహా రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు.

  • తాళం పడొచ్చు..

గడ్డి అన్నారం మార్కెట్​కు తాళం పడే అవకాశాలున్నాయి. ఈ స్థలాన్ని ఆరోగ్య శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోహెడలో ఏర్పాటు చేస్తున్న మార్కెట్​లో శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తి చేసి తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు.

  • అగ్రరాజ్యంపై కొవిడ్​ పంజా..

కొవిడ్​ మహమ్మారి రూపం మార్చుకుంటూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. డెల్టా, డెల్టా ప్లస్​ వ్యాప్తితో మళ్లీ కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. అమెరికాలో ఒక్కరోజే 1.30 లక్షల కేసులు వెలుగు చూశాయి. మెక్సికోలోని చాలా ప్రాంతాల్లో రెడ్​ అలర్ట్​ ప్రకటించారు. చైనాలో డెల్టా వ్యాప్తితో మళ్లీ ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం.

  • 'ఆచార్య' విడుదల ఎప్పుడు?

ఆచార్య మూవీ రిలీజ్ డేట్​​పై ఈ వారాంతంలో ఓ ప్రకటన రానుందనే ఊహాగానాలు సినీ వర్గాల్లో మొదలయ్యాయి. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్​ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

09:41 August 07

టాప్​ న్యూస్​ @ 10am

  • పనులు షూరూ..

పులిచింతల ప్రాజెక్టులో స్టాప్ లాక్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు సందర్శకులకు అనుమతి నిషేధించారు. డ్యాంలో విరిగిన గేటు స్థానంలో స్టాప్‌లాక్‌ గేటును శుక్రవారానికి ఏర్పాటు చేస్తామని యంత్రాంగం చెప్పినా అది సాధ్యపడలేదు. అందుకు అవసరమైన ఏర్పాట్లలోనే యంత్రాంగం, బెన్‌కాం ప్రతినిధులు తలామునకలయ్యారు.

  • వలపు వల..

హైదరాబాద్ నగరంలో వలపు వల దందా రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. వ్యాపారులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సంపన్న వర్గాలకు చెందిన వాళ్లు వెళ్లే మర్దన కేంద్రాలే ఇందుకు వేదికలవుతున్నాయి. వీటిల్లో విదేశీ యువతులతో అనైతిక కార్యకలాపాలు సాగిస్తూ... పైగా వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. దిల్లీ, కోల్‌కతా ముఠాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

  • స్వల్పంగా తగ్గాయి..

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 38,628 మందికి కరోనా సోకింది. వైరస్​తో మరో 617 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • జడ్డూ ఖాతాలో మరో ఘనత..

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో 2000 పరుగులు, 200 వికెట్లు తీసిన భారత క్రికెటర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు.

  • సన్నీ భలే చిలిపి..

సెట్​లో అల్లరిగా గడిపే సన్నీ లియోనీ తన చిలిపి చేష్టలతో సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉంటుంది. షేరో​ మూవీ షూటింగ్​లో పాల్గొన్న సన్నీ.. తన సహచర నటులతో కలిసి ఉన్న ఓ వీడియో షేర్​ చేసింది. ఇందులో జలగతో తన టీం ధైర్యాన్ని పరీక్షిస్తోంది సన్నీ.

08:34 August 07

టాప్​ న్యూస్​ @ 9am

  • అంతిమ నిర్ణయం జేఎన్​టీయూదే..

తెలంగాణలో ఈ విద్యా సంవత్సరంలో 175 ప్రైవేట్‌ కళాశాలల్లో 1.05 లక్షల మేర ఇంజినీరింగ్ సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. కొత్తగా రెండు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలను మంజూరు చేసినట్లు తెలిపింది. ప్రైవేటు కళాశాలల్లో సీట్ల పెంపుకు ఏఐసీటీఈ ఆమోదించినా సీట్లపై తుది నిర్ణయం తీసుకునేది మాత్రం జేఎన్‌టీయూహెచ్‌.

  • నవతరానికి నాణ్యమైన విద్య అందేనా?

ఏడు దశాబ్దాలు గడిచినా దేశంలోని పాఠశాలలు మౌలిక వసతుల కొరతతో కునారిల్లుతున్నాయి. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యావ్యవస్థతోనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని విద్యావేత్తలు ఎంత మొత్తుకున్నా ఈ రంగంపై ఇప్పటికీ అరకొర నిధులే ఖర్చుచేయడం ఆందోళనకరం.

  • లైంగిక దాడి అంటే ఏమిటి?

లైంగిక దాడి అంటే ఏమిటి? అనే దానిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇందుకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానానికి సహాయకుడుగా సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ దవేను నియమిస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.

  • బంగారం కొనాలనుకుంటున్నారా..

బంగారం ధరలు(Gold price today) శనివారం కాస్త తగ్గుముఖం పట్టాయి. వెండి ధర రూ.68,500 దిగువకు చేరింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు(Silver price today) ఇలా ఉన్నాయి.

  • మెగాస్టార్​కు సోదరిగా..

'వేదాళం' రీమేక్‌లో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్​ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించనున్నారు.

07:45 August 07

టాప్​ న్యూస్​ @ 8am

  • టీకానే.. శ్రీరామ రక్ష

టీకా తీసుకుంటే తీవ్రమైన కొవిడ్‌-19 ముప్పు నుంచి తప్పించుకోగలమని , ఆస్పత్రి పాలయ్యే అవసరం దాదాపుగా ఉండదని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ రేచస్‌ ఎల్ల అన్నారు.

  • అడ్డుకట్టకు ఆటంకాలు..

పులిచింతల డ్యాం వద్ద స్టాప్‌లాక్‌ గేటు పనులకు అవరోధాలు అడ్డుపడుతూనే ఉన్నాయి. ముందస్తు పనులకు కార్యాచరణ సిద్ధం చేసుకున్న గుత్తేదారు. నేడు పనులు పూర్తిచేయాలనే యోచనలో యంత్రాంగం ఉంది.

  • విఘ్నాలు తొలగేనా..!

రోనా మహమ్మారి... ఈసారైనా వినాయక చవితిని జరుపుకునేలా చేస్తుందో లేదోనని వినాయక విగ్రహాల తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. లక్షలు ఖర్చు చేసి పెద్ద పెద్ద గణనాథులను తయారు చేసి.. చివరకు పండుగ జరగకపోతే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. వినాయక ఉత్సవాలు నిర్వహించే అవకాశం ఉందో లేదో ప్రభుత్వం త్వరగా చెప్తే.. బాగుంటుందని కోరుతున్నారు.

  • బాధ్యతతో అంటున్నా..

న్యాయాధికారులపై దాడులు, బెదిరింపులు అధికమవుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సీబీఐ, ఐబీ విభాగాలు న్యాయవ్యవస్థకు సహకరించడం లేదని జస్టిస్​ ఎన్​ వీ రమణ అన్నారు. సీబీఐలో మార్పు రాదా? అని ప్రశ్నించారు.

  • అగ్ర పీఠం ఎవరిది...

ఒలింపిక్స్‌ అంటే అమెరికాదే ఆధిపత్యం. కాకపోతే ఆఖరికి అమెరికా నంబర్‌వన్‌ స్థానంలో ఉంటుందా అన్నదే అనుమానంగా మారింది. పతకాల పట్టికలో 36 స్వర్ణాలతో అగ్రస్థానంలో ఉన్న చైనా ఆ జట్టుకు షాకిచ్చేలానే కనిపిస్తోంది. చివరి రెండు రోజుల్లో 47 క్రీడాంశాల్లో పతక విజేతలెవరో తేలే అవకాశం ఉండటం వల్ల.. అగ్రపీఠం కోసం ఈ రెండు దేశాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.

06:42 August 07

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

టాప్​ న్యూస్​ @ 7am

  • హాజరుకాలేము..

అత్యవసర సమావేశానికి హాజరుపై గోదావరి యాజమాన్య బోర్డుకు ఇచ్చిన సమాధానాన్నే కృష్ణా యాజమాన్య బోర్డుకు రాష్ట్రప్రభుత్వం పంపింది. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ వల్ల.. సోమవారం నాటి సమావేశానికి హాజరుకాలేమని తెలిపింది.

  • ఒత్తిడితో ఆరోగ్యం చిత్తు..

దేశంలో ఏటికేడు మానసిక సమస్యలు హెచ్చరిల్లుతున్నాయి. కరోనా కారణంగా ఒంటరితనం, కుంగుబాటుకు గురయ్యేవారి సంఖ్య మరింత పెరిగింది. మానసిక అనారోగ్యంతో ఆర్థిక సమస్యలూ తలెత్తుతున్నాయి. దీనిని ఎదుర్కోవడానికి మానసిక వైద్యరంగంపై ప్రభుత్వ వ్యయం పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది.

  • వెంటనే వెళ్లిపోండి..

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల అరాచకత్వం మితిమీరిన నేపథ్యంలో ఆ దేశాన్ని వెంటనే విడిచిపెట్టి పోవాలని తమ పౌరులకు సూచించింది యునైటెడ్ కింగ్​డమ్. అఫ్గాన్ ​వ్యాప్తంగా ఉగ్రవాదులు మరిన్ని దాడులకు తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

  • త్వరలోనే నమూనా..

డిజిటల్‌ కరెన్సీ కార్యకలాపాల నమూనాను ఈ ఏడాది చివరి కల్లా వెల్లడించనుంది భారతీయ రిజర్వ్ బ్యాంకు. ఈ మేరకు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి రవిశంకర్‌ తెలిపారు.

  • సోనూసూద్​ బేరం

వీధి వ్యాపారితో చెప్పులను బేరం చేస్తూ సందడి చేశారు నటుడు సోనూసూద్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

05:08 August 07

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

 ఖాళీల భర్తీకి మార్గం సుగమం.!

కొత్తజోనల్‌ విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు,అధికారుల పోస్టుల వర్గీకరణను పూర్తి చేస్తూ జారీచేసిన ఉత్తర్వులతో ఉద్యోగాల నియామక ప్రక్రియ దిశగా అడుగులు పడుతున్నాయి.

 వీలు కాదన్న రాష్ట్రప్రభుత్వం

అత్యవసర సమావేశాల నిర్వహణకే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. సమావేశానికి హాజరయ్యేందుకు వీలుకాదని రాష్ట్రప్రభుత్వం చెప్పినా సమయాభావం దృష్ట్యా కొనసాగించే ఆలోచనతోనే కేఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీ ఉన్నట్లు సమాచారం. తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

 అధికారుల సస్పెన్షన్​ 

రంగారెడ్డి జిల్లా సాహెబ్‌నగర్ మ్యాన్‌హోల్ ఘటన బాధ్యులపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది. ఇద్దరు కార్మికులు మృతిచెందడంతో అసిస్టెంట్ ఇంజినీర్ గౌతమ్‌తో పాటు ఇద్దరు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు వేసింది. డిప్యూటీ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఆదివారం మరోసారి భేటీ

కృష్ణా, గోదావరి నదీయాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు దిశగా కసరత్తు జరుగుతున్న వేళ నీటిపారుదల శాఖపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష నిర్వహించారు.

 ఈ నెల 16 నుంచే..!

2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రైతు రుణమాఫీని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తిచేస్తోంది. ఈ నెల 16 నుంచి 50వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసే ప్రక్రియ చేపట్టనుంది. 

50 కోట్లు దాటిన టీకా పంపిణీ

దేశంలో కరోనా టీకా డోసుల పంపిణీ 50 కోట్ల మైలురాయిని దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు కేరళలో కొత్తగా 19,948 మందికి కరోనా సోకింది. మహారాష్ట్రలో కొత్తగా 5,539 కేసుల నమోదుకాగా.. తమిళనాడులో ఈ సంఖ్య 1,985గా ఉంది.

'అవీ​ ఉండాలా? వద్దా?'

ట్రిబ్యునళ్లలో ఖాళీలపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా అధికారుల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ట్రైబ్యునళ్లు ఉండాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ట్రైబ్యునళ్లు ఉండడం అధికారులకు ఇష్టం లేనట్లు కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించింది.

జమ్ముకశ్మీర్​లో పేలుడు

జమ్ముకశ్మీర్​లో శుక్రవారం అర్ధరాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలైనట్లు అధికారులు వెల్లడించారు. 

 ఒలింపిక్స్​లో వారిపైనే ఆశలు.! 

టోక్యో ఒలింపిక్స్​ చివరి రోజు ఆగస్టు 8 అయినప్పటికీ.. భారత్​ పోటీలు శనివారంతో ముగియనున్నాయి. మనదేశానికి మరో మూడు పతకాలు వచ్చే అవకాశముంది. శనివారం జరిగే పోటీల్లో పురుషుల జావెలిన్​ త్రో ఫైనల్లో నీరజ్​ చోప్రా ఆశలు కలిగిస్తుంటే.. రెజ్లింగ్​లో బజరంగ్​ పునియా కాంస్యం కోసం పోటీపడనున్నాడు. గోల్ఫ్​లో అదితి అశోక్​ చరిత్ర సృష్టించే అవకాశముంది. ఏ మ్యాచ్​ ఎప్పుడు జరగనుందంటే?

 భారత్​కు ఆధిక్యం

నాటింగ్​హామ్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 278 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్​కు 95 పరుగుల ఆధిక్యం లభించింది. కేఎల్​ రాహుల్​, జడేజా హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో అండర్సన్​ 4, రాబిన్సన్​ 5 వికెట్లతో రాణించారు. రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 25/0తో ఉంది. మ్యాచ్​ మూడో రోజు కూడా వర్షం అంతరాయం కలిగించింది.

Last Updated : Aug 7, 2021, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.