ETV Bharat / city

టాప్​న్యూస్ @ 9AM - top news in telangana today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-in-telangana
top-ten-news-in-telangana
author img

By

Published : Feb 12, 2022, 9:00 AM IST

వర్చువల్‌ కరెన్సీ ఎక్స్‌ఛేంజి 'బిట్‌ఫినెక్స్‌' హ్యాకింగ్‌ వ్యహారం ఐదేళ్ల తర్వాత కొలిక్కి వచ్చింది. ఈ కేసుకు 3.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.27వేల కోట్లు)ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ క్రమంలో అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు నిందితులు ఇలియా లిక్టెన్‌స్టెయిన్‌, హీథర్‌ మోర్గాన్‌ జంటను అరెస్టు చేశారు.

  • ధరణి సాక్షిగా దగా

సంగారెడ్డి జిల్లా జిన్నారం ఎసైన్డ్ భూముల వ్యవహారంలో మరో కోణం బయటపడింది. ఈ ప్రాంతంలో సుమారు 310 ఎకరాల ఎసైన్డ్ భూములు ఇతరుల పేర్ల మీదకు బదలాయించారనే విషయం తెలిసిందే. ధరణి పోర్టల్​లో.. ఈ ఎసైన్డ్ భూములు పట్టా భూములుగా మారి ఆక్రమణదారుల పేర్ల మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  • ప్రైవేట్ వైద్యవిద్య మరింత భారం

ప్రైవేట్​లో మెడిసిన్ అభ్యసించాలనుకునే వారికి మరింత భారమయ్యేలా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కొన్నింటిలో పలు కోర్సుల రుసుములు పెంచుతూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

  • పోలీస్‌స్టేషన్లకు మార్కులు..!

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 741 శాంతిభద్రతల పోలీస్‌స్టేషన్లను తొలిసారిగా పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రమంతటా ఒకేరీతిన నేరాలు జరగవు కాబట్టి నమోదైన కేసుల సంఖ్యను బట్టి ఠాణాలను నాలుగు విభాగాలుగా విభజించి మార్కుల్ని లెక్కగట్టారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ) కేంద్రంగానే ఈ పరిశీలన జరిగింది.

  • మేడారం మెరిసేలా

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తజనం పోటెత్తుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివస్తున్నారు. ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ సేవలే కాకుండా.. హాట్ ఎయిర్ బెలూన్, పారా సెయిలింగ్ రైడ్లు నిలవనున్నాయి. ఈ సేవలు ఇవాళ్టి నుంచే ప్రారంభం కానున్నాయి.

  • ఐపీఎల్‌ వారి పాట..

మరికాసేపట్లో ఐపీఎల్​ మెగా వేలం ప్రక్రియ ప్రారంభంకానుంది. నేడు (శనివారం), రేపు వేలం కొనసాగనుంది. మొత్తం 590 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంఛైజీలు పోటీ పడనున్నాయి. అయితే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా?

  • భారత్​లో అలాంటిది చూసి చాలా కాలమైంది

వెస్టిండీస్​తో సిరీస్​లో చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపాడు టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వన్డే సిరీస్​ను 3-0తో దక్కించుకోవడం తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పాడు.

  • బాలీవుడ్​ను ఢీ కొట్టిన టాలీవుడ్!

'బాహుబలి'తో బాలీవుడ్‌కే కాదు ప్రపంచ సినిమాకు దక్షిణాది సినిమా సత్తా ఏంటో తెలిసింది. క్రమంగా బాలీవుడ్‌ను దాటి ముందుకు వడివడిగా అడుగులు వేస్తోంది దక్షిణాది సినిమా. 'పుష్ప' దక్షిణాదిలో ఎంత హిట్‌ అయ్యిందో అంతే గొప్పగా హిందీ ప్రేక్షకుల్ని అలరించింది. అక్కడే రూ.100కోట్లు పైనే వసూలు చేసి ఔరా అనిపించింది. దీనికి మన మాస్‌ మంత్రమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • ఉత్తరాఖండ్​లో భూకంపం

ఉత్తరాఖండ్​లో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది.

  • దిల్లీ నడిరోడ్డులో బాలికపై దాడి

దిల్లీలో అమానవీయ ఘటన ఒకటి జరిగింది. అమ్మాయిపై ఓ వ్యక్తి తీవ్రంగా దాడి చేశాడు. చేతిలోకి కర్రను తీసుకుని విచక్షణారహితంగా కొట్టాడు. ఈ ఘటన దిల్లీ పశ్చిమ్​ విహార్​లో జరిగింది.

  • దొంగసొమ్ముతో.. వ్యాపారవేత్తలుగా చలామణి!

వర్చువల్‌ కరెన్సీ ఎక్స్‌ఛేంజి 'బిట్‌ఫినెక్స్‌' హ్యాకింగ్‌ వ్యహారం ఐదేళ్ల తర్వాత కొలిక్కి వచ్చింది. ఈ కేసుకు 3.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.27వేల కోట్లు)ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ క్రమంలో అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు నిందితులు ఇలియా లిక్టెన్‌స్టెయిన్‌, హీథర్‌ మోర్గాన్‌ జంటను అరెస్టు చేశారు.

  • ధరణి సాక్షిగా దగా

సంగారెడ్డి జిల్లా జిన్నారం ఎసైన్డ్ భూముల వ్యవహారంలో మరో కోణం బయటపడింది. ఈ ప్రాంతంలో సుమారు 310 ఎకరాల ఎసైన్డ్ భూములు ఇతరుల పేర్ల మీదకు బదలాయించారనే విషయం తెలిసిందే. ధరణి పోర్టల్​లో.. ఈ ఎసైన్డ్ భూములు పట్టా భూములుగా మారి ఆక్రమణదారుల పేర్ల మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  • ప్రైవేట్ వైద్యవిద్య మరింత భారం

ప్రైవేట్​లో మెడిసిన్ అభ్యసించాలనుకునే వారికి మరింత భారమయ్యేలా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కొన్నింటిలో పలు కోర్సుల రుసుములు పెంచుతూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

  • పోలీస్‌స్టేషన్లకు మార్కులు..!

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 741 శాంతిభద్రతల పోలీస్‌స్టేషన్లను తొలిసారిగా పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రమంతటా ఒకేరీతిన నేరాలు జరగవు కాబట్టి నమోదైన కేసుల సంఖ్యను బట్టి ఠాణాలను నాలుగు విభాగాలుగా విభజించి మార్కుల్ని లెక్కగట్టారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ) కేంద్రంగానే ఈ పరిశీలన జరిగింది.

  • మేడారం మెరిసేలా

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తజనం పోటెత్తుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివస్తున్నారు. ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ సేవలే కాకుండా.. హాట్ ఎయిర్ బెలూన్, పారా సెయిలింగ్ రైడ్లు నిలవనున్నాయి. ఈ సేవలు ఇవాళ్టి నుంచే ప్రారంభం కానున్నాయి.

  • ఐపీఎల్‌ వారి పాట..

మరికాసేపట్లో ఐపీఎల్​ మెగా వేలం ప్రక్రియ ప్రారంభంకానుంది. నేడు (శనివారం), రేపు వేలం కొనసాగనుంది. మొత్తం 590 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంఛైజీలు పోటీ పడనున్నాయి. అయితే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా?

  • భారత్​లో అలాంటిది చూసి చాలా కాలమైంది

వెస్టిండీస్​తో సిరీస్​లో చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపాడు టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వన్డే సిరీస్​ను 3-0తో దక్కించుకోవడం తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పాడు.

  • బాలీవుడ్​ను ఢీ కొట్టిన టాలీవుడ్!

'బాహుబలి'తో బాలీవుడ్‌కే కాదు ప్రపంచ సినిమాకు దక్షిణాది సినిమా సత్తా ఏంటో తెలిసింది. క్రమంగా బాలీవుడ్‌ను దాటి ముందుకు వడివడిగా అడుగులు వేస్తోంది దక్షిణాది సినిమా. 'పుష్ప' దక్షిణాదిలో ఎంత హిట్‌ అయ్యిందో అంతే గొప్పగా హిందీ ప్రేక్షకుల్ని అలరించింది. అక్కడే రూ.100కోట్లు పైనే వసూలు చేసి ఔరా అనిపించింది. దీనికి మన మాస్‌ మంత్రమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.