ETV Bharat / city

టాప్​న్యూస్ @ 9AM - top news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​న్యూస్ @ 9AM
టాప్​న్యూస్ @ 9AM
author img

By

Published : Jan 30, 2022, 8:59 AM IST

కరీంనగర్‌ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. కమాన్‌ వద్ద తెల్లవారుజామున కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

  • గాంధీజీ తన మరణాన్ని ఊహించారా?

'125 ఏళ్లు జీవిస్తా!' గాంధీజీ అనేక సందర్భాల్లో ధీమాగా చెప్పిన మాటిది. తన ఆరోగ్యంపై, ఆయుష్షుపై అంత ధీమాగా ఉండే మహాత్ముడు.. 1948 జనవరి 30కు ఒకరోజు ముందు నుంచే ఎందుకనో పదేపదే చావు గురించి మాట్లాడారు. గాంధీజీ తన మరణాన్ని ఊహించారా? ఆఖరి గడియలను ముందే గుర్తించారా? తనపై గాడ్సే కాల్పులకు ముందు సంఘటనలు చూస్తే.. ఆయన నోట వెలువడ్డ మాటలు వింటే.. ఈ సందేహం తలెత్తటం సహజం.

  • అడవికి ‘ఆమె’ మహారాణి

కారడవిలో ఉద్యోగం.. కర్తవ్యంతో పాటు స్వీయరక్షణా ప్రధానమే. వన్యప్రాణుల్ని కాపాడాలి. వేటగాళ్లను ఎదుర్కోవాలి. ఆక్రమణలను అరికట్టాలి. స్మగ్లర్ల నుంచి, కార్చిచ్చు నుంచి అటవీ సంపదను పరిరక్షించాలి. ఎప్పుడు ఎలాంటి ఆపద ముంచుకొస్తుందో తెలియదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. రాత్రింబవళ్లు తేడా లేకుండా ఎప్పుడైనా విధి నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి. పురుషులకే సవాలు వంటి సంక్లిష్టమైన ఈ కొలువుల్లో అతివలు దూసుకుపోతున్నారు. సహనానికి ప్రతీక అయిన మహిళలు బెరుకు లేకుండా అటవీ ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు.

  • సమానత్వానికి ప్రతీక

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​ సమీపంలోని సమతా స్ఫూర్తి కేంద్రం హరితశోభతో అలరారుతోంది. సుమారు వందకుపైగా రకాలతో రెండు లక్షల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సమతాస్ఫూర్తి కేంద్రం సమానత్వానికి ప్రతీక మాత్రమే కాదు.. ఆహ్లాదభరిత వాతావరణానికి వేదికగా మారనుంది.

  • యాసంగిలో తగ్గిన విద్యుత్​ వినియోగం

తెలంగాణలో యాసంగి సాగు తగ్గడం వల్ల ఆ మేరకు విద్యుత్​ వినియోగం సైతం తగ్గింది. గత రెండు నెలలుగా రాష్ట్రంలో 745 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) కరెంటు వినియోగం తగ్గినట్లు సమాచారం.

  • అమెరికాలో అగ్నిప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు మరణించారు. నెబ్రస్కా రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామంలో ఈ ఘటన జరిగింది.

  • లెజెండ్స్ లీగ్​ విజేతగా వరల్డ్​ జెయింట్స్​

లెజెండ్స్​ లీగ్​ క్రికెట్​ ఫైనల్ శనివారం రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్​లో వరల్డ్​ జెయింట్స్​ 25 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది.

  • పవన్ సినిమాతో ఆ కోరిక తీరింది

స్కూల్​లో తనకు ప్రపోజ్ చేసిన చాలామందిమంది అబ్బాయిలను చెంపదెబ్బలు కొట్టానని హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పింది. అలానే 'హరిహర వీరమల్లు' తన కోరిక తీరిందని తెలిపింది.

  • కిమ్ కవ్వింపు..

ఉత్తరకొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. ఈ సారి అత్యంత శక్తిమంతమైన మిసైల్​ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఖండాతర బాలిస్టిక్ క్షిపణి లక్షణాలతో కూడిన ఈ మిసైల్​.. 800 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్ర జలాల్లో పడిపోయింది.

  • కశ్మీర్​లో ఐదుగురు పాక్ ముష్కరులు హతం

జమ్ము కశ్మీర్​లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో జైషే మహమ్మద్(జేఈఎం) కమాండర్ జాహిద్ వానీ కూడా ఉన్నాడు.

  • గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం

కరీంనగర్‌ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. కమాన్‌ వద్ద తెల్లవారుజామున కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

  • గాంధీజీ తన మరణాన్ని ఊహించారా?

'125 ఏళ్లు జీవిస్తా!' గాంధీజీ అనేక సందర్భాల్లో ధీమాగా చెప్పిన మాటిది. తన ఆరోగ్యంపై, ఆయుష్షుపై అంత ధీమాగా ఉండే మహాత్ముడు.. 1948 జనవరి 30కు ఒకరోజు ముందు నుంచే ఎందుకనో పదేపదే చావు గురించి మాట్లాడారు. గాంధీజీ తన మరణాన్ని ఊహించారా? ఆఖరి గడియలను ముందే గుర్తించారా? తనపై గాడ్సే కాల్పులకు ముందు సంఘటనలు చూస్తే.. ఆయన నోట వెలువడ్డ మాటలు వింటే.. ఈ సందేహం తలెత్తటం సహజం.

  • అడవికి ‘ఆమె’ మహారాణి

కారడవిలో ఉద్యోగం.. కర్తవ్యంతో పాటు స్వీయరక్షణా ప్రధానమే. వన్యప్రాణుల్ని కాపాడాలి. వేటగాళ్లను ఎదుర్కోవాలి. ఆక్రమణలను అరికట్టాలి. స్మగ్లర్ల నుంచి, కార్చిచ్చు నుంచి అటవీ సంపదను పరిరక్షించాలి. ఎప్పుడు ఎలాంటి ఆపద ముంచుకొస్తుందో తెలియదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. రాత్రింబవళ్లు తేడా లేకుండా ఎప్పుడైనా విధి నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి. పురుషులకే సవాలు వంటి సంక్లిష్టమైన ఈ కొలువుల్లో అతివలు దూసుకుపోతున్నారు. సహనానికి ప్రతీక అయిన మహిళలు బెరుకు లేకుండా అటవీ ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు.

  • సమానత్వానికి ప్రతీక

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​ సమీపంలోని సమతా స్ఫూర్తి కేంద్రం హరితశోభతో అలరారుతోంది. సుమారు వందకుపైగా రకాలతో రెండు లక్షల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సమతాస్ఫూర్తి కేంద్రం సమానత్వానికి ప్రతీక మాత్రమే కాదు.. ఆహ్లాదభరిత వాతావరణానికి వేదికగా మారనుంది.

  • యాసంగిలో తగ్గిన విద్యుత్​ వినియోగం

తెలంగాణలో యాసంగి సాగు తగ్గడం వల్ల ఆ మేరకు విద్యుత్​ వినియోగం సైతం తగ్గింది. గత రెండు నెలలుగా రాష్ట్రంలో 745 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) కరెంటు వినియోగం తగ్గినట్లు సమాచారం.

  • అమెరికాలో అగ్నిప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు మరణించారు. నెబ్రస్కా రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామంలో ఈ ఘటన జరిగింది.

  • లెజెండ్స్ లీగ్​ విజేతగా వరల్డ్​ జెయింట్స్​

లెజెండ్స్​ లీగ్​ క్రికెట్​ ఫైనల్ శనివారం రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్​లో వరల్డ్​ జెయింట్స్​ 25 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది.

  • పవన్ సినిమాతో ఆ కోరిక తీరింది

స్కూల్​లో తనకు ప్రపోజ్ చేసిన చాలామందిమంది అబ్బాయిలను చెంపదెబ్బలు కొట్టానని హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పింది. అలానే 'హరిహర వీరమల్లు' తన కోరిక తీరిందని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.