ETV Bharat / city

టాప్​ న్యూస్ @ 9AM - top news today in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ న్యూస్ @ 9AM
టాప్​ న్యూస్ @ 9AM
author img

By

Published : Jan 23, 2022, 9:00 AM IST

  • సామాజిక వ్యాప్తి స్థాయికి ఒమిక్రాన్

Omicron community spread India: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్.. సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్షియం తెలిపింది. విదేశీ ప్రయాణికుల నుంచి కంటే దేశీయంగానే ఒమిక్రాన్ ఎక్కువగా వ్యాపిస్తోందని వెల్లడించింది.

  • కొత్త వేరియంట్లను ముందే గుర్తించొచ్చు

Corona new variants Tracking‌: కరోనా మహమ్మారి వేరియంట్ల రూపంలో పంజా విసురుతోంది. ఇప్పుడు ఒమిక్రాన్.. అంతకుముందు డెల్టా.. ఇలా ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. అయితే కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లను ముందుగా గుర్తించవచ్చా? అంచనా వేసి.. వ్యాప్తి నివారించవచ్చా? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే?

  • మృతదేహం చుట్టూ 125 పాములు

SNAKES surrounded dead man: అమెరికాలోని ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఘటన వెలుగుచూసింది. మేరీలాండ్​లో నివసించే ఓ వ్యక్తి మరణించగా.. అతడి చుట్టూ 125 పాములు కనిపించాయి. వీటిని చూసి పోలీసులు ఉలిక్కిపడ్డారు.

  • డోల డోల 'డోలో 650'

Dolo 650 Tablet: 'డోలో 650'.. కొవిడ్‌ మహమ్మారితో ప్రజలందరి నోళ్లలో నానుతున్న మందు ఇదే. ఇంతకీ ఏమిటీ మందు.. దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యం? దీన్ని ఉత్పత్తి చేస్తున్నది ఎవరు? అనేవి అత్యంత ఆసక్తికరమైన అంశాలుగా మారాయి.

  • పంజాబ్​ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరు?

Punjab Congress CM Face: పంజాబ్​ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించే విషయమై కాంగ్రెస్‌ అధిష్ఠానం సతమతమవుతోంది. తనను కాకుండా మరెవరినైనా అధికారికంగా ప్రకటిస్తే ఎన్నికల ముంగిట్లో సిద్దూ ఎలా ప్రవర్తిస్తారోననే భయం ఆ పార్టీని వెంటాడుతోంది. మరోవైపు.. ప్రస్తుత సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కోరుకుంటున్నారు.

  • ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు పదోన్నతి

IAS, IPS officers Promotions in Telangana : రాష్ట్రంలో 41 మంది ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. వీరిలో 29 మంది ఐఏఎస్‌, 12 మంది ఐపీఎస్‌ అధికారులున్నారు. పదోన్నతులు పొందిన అధికారులు కొత్త హోదాలతో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లోనే కొనసాగాలని ప్రభుత్వం ఆదేశించింది.

  • గతుకుల్లో బతుకు బండి

Corona effect on auto-rickshaw : హైదరాబాద్​లాంటి మెట్రో నగరంలో గ్రామాలు, పట్టణాల్లో అయినా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రజారవాణా వ్యవస్థతో పాటు ఆటోవాలాలు ఎంతో కీలకం. రవాణా వ్యవస్థలో కీలకమైన ఆటో డ్రైవరన్న కొవిడ్ విజృంభనతో గిరాకీల్లేక అవస్థలు పడుతున్నారు. జిల్లాల్లోనూ విద్యార్థులను తరలించే ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది.

  • మయన్మార్‌ సైన్యానికి బలం.. భారత్​కు ముప్పు?

Myanmar teak export: అమెరికా వ్యాపార సంస్థలు మయన్మార్ నుంచి అక్రమంగా టేకు దిగుమతి చేసుకుంటున్నాయి. టేకు ఎగుమతుల ఆదాయంతో మయన్మార్ సైనిక ప్రభుత్వం మరింత బలపడుతోంది. ఈశాన్య భారతంలోని సాయుధులకు మయన్మార్‌ సైన్యంతో దోస్తీ కుదిరింది. ఈ నేపథ్యంలో భారత్ దేశప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

  • బంగ్లా ప్రీమియర్ లీగ్​లోనూ బన్నీ క్రేజ్

BBL Pushpa: అల్లు అర్జున్ 'పుష్ప' క్రేజ్ మామూలుగా లేదు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్​లో జరిగిన ఓ సన్నివేశమే ఇందుకు నిదర్శనం.

  • 'నా కెరీర్​ గురించి రకరకాలుగా మాట్లాడారు'

సకల కళావల్లభురాలు శ్రుతిహాసన్‌. నటన.. సంగీతం.. రచన.. ఇలా అన్నింట్లోనూ ఆమె ప్రతిభ చూపుతోంది. తండ్రికి తగ్గ తనయ అని ఎప్పుడో అనిపించుకుంది. పుష్కరకాలంగా కథానాయికగా కొనసాగుతున్నా ఇప్పటికీ ఆమె చరిష్మాలో వన్నె తగ్గలేదు. ప్రభాస్‌ 'సలార్‌'తోపాటు.. బాలకృష్ణ, చిరంజీవి వంటి అగ్ర కథానాయకుల సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా శ్రుతిహాసన్‌తో 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా ముచ్చటించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.