ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 11AM - telangana top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్ @ 11AM
author img

By

Published : Jul 20, 2021, 10:58 AM IST

  • కారెక్కనున్న కౌశిక్​

కాంగ్రెస్​కు రాజీనామా చేసిన హుజూరాబాద్ నాయకుడు కౌశిక్‌ రెడ్డి రేపు తెరాసలో చేరనున్నారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో సీఎం సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకు సంబంధించి కాసేపట్లో కొండాపూర్‌లోని తన నివాసంలో కౌశిక్‌ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్ @ 30 వేలు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. క్రితం రోజుతో పోలిస్తే 8 వేల కేసులు తక్కువగా నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. కొత్తగా 30,093‬ మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 374 మంది చనిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రెట్టింపు రాబడి

తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్ల రుసుంలు త్వరలో పెరగనుండటం వల్ల సోమవారం రోజున భారీగా రిజిస్ట్రేషన్లు(Registrations) జరిగాయి. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో రాబడి వచ్చింది. పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో జనం తరలిరావడం వల్ల సోమవారం ఒక్క రోజునే ఏడున్నర వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగి రూ.73 కోట్లు ఆదాయం వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • జేఈఈ మెయిన్​ మూడో విడత పరీక్ష

రాష్ట్రంలో జేఈఈ మెయిన్​ మూడో విడత ఆన్​లైన్​ పరీక్షలు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా సుమారు7.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 1.11 లక్షల మంది పరీక్షలకు హాజరవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ

మణిపుర్​ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గోవిందాస్ కొంతౌజం రాజీనామా చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. పార్టీని అధ్యక్షుడు వీడటం చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటు మరో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వరదలో రోడ్డు దాటడానికి యత్నించి..

రాజస్థాన్​లోని సవాయీ మధోపుర్ జిల్లాలో వర్షాల ధాటికి నాలాలు పొంగిపొర్లడం వల్ల రోడ్లు ప్రమాదకరంగా మారాయి. షేర్​పుర్​-ఖిల్చాపుర్​ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులు వరదలో కొట్టుకుపోయారు. అదే సమయానికి అక్కడ ఉన్న స్థానికులు వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పసిడి ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు(Gold Rate Today) అతి స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి రూ.70 వేల లోపునకు పడిపోయింది. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అదే నిజమైతే

పెగాసస్(Pegasus spyware) వ్యవహారంపై ఐరాస మానవహక్కుల హైకమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వాలు ఇలాంటి నిఘా సాంకేతికతను ఉపయోగించడం మానుకోవాలని అన్నారు. సమాజ పురోగతిలో ప్రధాన పాత్ర పోషించే జర్నలిస్టులు, మానవ హక్కుల పరిరక్షకుల నోళ్లను మూసే ప్రయత్నం చేస్తే అందరూ ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పతకాలు పట్టుకొస్తారా?

ఈ విశ్వ క్రీడల్లో కచ్చితంగా భారత షూటర్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు.. మిగతా క్రీడల్లో కంటే షూటింగ్‌లోనే ఎక్కువ పతకాలు వచ్చే అవకాశం ఉంది.. కనీసం ఒక్క స్వర్ణమైనా వస్తుంది.. మన యువ షూటర్లు సంచలన ప్రదర్శన చేస్తారు.. గత రికార్డును తిరగరాస్తారు.. ఇలా టోక్యో ఒలింపిక్స్‌ ప్రస్తావన వచ్చినపుడల్లా భారత షూటింగ్‌ బృందం గురించి అంచనాలు భారీగా ఉంటున్నాయి. ఎక్కడ ప్రపంచకప్‌ టోర్నీ జరిగినా అందులో మన షూటర్లు కచ్చితంగా పతకాలు గెలుస్తూ వచ్చారు. దీంతో వాళ్లపై అంచనాలు ఆకాశానికంటాయి. వాటిని చేరుకునే దిశగా ఒలింపిక్స్‌లో షూటర్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రీమేక్​లతో రిస్క్‌

విక్టరీ వెంకటేశ్ (Venkatesh) హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం 'నారప్ప'(Narappa). తమిళ మూవీ 'అసురన్​'కు (Asuran) రీమేక్​గా రూపొందింది. ఓటీటీ వేదికగా ఈ సినిమా విడుదలైన సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారు శ్రీకాంత్‌ అడ్డాల(Srikanth Addala). ఇందులో భాగంగా రీమే​క్​ కథల్లో రిస్క్​ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.