ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana news, telangana updates, telangana top news
తెలంగాణ న్యూస్, తెలంగాణ అప్​డేట్స్, తెలంగాణ టాప్ న్యూస్
author img

By

Published : Apr 17, 2021, 8:59 AM IST

  • కొనసాగుతున్న నాగార్జునసాగర్ పోలింగ్

నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో 346 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 3వేల 145 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. కరోనా దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఓటు వేసిన భగత్

నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో 346 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. తెరాస అభ్యర్థి నోముల భగత్ హాలియా ఇబ్రహీంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బంగాల్ ఐదో విడత పోలింగ్

అధికార తృణమూల్​ కాంగ్రెస్​, భాజపా మధ్య నువ్వా-నేనా అనే విధంగా పోటీ నెలకొన్న బంగాల్లో శనివారం ఐదోదశ పోలింగ్‌ ప్రారంభమైంది . ఎన్నికలు జరగనున్న 45 స్థానాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కస్థానం కూడా గెలవని భాజపా 2019 పార్లమెంటు ఎన్నికల్లో తృణమూల్​పై ఆధిక్యం చాటుకుంది. మళ్లీ అదేజోరు కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తిరుపతి ఉప పోరు పోలింగ్

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల పోలింగ్​ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్... రాత్రి 7 గంటల వరకూ సాగనుంది. కరోనా నేపథ్యంలో ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున... మొత్తం 2 వేల 470 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు... మే 2న జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పారాసెట్మాల్‌కు అధిక గిరాకీ

ఇటీవల కొవిడ్‌-19 బాధితుల సంఖ్య మళ్లీ బాగా పెరగడం వల్ల యాంటీ-బయాటిక్‌, మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్ల కొనుగోలు ఎంతో పెరిగింది. దీనివల్ల పారాసెట్మాల్‌, అజిత్రోమైసిన్‌, డాక్సీసైక్లిన్‌, లెవోసిట్రిజిన్‌, మాంటెలుకాస్ట్‌.. తదితర ఔషధాలకు డిమాండ్‌ హెచ్చింది. ఫార్మా కంపెనీలు వీటి తయారీని పెంచాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మరో 100 రోజులు ముప్పే

వచ్చే 100 రోజుల వరకు కరోనా రెండో దశ కొనసాగుతుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మహమ్మారి నివారణకు జాగ్రత్తలు తీసుకోవడమే పరిష్కారమని సలహా ఇస్తున్నారు దిల్లీలోని ప్రముఖ వైద్యుడు నీరజ్​ కౌశిక్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 25% వైద్య సిబ్బందికి కరోనా

హైదరాబాద్‌ నిమ్స్‌లో గత నెల రోజుల్లోనే సుమారు 25 మంది వైద్యులు, 60 మంది నర్సులు కొవిడ్‌ బారినపడ్డారు. పారిశుద్ధ్య, భద్రతా సిబ్బందిలో సుమారు 200 మందికి వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇక్కడ రోజుకు కనీసం 8-10 మంది వైద్యసిబ్బంది పాజిటివ్‌లుగా నిర్ధారణ అవుతున్నారు. సేవలందించిన ఆసుపత్రిలోనే వీరు చికిత్సలు పొందుతున్నారు. నిమ్స్‌లో రోగుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని.. ఒక వైద్యుడు పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 10 రోజుల్లోనే కోలుకొని తిరిగి సేవలందించడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • జగమెరిగిన వైద్య శిఖామణి

జగమెరిగిన వైద్య శిఖామణిగా, మానవీయత నిలువెల్లా నిండిన ఆర్ద్రతగల వ్యక్తిగా డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు వైద్య రంగానికి చేసిన సేవలు నిరుపమానవైనవి. రేడియాలజిస్టుగా విశిష్టసేవలందించడమే కాకుండా- తెలుగునాట వైద్యసేవల రూపురేఖలు మార్చిన ఘనత డాక్టర్‌ కాకర్ల సొంతం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వినేశ్‌, దివ్య, అన్షులకు స్వర్ణాలు

ఆసియా రెజ్లింగ్​లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. ఒకే రోజు ఏకంగా మూడు స్వర్ణాలు భారత్​ కైవసం చేసుకుంది. వినేశ్​ ఫొగాట్​, అన్షు మలిక్​, దివ్యా కక్రాన్​ బంగారు పతకాలతో మెరిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తమిళ హాస్య నటుడు వివేక్​ కన్నుమూత

ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్​ ఈ రోజు తెల్లవారు జామున 4:35 గంటలకు మరణించారు. నిన్న గండెపోటుతో చెన్నైలోని సిమ్స్​ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.