ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 1PM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-in-telangana-today-till-now
టాప్​టెన్ న్యూస్ @ 1PM
author img

By

Published : Mar 16, 2021, 1:01 PM IST

  • శాసనసభ రేపటికి వాయిదా

శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇటీవల మరణించిన నోముల నర్సింహయ్య, మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం ప్రకటించింది. సంతాపాల తర్వాత శాసనసభ రేపటికి వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

ఏపీలో.. అమరావతి భూముల క్రయవిక్రాయలకు సంబంధించి.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు.. సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ లోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని ఇళ్లకు వెళ్లి.. వేర్వేరుగా నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ స్థితికి దిగజారారు‌

తెదేపా అధినేత చంద్రబాబుకు.. సీఐడీ నోటీసులు జారీ చేయడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. చంద్రబాబుపై.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితికి వైకాపా దిగజారిందని ఆగ్రహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నడిరోడ్డుపై నరికేశాడు

తమిళనాడులో ఉన్మాదిగా మారిన ఓ యువకుడు తన భార్య, అత్తపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో వారిద్దరూ చనిపోయారు. ఈ ఘటన కడలూరు పోర్టు ప్రాంతంలో జరిగింది. బాధితురాలు తన తల్లితో కలిసి రోడ్డుపై వెళ్తుండగా ఈ హత్యకు పాల్పడ్డాడు నిందితుడు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఈ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పార్లమెంట్​ ముందుకు కీలక బిల్లులు

పార్లమెంట్ ఉభయ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్​సభలో ఈరోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తోంది. షెడ్యూల్డ్ కులాల సవరణ బిల్లు-2021పై ఈరోజు చర్చ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భద్రతపై రాజీ పడటమే

ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మి దేశ ఆర్థిక భద్రతను కేంద్రం సంక్షోభంలోకి నెట్టివేస్తోందని కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ‌సంఘాల సమాఖ్య చేపట్టిన సమ్మెకు రాహుల్​ మద్దతునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సోదర బంధం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్​కు శాశ్వత సభ్యత్వం ప్రతిపాదనను పోర్చుగల్​ సమర్థిస్తుందని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు ద్యువార్తె పషికో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య మంచి బంధం ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చైనాలో సిగ్నల్ యాప్​పై నిషేధం!

సిగ్నల్ యాప్​ను చైనా నిషేధించినట్లు తెలుస్తోంది. వీపీఎన్ లేకుండా ఈ యాప్​ను యాక్సెస్ చేయడం కష్టంగా మారింది. ఫేస్​బుక్, ట్విట్టర్ వంటి అంతర్జాతీయ సామాజిక మాధ్యమాల మాదిరిగానే దీనిపైనా ఆంక్షలు విధించినట్లు స్పష్టమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'కత్తి'లా మెరుస్తుందా!

టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్​గా ఇటీవలే చరిత్ర సృష్టించింది తమిళనాడుకు చెందిన సీఏ భవానీ దేవీ. అడ్జెస్టెడ్ అఫీషియల్​ ర్యాంకింగ్​ ద్వారా భవానీ అర్హత సాధించింది. తన కష్టం వృథా కాలేదని.. ఒలింపిక్స్​లోనూ సత్తాచాటుతానని వెల్లడించింది.​​ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మహేశ్​ ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ

కింగ్​ నాగార్జున ఎన్​ఐఏ అధికారిగా నటించిన చిత్రం 'వైల్డ్​డాగ్​'. హైదరాబాద్​లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఆధారంగా రూపొందిన యాక్షన్​ ఎంటర్​టైనర్​ ఏప్రిల్​ 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా.. నాగ్​ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.