ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9AM - telangana latest updates

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్ @ 9AM
author img

By

Published : Mar 13, 2021, 9:06 AM IST

  • రేపే పట్టభద్రుల పోలింగ్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు.. ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలతో ప్రచారం ముగిసింది. ఇవాళ ఉదయం నుంచి ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేయనున్నారు. అన్ని ప్రముఖ పార్టీలు.. స్వతంత్ర్య అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆమె సేవలు ప్రశంసనీయం

సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ ఇందు మల్హోత్రా శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆవరణలో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్.ఎ.బోబ్డే.. న్యాయ వ్యవస్థకు జస్టిస్​ మల్హోత్ర చేసిన సేవలను కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అసోంలో రూ.31 కోట్ల నగదు

అసోంలో ఎన్నికల నోటిఫికేషన్​ ప్రకటించినప్పటి నుంచి మొత్తం రూ.31.81 కోట్లకు పైగా విలువైన నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులు పట్టుకున్నామని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. నగదు, మద్యం, బంగారం, వెండి ఆభరణాలు, నిషేధిత మత్తుపదార్థాలు సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సీఏఏ మూలకే

పౌరసత్వ సవరణ చట్టాన్ని ఒక రాజకీయాస్త్రంగా భాజపా వాడుకుంటోందని ​ఆరోపించారు కాంగ్రెస్​ నేత గౌరవ్​ గొగొయ్. అసోంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని అమలు కానీయబోమని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అతిపెద్ద కిడ్నీ వైద్యశాల

కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఉచిత డయాలసిస్​ ‌సౌకర్యం అందించేలా దిల్లీలో సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ అతిపెద్ద కిడ్నీ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది. రోజూ 500 మందికి ఇక్కడ డయాలసిస్​ సౌకర్యం కల్పించనున్నారు. 24 గంటలు రోగులకు వైద్యసేవలు అందించేలా ఈ ఆసుపత్రిని సిద్ధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆవిష్కరణల మొనగాడు!

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. - విద్యుత్తు, సౌరశక్తితో దూసుకెళ్లే సైకిల్‌ తయారు చేశాడు!కూలీలు దొరక్క రైతులు పొలాల్లో కలుపు తీసేందుకు ఇబ్బందులు పడుతున్నారు.. - బ్యాటరీతో పని చేసే గ్రాస్‌ కటర్‌ ఆవిష్కరించాడు.. ఇలా ఎన్నో సమస్యలకు చెక్‌ పెట్టేలా సరికొత్త ఆవిష్కరణలు చేసిన ఆ కుర్రాడు ముప్పారపు రాజు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'ఫిన్‌టెక్‌'దే హవా!

దేశంలో 'ఫిన్​టెక్' సంస్థలే వేగంగా వృద్ధి చెందుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 50 సాంకేతిక సంస్థల జాబితాను 'డెలాయిట్ టచీ తోమత్సు' విడుదల చేసింది. ఇందులో తొలి పది స్థానాల్లో ఉన్న సంస్థల ఆదాయం 2018-2020 మధ్య రూ.21 కోట్ల నుంచి రూ.400 కోట్లకు ఎగబాకింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చైనా దూకుడుకు పగ్గాలు

బ్రహ్మపుత్ర నదిపై వరుస ప్రాజెక్టులను నిర్మిస్తున్న చైనా.. తాజాగా మరో భారీ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు ప్రకటిస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నట్లు చైనా పేర్కొంది. ఈ ప్రాజెక్టు కారణంగా భారత్​ సహా బంగ్లాదేశ్, మయన్మార్​లపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ తర్వాత ఎవరో?

స్పిన్​ బౌలింగ్​లో రివర్స్​ స్వీప్​ ఎవరైనా ఆడుతారు.. కానీ, పేసర్ల బౌలింగ్​లో కొట్టాలంటే కాస్త ఇబ్బందే. దూసుకొచ్చే బంతులను అవలీలగా స్టాండ్స్​లోకి పంపిస్తున్నాడు భారత యువ బ్యాట్స్​మెన్ రిషభ్ పంత్. ఇటీవల అండర్సన్​ బౌలింగ్​లో రివర్స్​ షాట్​ కొట్టి ఔరా అనిపించిన రిషభ్​. తాజాగా టీ-20లో ఆర్చర్​ బౌలింగ్​లో మరోసారి ఈ షాట్​ను ఆడాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • డ్రగ్స్ కేసులో నటుడు తనీష్​

టాలీవుడ్ నటుడు తనీష్​కు బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. ఓ డ్రగ్​ కేసుకు సంబంధించి శనివారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.